3 మరియు 5 తరగతుల 7వ రోజు 04.07.2025 తరగతి సంసిద్ధతా కార్యక్రమం
తెలుగు
గుణింతాల పరిచయం:
ప గుణింతపు అక్షరాల చార్టును చూపించాలి. గుణింత అక్షరాలను టీచర్ పలుకుతూ విద్యార్థులచే పదేపదే పలికించాలి. ప్రతి గుణింత అక్షరాన్ని స్పష్టంగా పలకడం మరియు చూపించడం చేయాలి.తర్వాత వర్క్ బుక్ లో లేదా అక్షర పట్టికలో ప్రతి గుణింత అక్షరాన్ని గుర్తించమనాలి.
ఆట:
చేపల పట్టు - గుణింత ఆక్షరం చెప్పు :
ప్రతి గుణింత అక్షరంతో కాగితపు చేపలను తయారు చేయాలి విద్యార్థులను కర్రకు మాగ్నెట్ లేదా హుక్కు కట్టి చేపలను పట్టుకోమని చెప్పాలి ఎంచుకున్న చేప పైన ఉన్న గుణింత అక్షరాన్ని స్పష్టంగా పలకమనాలి. సరైన ఉచ్చారణ కోసం ప్రోత్సహించాలి. సరిగ్గా చెప్పిన పిల్లలను అభినందించాలి.
ENGLISH
My body :
ముందు రోజు పిల్లలకు చెప్పిన Eye, Ear, Nose, Hand, Leg వంటి బాడీ పార్ట్స్ ను రివైజ్ చేయాలి. మ్యాగ్నెటిక్ అక్షరాలు లేదా అట్టపై వ్రాసిన అక్షరాలు ఉపయోగించి బాడీ parts ను స్పెల్లింగ్ పేర్చమని చెప్పాలి. పిల్లలను బాడీ పార్ట్స్ ను నోట్ బుక్ పై లేదా బోర్డుపై రాయమని చెప్పాలి. బాడీ పార్ట్స్ లో లెటర్స్ ను jumble చేసి పిల్లల్ని సరిగా పేర్చమనాలి. చక్కగా అభ్యాసాలు చేసిన పిల్లలను అభినందించాలి.
Maths
subtraction stories :
చిన్నచిన్న కథలు తో తీసివేత లను నేర్పించాలి. నా దగ్గర ఐదు చాక్లెట్లు ఉన్నాయి నేను రెండు చాక్లెట్లు తిన్నాను ఇంకా ఎన్ని ఉంటాయి ఈ రకంగా ప్రశ్నలు అడగాలి. అదేవిధంగా పిల్లల్ని కూడా సొంతంగా ఇటువంటి కథలు చెప్పమని తీసివేతలు చేయించాలి.
Game :
Frog jump backward :
నేలపై వరుసగా గడులు గీసి వాటిలో కొన్ని అంకెలు రాయాలి. పిల్లలను ఏదో ఒక అంకెపై నించుని ఆ అంకెనుండి రెండు లేదా మూడు గడులు వెనక్కు కప్పల దూకమని చెప్పాలి.
అప్పుడు ఆ దూకిన గడిలో ఏ అంకె ఉందో చెప్పమనాలి. ఈ విధంగా వారికి తీసివేతలు నేర్పించాలి. ఎవరైతే చక్కగా చేశారో వారిని పిల్లలందరితో చప్పట్లు కొట్టించి అభినందించాలి.