మన బడి మన భవిష్యత్తు ( నాడు నేడు ) యాప్ ను ఇక నుండి ప్లే స్టోర్ నుండి పొందవచ్చును, కాబట్టి ముందుగా పాత యాప్ ను పూర్తిగా un install చేయండి. యాప్ ఈరోజు (Oct 28) కొత్త వెర్షన్ 3.1.7 కి అప్డేట్ అయ్యింది. పాత యాప్ పనిచేయదు, Nadu Nedu Phase1, 2 పాఠశాలలు ఈ అప్డేట్ యాప్ ని క్రింది సైట్ ద్వారా Install చేయాల్సి ఉంటుంది
APTET July 2024 Question Papers and final Answer keys released
AP TET 2024 October 3 నుండి జరిగిన అన్ని సెషన్స్ , అన్ని కేటగిరీ ల TET పరీక్షా ప్రశ్న పత్రాలు మరియు ఫైనల్ కీ జవాబు లను విడుదల చేసిన విద్యాశాఖ.
Revised Time table Self assesment model paper -2
SAMP 2 పరీక్షలు 4-11-24 నుండి 8-11-24 వరకు జరుగును. సవరించబడిన పరీక్షల తేదీలు
1 నుండి 5 తరగతులు
6-11-24 ( బుధవారం ) తెలుగు,లెక్కలు
7-11-24 ( గురువారం ) - ఈవీఎస్, ఇంగ్లీషు
6 నుండి 10 తరగతులు
4-11-24 ( సోమవారం )-OSSC 1&2
6-11-24 ( బుధవారం ) తెలుగు,లెక్కలు
7-11-24 ( గురువారం ) - హిందీ, సైన్స్
8-11-24 ( శుక్రవారం ) - ఇంగ్లీష్, సోషల్.
పాఠశాల విద్యా సమీక్ష & మెగా పేరంట్ - టీచర్ మీటింగ్ (PTM) నవంబర్ 14న ముఖ్య మార్గదర్శకాలు మరియు కార్యక్రమాలు.
1. Self Assessment మార్కులు అప్‌లోడ్
నవంబర్ 10 లోపు Self Assessment Marks 1 & 2 పరీక్షల మార్కులు అప్‌లోడ్ చేయాలి.
2. మెగా పేరంట్ టీచర్ మీటింగ్
"పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు" అనే నినాదంతో ఈ మీటింగ్ నిర్వహించాలి.
3. ప్లానింగ్ మరియు నిర్వహణ
సమావేశానికి ముందు, నిర్వహణ సమయంలో మరియు తర్వాతి పనుల కోసం తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలి.
4. నాయకుల భాగస్వామ్యం
ముఖ్యమంత్రి నుండి స్థానిక నేతల వరకు వివిధ అతిథులను పిలిచి ఉత్సాహపరచాలి.
5. సమావేశ షెడ్యూల్
PTM కోసం పట్టిక/సమయపట్టిక ముందుగానే అందజేస్తారు.
6. విద్యార్థుల ప్రగతి చర్చ
విద్యార్థుల విద్యా ప్రగతిని తల్లిదండ్రులతో చర్చించాలి.
7. వ్యక్తిగత విద్యార్థి విశ్లేషణ
ప్రతి విద్యార్థి వ్యక్తిగత ప్రగతిని తల్లిదండ్రులతో పంచుకోవాలి.
8. తరగతి మొత్తం విశ్లేషణ
తరగతి స్థాయి ప్రగతి వివరాలను తల్లిదండ్రుల ముందు ఉంచాలి.
9. గురువుల బాధ్యత
విద్యార్థుల ప్రగతి గురించి తల్లిదండ్రుల పట్ల ఉపాధ్యాయులు బాధ్యత వహించాలి.
10. ప్రోగ్రెస్ కార్డు చర్చ
విద్యార్థి ప్రోగ్రెస్ కార్డు పై వివరంగా చర్చించాలి.
11. హాజరు శాతం సమీక్ష
విద్యార్థుల హాజరును సమీక్షించి మెరుగుపర్చే మార్గాలను సూచించాలి.
12. విద్యార్థుల ప్రవర్తన, ప్రతిభ మరియు బలహీనతలు
ప్రవర్తన, ప్రతిభ మరియు మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు గురించి మాట్లాడాలి.
13. పంక్తి మరియు సమయపాలన
సమయపాలన మరియు క్రమశిక్షణ ప్రాముఖ్యతను వివరించాలి.
14. తల్లిదండ్రులకు విద్యార్థుల సక్రియత
విద్యార్థులు పాఠశాల కార్యకలాపాలను తల్లిదండ్రులతో పంచుకోవాలని ప్రోత్సహించాలి.
15. తల్లిదండ్రుల కోసం పోటీలు
తల్లుల కోసం రంగోలి పోటీ
తండ్రుల కోసం టగ్ ఆఫ్ వార్
16. తల్లిదండ్రులు మరియు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
సక్రియ తల్లిదండ్రులు మరియు విద్యార్థుల సహకారంతో సాంస్కృతిక కార్యక్రమాలు.
17. పాఠశాల ప్రగతి నివేదిక
హెడ్‌మాస్టర్ పాఠశాల ప్రగతిని వివరించాలి, ఇందులో:
విద్యా ఫలితాలు, చేరికలు, డ్రాప్ ఔట్ రేట్లు సాధనలు లభ్యమయ్యే సదుపాయాలు మరియు అవసరాలు పాఠశాలకు అందించిన సహాయాలు
18. పాఠశాల అభివృద్ధి పై ప్రసంగాలు
SMC అధ్యక్షుడు, సక్రియ తల్లులు, దాతలు లేదా ప్రజా ప్రతినిధులు పాఠశాల అభివృద్ధి, ఉపాధ్యాయుల కృషిపై ప్రసంగాలు ఇవ్వాలి.
19. తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మాట్లాడుట
తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య విపులంగా చర్చలు జరపాలి మరియు చివరలో కృతజ్ఞతలు తెలపాలి.
20. "శుభ్ దిన్ భోజన్" ప్రత్యేక భోజనం
సమావేశం ముగింపు సందర్భంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం ప్రత్యేక భోజనం ఏర్పాటు చేయాలి.
ఈ మేగా PTM తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి విద్యార్థుల మరియు పాఠశాల అభివృద్ధికి సైతం సహకరించే దిశగా ప్రోత్సహించడానికి నిర్వహించ బడుతుంది.
AP School Grants and MRC Grants Released for 2024-25 financial year
పాఠశాల కాంపోజిట్ గ్రాంట్స్,MRC గ్రాంట్స్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి 50% విడుదల. స్కూల్ గ్రాంట్స్, MRC గ్రాంట్స్ వినియోగం మార్గదర్శకాలు, ఉత్తర్వులు క్రింది వెబ్ పేజీలో కలవు.
CCE MARKS ENTRY ENABLED IN CSE WEBSITE
CCE Self Assessment మార్క్స్ ఇప్పుడు మనం మన ఫేషియల్ అటెండెన్స్ ఆప్ లోనే కాకుండా CSE సైట్ లో కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేసే లింక్
ఇప్పటికే స్కూల్ అటెండెన్స్ యాప్ లో నమోదు చేసిన SAMP 1 మార్కుల వివరాలు CSE వెబ్సైట్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. వాటిని సేవ్ చేస్తే సరిపోతుంది. వెంటనే సబ్మిట్ అవుతాయి.
పై లింకులో స్కూల్ అటెండెన్స్ యాప్ యొక్క వ్యక్తిగత యూజర్ ఐడి, పాస్వర్డ్ ను ఉపయోగించి లాగిన్ అయిన తర్వాత Services లో CCE మార్క్స్ ఆప్షన్ లోకి వెళ్లి మనకు మ్యాప్ చేయబడిన తరగతిలో విద్యార్థులను సెలెక్ట్ చేసిన తర్వాత మార్కులు రిఫ్లెక్ట్ అవుతాయి. ఒక్క మీడియం మాత్రమే సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
Note :- మొబైల్ ఫోన్లో చేయాలనుకున్నవారు Firefox browser ద్వారా మాత్రమే చేయగలరు.త్వరగా అవుతాయి.
Revised Time table Self assesment model paper -2 exams
SAMP 2 షెడ్యూల్ లో మార్పు. SAMP 2 నవంబర్ నెల 5వ తేదీన జరగాల్సిన పరీక్ష ను 8వ తారీఖు కు మార్చడమైనది.
4-11-24 నుండి 8-11-24 వరకు జరుగును.
1 నుండి 5 తరగతులు
6-11-24 ( బుధవారం ) తెలుగు,లెక్కలు
7-11-24 ( గురువారం ) - ఈవీఎస్, ఇంగ్లీషు
6 నుండి 10 తరగతులు
4-11-24 ( సోమవారం )-OSSC 1&2
6-11-24 ( బుధవారం ) తెలుగు,లెక్కలు
7-11-24 ( గురువారం ) - హిందీ, సైన్స్
8-11-24 ( శుక్రవారం ) - ఇంగ్లీష్, సోషల్.
UDISE+ update info EP, FP
యుడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ లో విద్యార్థి యొక్క EP, FP ప్రొఫైల్స్ ను అప్డేట్ చేసే ఆప్షన్ ఎనేబుల్ అయినది.
AP TET ALL Response sheets download
ఏపీ టెట్ Response sheets &key కి రిలీజ్ చేశారు ఒకసారి చెక్ చేసుకోండి
https://aptet.apcfss.in/CandidateLogin.do
https://aptet.apcfss.in/TETQpsKeysReport.do
Vidya pravesh day 87 activities for 1st class
విద్యాప్రవేశ్ -87 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
పిల్లలను వారు జరుపుకునే వివిధ పండుగల గురించి మాట్లాడించాలి. అలాగే జాతీయ పండుగల గురించి కూడా సంభాషించాలి.
cognitive Development
రకరకాల కూరగాయ ముక్కలు,ఆకులు, పువ్వులు తీసుకుని చీకటి రంగు నీటిలో ముంచుతూ bouquet రూపంలో print painting చేసి ప్రదర్శించి చర్చించాలి.
Physical Development
గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడం నేర్పించాలి.
Vidya pravesh day 85 activities for 1st class
విద్యాప్రవేశ్ -85 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy
Singing Phonic Sound Rhyme (A for apple, A for ant/a/a/a/... or /a/a/a/ant On My Arm) By Using Video And Audio
Cognitive Development
పిల్లల్ని అర్థచంద్రాకారంలో కూర్చోబెట్టి టీచర్ పిల్లలచే నీటిలో "కరిగేవి-కరగనివి" చెప్పించాలి. గాజు పాత్రలో పంచదార, నూనె, పిండి, ఉప్పు, ఇసుక, మట్టి కలుపుతూ చేయించాలి. చర్చించాలి
Physical Development
బాల్ విసిరినప్పుడు బ్యాట్ తో కొట్టడం. (Cricket).
Ap cabinet meeting key decisions
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం – కీలక నిర్ణయాలు:
1. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రూపకల్పనకు ఆమోదం
2. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0 (2024 – 2029) ఆమోదం
3. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 (2024 – 2029) ఆమోదం
4. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0
(2024 – 2029) ఆమోదం
5. 'ప్లగ్ అండ్ ప్లే' ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 4.0 (2024-29)తో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి నూతన పాలసీకి ఆమోదం
6. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0 (2024 – 2029) కి ఆమోదం
7. కృష్ణా జిల్లా మల్లవల్లిలోని ఇండస్ట్రియల్ పార్కుకు సంబంధించిన కొన్ని సమస్యలపై ఏపీఐఐసీ ప్రతిపాదించిన ప్రణాళికకు ఆమోదం
8. దాదాపు 150 ఎకరాల్లో అందుబాటులో ఉన్న ప్లాట్లను 349 మంది కేటాయింపుదారులకు తిరిగి కేటాయించడంతో పాటు లేఅవుట్‌ను క్రమబద్ధీకరించడం జరుగుతుంది.
9. అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్కులో ప్లాట్ల రేట్లపై కేటాయింపుదారుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వం గతంలో జారీచేసిన G.O.Ms.No.78 I&C Dept., Dt.19.05.2017లో నిర్ణయించిన రేటు ప్రకారం ఎకరం రూ.16.50 లక్షలకు కేటాయించాలని చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
10. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పథకం కింద మల్లవల్లిలో మౌలిక సదుపాయాల కల్పన పనులకుగాను రూ.1,000 కోట్ల రుణానికి ప్రభుత్వ హ్యండ్ హోల్డింగ్ కు ఏపీఐఐసీ చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
11. 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకై మంత్రుల బృందాన్ని( క్యాబినెట్ సబ్ కమిటీ) ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం
12. ధరల పర్యవేక్షణ, నియంత్రణ , మార్కెట్ లో జోక్యంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
13. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, అక్రమ మద్యం, బాధితుల పునరావాసం వంటి తదితర అంశాలపై అధ్యయనం చేయడంతో పాటు సిఫార్సులు చేసేందుకు మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
14. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లోగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
15. రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మాదకద్రవ్యాల వాడకం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో,ఆంధ్రప్రదేశ్ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ఏపీ ఏఎన్టీఎఫ్) ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడంతో పాటు 26 జిల్లాల్లో నార్కోటిక్స్ పోలీసు బృందాలు ఏర్పాటుకు చేసే ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
16. ఇందులో భాగంగా ఏపీ హైకోర్టు ఆధ్వర్యంలో జిల్లాల్లో 5 ప్రత్యేక కోర్టులు లేదా 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుకు చర్యలు.
17. చెత్త పన్ను రద్దుకు కేబినెట్ తీర్మానం..
18. గ్రామీణ, పంచాయితీ, పట్టణ రహదారుల పై ఎక్కడా గుంతలు లేకుండా ఉండే విధంగా గత క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రహదారుల మరమ్మత్తులకు చేపట్టిన పనుల ప్రగతిని తెలిపే స్టేటస్ నోట్ కు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
19. గుంతల రహిత రహదారుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చాలనే తక్షణ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లన్నింటినీ యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగింది.
School Education-Supporting Andhra’s Learning Transformation (SALT) Programme- Foundational Literacy and Numeracy (ECCE)-60-day certificate course – Conduct of Training to the SGTs (Secondary Grade Teachers) for 6 days in residential mode - from 21-10-2024 to 26.10.2024(first spell) - Instructions- Issued
FLN జ్ఞాన్ ప్రకాష్ ట్రైనింగ్ సమాచారం
1 , 2 తరగతులను బోధిస్తున్న ఉపాధ్యాయులకు 6 రోజుల రెసిడెన్షియల్ ట్రైనింగ్ 21-10-24 నుండి 26-10-24 వరకు జరుగును. నిర్ణీత spells లో ట్రైనింగ్ జరుగుతుంది.
మొదటి spell 21-10-24 నుండి 26-10-24 వరకు జరుగును.
AP SCERT Official Digital Lesson Plans Download Link
ఏపీ టీచర్స్ రిసోర్స్ బుక్స్ మరియు 3rd Class నుండి 9th Class వరకు AP SCERT Official Digital Lesson Plans Download Link
Vidya pravesh day 84 activities for 1st class
SE-MBMB -SMC Bank Account Change -clarification of Issues in Mana Badi Mana Bhavishyathu Programme -Requested
మన బడి-మన భవిష్యతు కార్యక్రమం కు సంబంధించి నూతన పాఠశాల యజమాన్య కమిటీల చే అకౌంటు మార్పుపై వివరణాత్మక మార్గదర్శకాలు జారీచేసిన కమిషనర్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
Vidya pravesh day 83 activities for 1st class
విద్యాప్రవేశ్ -83 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
పిల్లలతో వివిధ రకాల రుచుల గురించి మాట్లాడించాలి. తియ్యగా ఉండేవి , పుల్లగా ఉండేవి , కారంగా ఉండేవి.
Cognitive Development
సంవత్సరంలో వచ్చే కాలాలు గురించి చర్చించాలి. మూడు సమూహాలు చేసి ఏ కాలంలో ఏ ఆహారం తీసుకుంటారో , వాతావరణం , ధరించే దుస్తులు paper cuts తో college work చేపించి ప్రదర్శించాలి.
Physical Development
ఐస్ క్రీం పుల్లలు లేదా అగ్గిపుల్లలతో ఆకారాలు చేయుట :- అంకెలు లేదా అక్షరాలపై పెట్టించాలి.
Ap TET exams model awareness videos
TET Exam రాయబోయే అభ్యర్థుల కొరకు AP CSE వారు ఎగ్జామ్ సంబంధించి అవేర్నెస్ వీడియోస్ ను తయారు చేయడం జరిగింది, ఆ వీడియో లో అన్ని TET Papers కు సంబంధించి TET Exam Pattern ఏ విధంగా ఉంది, Topics ఏమిటి, ప్రీవియస్ Exam లో Questions ఏ టాపిక్ నుండి వచ్చాయి,ఇలా వివరించడం జరిగింది. ఈ వీడియోస్ ఆన్లైన్ లో ఎలా చూడాలో క్రింది వీడియో లో చూపించడం జరిగింది
Mana badi mana bhavisyat M B M B APP updated latest version 3.1.6
మన బడి మన భవిష్యత్ యాప్ ఈ రోజు 3.1.6 వెర్షన్ కి అప్డేట్ అయ్యింది. పాత యాప్ పనిచేయదు. లేటెస్ట్ వెర్షన్ 3.1.6 యాప్ ను క్రింది లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోగలరు.
LATEST POSTS
Pareeksha pe charcha photos upload link
ఈరోజు ఫిబ్రవరి 10 పరీక్ష పే చర్చా ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు వీక్షించిన ఫోటోలు అప్లోడ్ చేయవలసిన లింక్ 2)....