విద్యా ప్రవేశ్ 1 , 2 తరగతులు 6 వ రోజు (03.07.2025 ) తరగతి సంసిద్ధతా కార్యక్రమం
తెలుగు
కధ : ఏదైనా ఒక కథకు సంబంధించిన కృత్యాన్ని నిర్వహించాలి..ఆ కథను పిల్లలకు చెప్పాలి.పిల్లల్లో ఒకరిని కథను తన సొంతమాటల్లో చెప్పమని అడగాలి. తర్వాత కథ గురించి ఎలా? ఎందుకు? లాంటి ప్రశ్నలు అడుగుతూ చర్చించాలి.
ధ్వని ఆటలు :
వేర్వేరు వస్తువుల శబ్దాల గురించిన ఆటాడించాలి
అక్షరాలతో ఆట:
టీచర్ ఏమి చెప్పారో పిల్లలు అదే చేసేలా వారిని ఆడించాలి.
వ్రాయడం:
టీచర్ ఏమి రాశారో పిల్లలు కూడా అలాగే రాయమనాలి.
పాట-పద్యం:
ఆనందం ఆనందం మాటలే పిల్లల ఆనందం అనే పాటని పెద్ద సమూహంతో పిల్లలకు నేర్పి పాటించాలి.
ENGLISH
Emotion mirror :
పిల్లలకు రకరకాల ఎమోషన్స్ ను టీచర్ ఏ విధమైన మాటలు మాట్లాడకుండా తమ యొక్క అభినయంతో చూపించాలి. పిల్లలను జాగ్రత్తగా గమనించమనాలి. Angry, happy, sad, surprise మొదలైన ఫీలింగ్స్ ను అభినయంతో చూపాలి. పిల్లలను అభినయాలను వివరించి చెప్పమనాలి. ఎవరైతే ఎక్కువ విషయాలు చెప్పగలరు వారిని Best mirror actor గా ప్రకటించి అభినందించాలి
Maths
Touch and tell :
Soft, hard, rough ఇలా వివిధ రకాలుగా ఉండేటటువంటి వస్తువులను పిల్లలకు ఇచ్చి ముట్టుకుని అది ఎలా ఉందో చెప్పమనాలి. ఒక్క ఒక క్లాత్ బ్యాగులు ఎరేజర్ స్పూన్ స్పాంజ్ లాంటి వస్తువులను ఉంచాలి. ఒక్కొక్క పిల్ల వాడిని పిచ్చి సంచి లోపల చెయ్యి పెట్టి ఏదో ఒక వస్తువుని ముట్టుకుని అది ఎలా ఉందో చెప్పమనాలి. ఎవరైతే బాగా చెప్పగలిగారు వారికి tactile star అవార్డు ఇచ్చి అభినందించాలి.
Readiness activity
రంగురంగుల కప్పులు మరియు పూసలను తీసుకోవాలి. ఆ కప్పులను విడివిడిగా ఉంచాలి. వేరొక చోట అన్ని రంగులు కలిసిన పూసలు ఉంచాలి. ఈ పూసలను ఆ పూస ఏ రంగులో ఆ రంగు పేరుని గట్టిగా పైకి చెప్పి అదే రంగు కప్పులో వేయమని పిల్లలకు చెప్పాలి. ఇలా ఎవరైతే తక్కువ సమయంలో ఎక్కువ పూసలు వేశారో వారిని colour champion గా ప్రకటించి అభినందించాలి.