విద్యా ప్రవేశ్ 1 , 2 తరగతులు 17 వ రోజు (18.07.2025 ) తరగతి సంసిద్ధతా కార్యక్రమం
తెలుగు
కధ : కథకు సంబంధించిన కృత్యాలను నిర్వహించాలి ఆ కథను పిల్లలకు చెప్పాలి తర్వాత పిల్లల్లో ఒకరిని కథ మొత్తం సొంత మాటలలో చెప్పమని అడగాలి ఆ తర్వాత కథ గురించి ఎలా ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ చర్చించాలి.
ధ్వని ఆటలు :
ధ్వనులను విని రెండక్షరాల పదాలను చెప్ప మనాలి
అక్షరాలతో ఆట:
తెలుగు మరియు ఇంగ్లీష్ లలో మనం చెప్పిన అక్షరంతో మొదలయ్యే పదాలు చెప్పమనాలి
వ్రాయడం:
వాళ్ళకు నచ్చింది ఏదైనా ఒకటి రాయమని పిల్లలకు చెప్పాలి
పాట-పద్యం:
చిన్న పడవ పెద్ద పడవ పాటను కొంతమంది విద్యార్థులచే పాడించాలి.
ENGLISH
Story time with finger pointing:
ఏదైనా ఒక కథను టెస్ట్ బుక్ నుండి ఎంచుకొని వాటిని మనం నెమ్మదిగా చదువుతూ ప్రతి పదం చదివేటప్పుడు పిల్లలను ఆ పదం దగ్గర వేలు పెట్టమని చెప్పాలి. మనం చెప్పిన తర్వాత పిల్లలను కూడా ఆ పదం చెప్పమనాలి. ఎవరైతే పిల్లలు సరిగ్గా మనం చెప్పిన పదం దగ్గర వేలు కదుపుతూ ఉంటారో వారిని pointer star గా అభినందించాలి.
Maths
What happens next?
ఏదైనా ఒక కథ తీసుకొని గట్టిగా చదువుతూ సస్పెన్స్ వచ్చినచోట ఆపాలి. అక్కడ ఏమి జరుగుతుంది అని పిల్లల్ని అడగాలి. ఈ విధంగా పిల్లలకు బాగా తెలిసినటువంటి చిన్న మరియు అందరికీ తెలిసిన ఇతివృత్తంలో గల కథలు ఎంచుకోవాలి. ఎవరైతే ఏమి జరుగుతుందో సరిగ్గా ఊహిస్తారో వారిని predict-o-star గా బిరుదుచ్చి చప్పట్లు తో అభినందించాలి.
Readiness activity
Guess the instrument
ఒక స్క్రీన్ వెనక ఉండి ఏదైనా ఒక సంగీత వాయిద్యాన్ని వాయించాలి Ex; Tambourine, apusXylophone, maracas or drum.
ఆ శబ్దం విని అది ఏ సంగీత వాయిద్యమో చెప్పమని పిల్లల్ని అడగాలి. ఎవరైతే చక్కగా జవాబు చెప్పారు వారిని చప్పట్లతో అభినందించాలి.