విద్యా ప్రవేశ్ 1 , 2 తరగతులు 7వ రోజు (04.07.2025 ) తరగతి సంసిద్ధతా కార్యక్రమం
తెలుగు
కధ : ఏదైనా ఒక కథకు సంబంధించిన కృత్యాన్ని నిర్వహించాలి..ఆ కథను పిల్లలకు చెప్పాలి.పిల్లల్లో ఒకరిని కథను తన సొంతమాటల్లో చెప్పమని అడగాలి. తర్వాత కథ గురించి ఎలా? ఎందుకు? లాంటి ప్రశ్నలు అడుగుతూ చర్చించాలి.
ధ్వని ఆటలు :
వేర్వేరు జంతువుల అరుపులలో తేడాలు గుర్తించమని.
అక్షరాలతో ఆట:
పిల్లలకు ఇప్పటివరకు నేర్పించిన అక్షరాలు వెతికించే ఆట ఆడించాలి.
వ్రాయడం:
ఏదైనా ఒక కథను బొమ్మల రూపంలో గీసి పిల్లలకు వివరించాలి..
పాట-పద్యం:
ఆనందం ఆనందం మాటలే పిల్లల ఆనందం అనే పాటని కొంతమంది పిల్లలతో పాడించాలి.
ENGLISH
What's missing :
పిల్లలకు తెలిసిన ఐదు తరగతి గదిలో ఉండే వస్తువులను తీసుకొని వాటిని పిల్లలకు చూపించాలి. ఆ వస్తువులను ఏదో ఒక ట్రే లో లేదా టేబుల్ పైన ఉంచాలి. అన్ని వస్తువులని ఒక గుడ్డతో కప్పి ఉంచాలి. అందులో నుండి నెమ్మదిగా ఒక వస్తువుని తీసివేసి పిల్లలను పిలిచి ఏ వస్తువు మిస్ అయిందో చెప్పమని అడగాలి.
ఎవరైతే చక్కగా జవాబులు చెప్పగలుగుతారో వారిని మెమరీ మాస్టర్ గా గుర్తించి అభినందించాలి.
Maths
Pattern train :
ఏదైనా ఒక pattern తీసుకుని దానిని మరలా మరలా రిపీట్ అయ్యేదా అమర్చాలి.
Ex: red-blue-red- blue...
పిల్లలను ఆ పాటల్లో ఆ తర్వాత ఏది వస్తుందో చెప్పమని అడగాలి. ఇలా తరగతుల విద్యార్థులు అందరి చేత చేయించాలి. ఎవరైతే చక్కగా చేయగలిగారో వారికి pattern builder badge ఇచ్చి పిల్లలను చప్పట్లతో అభినందింప చేయాలి.
Readiness activity
Shadow match game:
ఏవైనా కొన్ని నిజమైన వస్తువులను మరియు వాటి నీడలు ఉండే కార్డులను తీసుకోవాలి. ఒకవైపు వస్తువులను మరొకవైపు వాటి నీడలను వివిధ క్రమాలలో అమర్చి వాటిని జతపరచమనాలి. ఈ విధంగా పిల్లలను వ్యక్తిగతంగాను మరి గ్రూపులుగా విభజించి జత పరచమనాలి. ఎవరైతే చక్కగా జతపరిచారో వారిని చప్పట్లతో అభినందింప చేయాలి.