అన్ని యాజమాన్య పాఠ శాల ల హెడ్ మాస్టర్ లు 14-05-2022 తేదీ లోగా పేరెంట్స్,టీచర్స్ మరియు విద్యార్థులతో మీటింగ్ పెట్టుకొని we love reading కార్యక్రమం గైడ్ లైన్స్ వివరించి కార్యక్రమ నిర్వహణకు పేరెంట్స్ మరియు కమ్యూనిటీ సహాయం కోరాలి.
తదుపరి విద్యార్థులకు టీచర్ల సహాయం తో లైబ్రరీ పుస్తకాలు వారి సామర్థ్యాల మేరకు ఎంపిక చేసి ఇవ్వాలి.
సెలవులలో ఆ పుస్తకాలను చదవమని ప్రోత్సహించాలి.
ఒక పుస్తకం చదివిన తరువాత అదే గ్రామంలోని ఇతర విద్యార్థులతో ఆపుస్తకాన్ని ఎక్స్ చేంజ్ చేసుకోవాలి అని విద్యార్థులకు తెలియజేయండి.
విద్యార్థులకు పుస్తక పఠనం పై అవగాహన కల్పించి ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులు వారికి సరైన మార్గదర్శనం చేయాలి.
30 రోజుల తరువాత విద్యార్థులను పాఠ శాల కు పిలిపించి పాత పుస్తకాలను వెనక్కి తీసుకొని కొత్త పుస్తకాలను ఇవ్వాలి.
స్కూల్ రీ ఓపెనింగ్ డే రోజున విద్యార్థులకు వారు చదివిన పుస్తకాల పై స్టోరీ టెల్లింగ్,స్టోరీ రైటింగ్, ఎలక్యూషన్,డిబేట్,డిస్కషన్,డ్రామా, ప్లేలెట్,మోనో యాక్షన్ మొదలైన పోటీలు నిర్వహిస్తామని వారికి తెలియజేయండి.
ఈ వేసవి సెలవులలో 20 అంతకంటే ఎక్కువ పుస్తకాలు చదివిన వారికి సర్టిఫికెట్లు మరియు బహుమతులు ఇస్తామని తెలియజేయండి.
మండల విద్యాధికారులు మీ మండలాల అన్ని యాజమాన్య పాఠ శాలల ప్రధానోపాధ్యాయులు కు మీటింగ్ నిర్వహించి, వేసవి సెలవులలో నిర్వహించాల్సిన we love reading కార్యక్రమం గురించి వివరించి అన్ని పాఠ శాల ల్లో కార్యక్రమం నిర్వించులాగున చర్యలు తీసుకోవాలి మరియు పర్యవేక్షించాలి.