విద్యా ప్రవేశ్ 1 , 2 తరగతులు 8వ రోజు (05.07.2025 ) తరగతి సంసిద్ధతా కార్యక్రమం
తెలుగు
కధ : ఏదైనా ఒక కథకు సంబంధించిన కృత్యాన్ని నిర్వహించాలి..ఆ కథను పిల్లలకు చెప్పాలి.పిల్లల్లో ఒకరిని కథను తన సొంతమాటల్లో చెప్పమని అడగాలి. తర్వాత కథ గురించి ఎలా? ఎందుకు? లాంటి ప్రశ్నలు అడుగుతూ చర్చించాలి.
ధ్వని ఆటలు :
కథలోని పదాలలో ఎన్ని పనులు ఉన్నాయి చెప్పమనాలి
అక్షరాలతో ఆట:
పిల్లలకు ఇప్పటివరకు నేర్పించిన అక్షరాలు వెతికించే ఆట ఆడించాలి.
వ్రాయడం:
నేను చెప్తాను మీరు చేయండి అంటూ పిల్లలకు కొన్ని అక్షరాలు చెప్పి రాయించాలి.
పాట-పద్యం:
తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అనే పాటని పాడి వినిపించి ఆ తరువాత కొంతమంది పిల్లలతో పాడించాలి.
ENGLISH
Who am I ? :
ఏవైనా కొన్ని జంతువులు లేదా వస్తువుల గురించి పిల్లలకు వివరించి వాళ్ళు జాగ్రత్తగా వినేలా చేయాలి. తర్వాత టీచర్ ఆ పిల్లలను ఈ వస్తువు లేదా జంతువును గురించి రెండు లేదా మూడు clues ఇస్తూ Who am I ? అని అడగాలి. ఇలా విద్యార్థులందరినీ అడగాలి.
ఎవరైతే చక్కగా జవాబులు చెప్పగలుగుతారో వారిని రriddle champion గా గుర్తించి అభినందించాలి.
Maths
Spot the difference :
ఓకే రకంగా ఉండే రెండు పిక్చర్స్ ను తీసుకోవాలి. వాటిలో గల తేడాను ఒకదాన్ని వివరించాలి. మిగతా తేడాలను గుర్తించమని పిల్లల్ని అడగాలి. ఆ గుర్తించిన తేడాలను గట్టిగా చెప్పమనాలి. అలా చెప్పిన పిల్లలను difference detective గా ప్రకటించి
చప్పట్లతో అభినందింప చేయాలి.
Readiness activity
Flash light hide seek game:
తరగతులు ఉన్నటువంటి అన్ని వస్తువులను గమనించమని పిల్లలతో చెప్పాలి. తరువాత తరగతి గదిని వీలైనంత తక్కువ వెలుతురు ఉండేలా చేయాలి. ఒక ఫ్లాష్ లైట్ తీసుకుని తరగతుల వివిధ వస్తువులపై వేయాలి. ఎవరైతే ఆ వస్తువు పేరు సరిగ్గా చెప్పారో వారిని అభినందించాలి. ఇలా తరగతుల గల విద్యార్థులు అందరి చేత ఆడించాలి. బాగా చెప్పిన వారిని చప్పట్లతో అభినందింప చేయాలి.