విద్యాప్రవేశ్ -81 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy
Theme-People Who Help Us:
పిల్లలతో వారి కుటుంబ సభ్యులతో ఏ ఏ పనులు చేస్తారో చెప్పించాలి. అలాగే కుటుంబ సభ్యులు కాక ఇంకా ఇతర వ్యక్తులు ఎవరెవరు వారికి సహాయం చేస్తారో పిల్లలతో సంభాషించాలి.
Cognitive Development
గడియారం సమయాలను మార్చుతూ బోర్డు మీద సమయాన్ని గంటలలో చూపుతూ ఎంత సమయం అయ్యిందో చర్చించాలి. ఒక్కొక్కరు సమయాన్ని చెబుతూ ఆ సమయంలో వారు ఏమి చేశారు చెప్పాలి.
Physical Development
పేపర్ గ్లాసులతో పిరమిడ్
పేపర్ గ్లాసులను పిల్లలతో పిరమిడ్ ఆకారంలో పెట్టించాలి. పిరమిడ్ పడిపోతూ ఉన్న మరలా ప్రయత్నించేలా చేయాలి.