ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. రామయ్య చాలా నిజాయితీ గలవాడు. ప్రతి రోజు పొలంలో కష్టపడి వ్యవసాయం చేసి, తన కుటుంబాన్ని పోషించేవాడు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి అతని మీద గౌరవం ఉండేది.
ఒక రోజు రామయ్య పొలంలో పని చేస్తూ ఉండగా తన ఇనుప పార బావిలో పడిపోయింది. అతను చాలా బాధపడ్డాడు. అప్పుడు ఆ బావిలోంచి దేవత బయటకు వచ్చి, "నీవు ఎందుకు బాధపడుతున్నావు?" అని అడిగింది.అప్పుడు రామయ్యు నా పార బావిలో పడిపోయిందని చెప్పాడు.
దేవత బంగారు పార, వెండిపార , చివరగా అతని ఇనుప పార ను చూపించింది. రామయ్య నిజాయితీగా “ఇనుప పార నాది” అని చెప్పాడు. దేవత అతని నిజాయితీకి మెచ్చి, మూడు పార లనూ అతనికి బహుమతిగా ఇచ్చింది.