మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

Day 6 readiness program activities for 3 and 5 classes

3 మరియు 5 తరగతుల 6 వ రోజు  03.07.2025  తరగతి సంసిద్ధతా కార్యక్రమం 

 తెలుగు 

 గుణింతాల పరిచయం:

 క గుణింతపు అక్షరాల చార్టును చూపించాలి. గుణింత అక్షరాలను టీచర్ పలుకుతూ విద్యార్థులచే పదేపదే పలికించాలి. తర్వాత వర్క్ బుక్ లో లేదా అక్షర పట్టికలో ప్రతి గుణింత అక్షరాన్ని గుర్తించమనాలి.


ఆట:

గుణింతహారము:


 ప్రతి గుణింత అక్షరంతో ఉన్న చిన్న కార్డును పుష్పాల ఆకారంలో తయారు చేయాలి. ఒక్కో విద్యార్థి ఒక పుష్పాన్ని ఎంచుకొని అందులో ఉన్న గుణింత అక్షరాన్ని పలకాలి. తర్వాత పుష్పాలను ఒక దారంతో గుచ్చాలి.చివరికి ఒక గుణింతహారము తయారవుతుంది. పిల్లలు కనీసం 5 గుణింత అక్షరాలను గుర్తించి చదవగలగాలి.


 ENGLISH 


 My body :


Eye, Ear, Nose, Hand, Leg వంటి 5 బాడీ పార్ట్స్ ను బొమ్మలతో చూపించాలి. ప్రతి పార్ట్ ను చూపెడుతూ పిల్లలతో  గట్టిగా చెప్పించాలి.

This is my nose....

These are my ears... ఈ విధంగా సెంటెన్స్ లు చెప్పించాలి.

 ఒకవైపు బాడీ పార్ట్శ్ యొక్క బొమ్మలను మరోవైపు బాడీ పార్ట్శ్ పేర్లను రాయాలి పిల్లల్ని వేపించి వాటిని జతపరచమని చెప్పాలి.

Game: 

 టీచర్ పిల్లలకు ఏదో ఒక బాడీ పార్ట్ పేరు చెప్పాలి అప్పుడు పిల్లలు టీచర్ చెప్పిన ఆ బాడీ పార్ట్ ను తమ చేతితో ముట్టుకొని చెప్పగలగాలి. అలా పిల్లలందరిసె చేయించాలి. ఎవరైతే చక్కగా అలా చేశారో వారిని చప్పట్లతో అభినందించాలి.


Maths 


Introduction to subtraction :


 ఒక ప్రదేశంలో కొన్ని వస్తువులను ఉంచి వాటిలో కొన్ని వస్తువులను తీసుకోవడం ద్వారా పిల్లలకు తీసివేత ప్రక్రియ నేర్పించాలి.

 5 లేదా 10  ఇలా పిల్లలకు తెలిసేలా కొన్ని  పండ్లు, బొమ్మలు లేదా బ్లాక్స్ ను ఒక బుట్టలో ఉంచాలి. పిల్లలకు కనిపించేలా వాటిలో కొన్ని వస్తువులను లెక్కపెడుతూ తీయాలి. ఇంకా ఎన్ని వస్తువులు ఉన్నాయో పిల్లలను లెక్కపెట్టి చెప్పమనాలి.

 ఇదే ప్రక్రియను పిల్లల చేత మరలా మరలా కొనసాగింప చేయాలి.

 పిల్లలకు గోళీలు మొదలైన వస్తువులు ఇచ్చి అందులోంచి కొన్ని వస్తువులు తీసుకుని మిగతా ఎన్ని మిగిలాయో  చెప్పమనాలి. ఈ విధంగా ఎవరైతే చక్కగా చేస్తారో వారిని చప్పట్లతో అభినందించాలి.

LATEST POSTS

Day 6 readiness program activities for 3 and 5 classes

3 మరియు 5 తరగతుల 6 వ రోజు  03.07.2025  తరగతి సంసిద్ధతా కార్యక్రమం   తెలుగు   గుణింతాల పరిచయం:  క గుణింతపు అక్షరాల చార్టును చూపించాలి. గుణింత...