మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

మ్యాపింగ్‌ వల్ల పాఠశాలలు మూతపడవు. విద్యార్థులు మాత్రమే ఒక పాఠశాల నుంచి మరొకదానికి వెళ్తారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

స్కూళ్ల మ్యాపింగ్‌పై ముగిసిన అవగాహన సదస్సులు

పాఠశాలలు మ్యాపింగ్‌ వల్ల పాఠశాలలు రద్దు కావడం, మూతపడటం జరగదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. విద్యార్థులు మాత్రమే ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు వెళ్తారని తెలిపారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపడుతున్న పాఠశాలల మ్యాపింగ్‌ కార్యక్రమంపై మూడు రోజులపాటు జరిగిన అవగాహన సదస్సులు శనివారం ముగిశాయి. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన చివరి రోజు సదస్సుకు అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ స్కూళ్ల మ్యాపింగ్‌ ద్వారా ఏదో జరిగిపోతోందని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాఠశాలలు రద్దు కావని.. ఇప్పుడున్నవి ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్, హైస్కూల్, హైస్కూల్‌ ప్లస్‌గా రూపాంతరం చెందుతాయన్నారు. దీనిపై అవగాహన కల్పించడానికే మూడురోజులపాటు అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులకు సదస్సులు నిర్వహించామని తెలిపారు. త్వరలోనే జిల్లాలవారీగా కూడా అధికారులు సదస్సులు నిర్వహిస్తారని చెప్పారు.

పాఠశాలల మ్యాపింగ్‌ తర్వాత ఎక్కడెక్కడ అదనపు తరగతి గదులు, ఇతర మౌలిక వసతులు అవసరమో గుర్తిస్తామని వివరించారు. నాడు–నేడు పథకం కింద పనులు పూర్తి చేస్తామన్నారు. మన రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతోపాటు వారి ఆరోగ్య భద్రత కూడా చూసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా మాట్లాడుతూ.. ఉర్దూ పాఠశాలల మ్యాపింగ్‌ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కమిషనర్‌ సురేష్‌ కుమార్, ఎస్పీడి వెట్రిసెల్వి, మౌలిక వసతుల సలహాదారు మురళి, తదితరులు పాల్గొన్నారు.

చర్చల ద్వారానే సమస్య పరిష్కారం

ఏ సమస్యకైనా చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ప్రభుత్వంతో చర్చలకు రాకుండా ఉండటం సరికాదన్నారు. ప్రభుత్వం, ఉద్యోగులు వేర్వేరు కాదని చెప్పారు. జీవో కాపీలు తగులబెట్టడం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం సరికాదన్నారు. 

ఎప్పటికైనా సమస్యను పరిష్కరించాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఒకసారి చర్చలకు వెళ్లి సంప్రదింపులు జరిపాక ఇప్పుడు వెనక్కి తగ్గటమేమిటని ప్రశ్నించారు. ఉన్న ఇబ్బందులను మళ్లీ చర్చల ద్వారా తెలియజేయొచ్చన్నారు.  

All Telugu and English News Papers and News Channels

అన్ని ప్రధాన దినపత్రికలు (తెలుగు మరియు  ఇంగ్లీష్ ) ఓకే చోట పోందుపరచడం జరిగింది. మీకు కావలసిన పత్రిక పైన క్లిక్ చేసి వార్తలు చదువుకోవచ్చు. 

How to download PRADHANA MANTRI SURAKSHA BHIMA YOJANA( PMSBY ) Policy Certificate in Telugu.

 ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పాలసీ సర్టిఫికెట్ ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సర్టిఫికెట్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఏ డేటా అవసరం , పాలసీ వలన మనకు కలిగే లాభం ఏమిటి వంటి పూర్తి సమాచారం

క్రింది వెబ్ సైట్ పై క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ తో మీ పాలసీ సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకోగలరు.

https://nationalinsurance.nic.co.in/en/about-us/pradhan-mantri-suraksha-bima-yojana

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన యొక్క అర్హత ప్రమాణాలు:

 ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కోసం సబ్‌స్క్రయిబ్ చేయడానికి అర్హత ప్రమాణాలు క్రింది విధంగా ఉన్నాయి:

 కనీస వయస్సు అవసరం 18 సంవత్సరాలు.

 గరిష్ట వయస్సు అవసరం 70 సంవత్సరాలు.

 సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉన్నవారు మరియు 18 - 70 ఏళ్లలోపు వారు పాలసీకి సభ్యత్వం పొందేందుకు అర్హులు.

 బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి.

 బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే, దరఖాస్తు ఫారమ్‌తో ఆధార్ కార్డు కాపీని జతచేయాలి.

 వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు ఉంటే, అతను లేదా ఆమె ఒకే బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే పథకంలో చేరడానికి అర్హులు.

 చెల్లించాల్సిన ప్రీమియం సంవత్సరానికి రూ. 12.

 బీమా చేసినవారి బ్యాంక్ ఖాతా నుండి ప్రీమియం మొత్తం ఆటోమేటిక్‌గా డెబిట్ చేయబడుతుంది.

 పథకం ఒక సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉంటుంది మరియు సంవత్సరం చివరిలో దీనిని పునరుద్ధరించవచ్చు.

 ప్రాథమిక KYC పత్రం దరఖాస్తుదారు యొక్క ఆధార్ కార్డ్.

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పాలసీ సర్టిఫికెట్ ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సర్టిఫికెట్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఏ డేటా అవసరం , పాలసీ వలన మనకు కలిగే లాభం ఏమిటి వంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో వివరించడం జరిగింది .

https://youtu.be/bKf6irlPuD0


Ap COVID latest bulletin for Daily cases


28-1-2022 నాడు రాష్ట్ర లో కరోనా కేసులు అప్డేట్ జిల్లాలు వారీగా గడచిన 24 గంటల్లో
మొత్తం పాజిటివ్ కోసులు ::: 12561

కోలుకున్న వారు 8742

Gross amount difference between old PRC and new PRC with new HRA Slabs and old HRA slabs

కొత్త పి ఆర్ సి ప్రకారం ఉద్యోగులకు GROSS ఏవిధంగా తగ్గుతుంది, జీతం ఎంత? పాత పి ఆర్ సి ప్రకారం GROSS జీతం ఎంత? జనవరి కొత్త జీతం పాత జీతం ప్రకారం ఎవరికి ఎంత తగ్గుతుంది, ఎలా తగ్గుతుంది, సిపిఎస్ ఉద్యోగులకు ఎంత నష్టం వంటి పూర్తి వివరాలతో వీడియో రూపొందించడం జరిగింది.

మీ గ్రాస్ అమౌంట్ ను మీరే లెక్క పెట్టుకోవడానికి సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది

Click Here to Download PRC software Gross calculation

https://youtu.be/sJAA61v03qg

DSC2008,28940 BASIC PAY employees arrearTable caluculationsheet in New PRC

కొత్త PRC లో DSC 2008 వారికి, అలాగే జూలై 18 నాటికి 28940 పే ఉన్న ఉద్యోగులకు 20% ,14.5%, 12% నుంచి HRA 16%, 8% కొత్త శ్లాబుల ప్రకారం ఎంత నష్టపోతున్నారు టేబుల్లో ఇవ్వడం జరిగింది.

Click Here To Download DSC 2008,29840 pay 20% to 8% hra sheet

Click Here To Download DSC 2008,29840 pay 20% to 16% hra sheet

Click Here To Download DSC 2008,29840 pay 12% to 8% hra sheet

Click Here To Download DSC 2008,29840 pay 14.5% to 8% hra sheet


దేశంలో కరోనా రోజువారీ కేసులు 3 లక్షలు దాటేశాయ్.24 గంటల్లోనే భారీగా నమోదైన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. రోజువారీ కేసులు 3 లక్షల మార్కును దాటేశాయి. నిన్న ఒక్కరోజే 3,17,532 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఇది 249 రోజుల గరిష్ఠం కావడం గమనార్హం. 19,35,180 టెస్టులు చేయగా.. పాజిటివిటీ రేటు 16.41 శాతంగా ఉంది. నిన్నటితో పోలిస్తే పాజిటివిటీ రేటు ఒక శాతం పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 16.06 శాతంగా నమోదైంది.

 ప్రస్తుతం దేశంలో 19,24,051 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, కరోనాతో మరో 491 మంది మరణించారు. నిన్న 2,23,990 మంది కోలుకోగా.. మొత్తం 3,58,07,029 మంది రికవర్ అయ్యారు. రికవరీ రేటు 93.69 శాతం. ఒమిక్రాన్ కేసులు 9,287కి పెరిగాయి.

ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే, ఇప్పటివరకు 159,67,55,879 డోసుల టీకాలను వేశారు. నిన్నటివరకు 15 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న 3.8 కోట్ల మంది టీనేజర్లకు టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 73 లక్షల డోసుల టీకాలను జనానికి వేసినట్టు తెలిపింది. మొత్తంగా ఇప్పటివరకు 61 లక్షల డోసుల ప్రికాషనరీ టీకాలను ఇచ్చామని వెల్లడించింది. రాష్ట్రాలకు 158,96,34,485 డోసుల టీకాలను ఇవ్వగా.. ఇంకా రాష్ట్రాల వద్ద 12,72,19,636 డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది

Doc scanner for save file in PDF and jpg and reduce size

DOC SCANNER స్కానర్ ని ఉపయోగించి మన యొక్క ఫొటోస్ ని కానీ files కానీ పిడిఎఫ్ లేదా జేపీజీ ఫార్మాట్లో సేవ్ చేసుకుని మనకి నచ్చిన సైజులో సేవ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. దీని కోసం క్రింది లింక్ నుంచి  DOC SCANNER ఆప్ ని డౌన్లోడ్ చేసుకోగలరు.

Click here to download Doc scanner app

21న సమ్మె నోటీసు.ఉద్యోగ సంఘాల నిర్ణయం.పీఆర్సీ జీవోలపై ఆందోళనలు ఉద్ధృతం

ఉద్యమ కార్యాచరణపై నేడుఐకాసల ఐక్యవేదిక సమావేశం.ఉపాధ్యాయుల కలెక్టరేట్ల ముట్టడి నేడు

పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. ఇప్పటికే నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న ఉద్యోగులు చివరి అస్త్రంగా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. నిబంధనల ప్రకారం 14 రోజుల ముందు ఇవ్వాల్సిన సమ్మె నోటీసును... శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మకు ఇవ్వనున్నారు. ఈమేరకు ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం నిర్వహించే సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. సమ్మెలో ఆర్టీసీ సంఘాలు పాల్గొనే అవకాశముంది. మరోవైపు ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు ఉపాధ్యాయులు గురువారం జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించనున్నారు. దీనికి ఐకాసలు మద్దతు ప్రకటించాయి. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) డివిజన్‌ కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీనికి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది.

జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు: బండి

పీఆర్సీ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఈనెల 21న సీఎస్‌కు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్లు ఏపీ ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడలో బుధవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం కార్యవర్గ సభ్యులతో కలిసి పీఆర్సీ ఉత్తర్వుల ప్రతులను మంటల్లో దహనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘పీఆర్సీ ఉత్తర్వులను రద్దు చేసే వరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదు. సమ్మె, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై గురువారం ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఐక్యవేదిక సమావేశంలో చర్చిస్తాం. హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ, అదనపు పింఛన్‌ అంశాలను సీఎస్‌తో మాట్లాడుకోవాలని సీఎం సూచించారు. మమ్మల్ని పిలిచి, మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పిన సీఎస్‌ రాత్రిపూట ఉత్తర్వులు ఇచ్చారు. పీఆర్సీతో వేతనాల్లో రూ.6వేలు నుంచి రూ.7వేలు తగ్గిపోతాయి. ఇది ఐఏఎస్‌ల పన్నాగంలా అనుమానం వస్తోంది. అయిదు డీఏలను ఇంతకాలం పెండింగ్‌ పెట్టి, ఇప్పుడు ఒకేసారి ఇస్తున్నారు. గతంలో ఇచ్చిన మూడు డీఏల బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదు. ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ తగ్గింపు, సీసీఏ రద్దుతో వేతనంలో 18% తగ్గించి, డీఏల ద్వారా 20% ఇస్తున్నారు.  

ఇది దుర్మార్గమైన చర్య. ఉద్యమం ద్వారానే డిమాండ్లను సాధించుకుంటాం. పీఆర్సీ ఉత్తర్వులు ఇవ్వడంలో సీఎంకు భాగస్వామ్యం ఉందని సీఎస్‌ చెప్పినందుకు ధన్యవాదాలు. ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెట్టే పరిస్థితి లేదు. కరోనాతో చనిపోయిన ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఇప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. గ్రామ, వార్డు సచివాలయాలు, ఎన్‌ఎంఆర్‌లుగా ఉద్యోగాలు ఇస్తామని సీఎంను అధికారులు తప్పుదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వం ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులను సైతం మోసం చేసింది’’ అని ఆరోపించారు.

రాబడిపై గందరగోళ ప్రచారం: సూర్యనారాయణ

ప్రభుత్వ ఆదాయం తగ్గిందని ఒకవైపు సీఎస్‌ చెబుతుండగా... మరోవైపు నవంబరు నెలాఖరుకు గత ఐదేళ్లల్లో కంటే ఎక్కువ రాబడి వచ్చినట్లు కాగ్‌ చెప్పిందని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. ఇది సమాజాన్ని తప్పుదారి పట్టించడమేనన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ... ‘‘ప్రభుత్వ ఆదాయం తగ్గిందని విలేకర్ల సమావేశంలో సీఎస్‌ చెప్పారు. నవంబరు నెలఖారునాటికి గత ఐదేళ్లలో కంటే ఎక్కువ ఆదాయం వచ్చిందని కాగ్‌ వెల్లడించింది. ప్రభుత్వం తన విజయంగా ప్రచారం చేసుకుంటోంది. సీఎస్‌ చెప్పింది నిజమైతే ఏపీ ప్రభుత్వం కాగ్‌కు నోటీసులు ఇవ్వాలి? లేదంటే సీఎస్‌పై ఏం చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వానికి వదిలిపెడుతున్నాం. సీఎస్‌, ఆర్థికశాఖ అధికారులు పాత పవర్‌ ప్రజంటేషన్‌నే మళ్లీ చూపించారు. దాంట్లో శాస్త్రీయత, వాస్తవికత లోపించింది. కేంద్ర పీఆర్సీపై వితండ వాదం చేస్తున్నారు. పదవీ విరమణ వయసును 62ఏళ్లకు పెంచారు. కేంద్రంలో 60ఏళ్లకే ఉంది. దేన్ని ప్రమాణికంగా తీసుకుని పెంచారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ప్రొఫెసర్లకు మాదిరిగా 65 ఏళ్లకు ఎందుకు పెంచలేదు. వైద్య కళాశాలల్లో పని చేస్తున్న వైద్యులు పదవీ విరమణ వయసును పెంచాలని గత ఐదేళ్లుగా కోరుతున్నా ఎందుకు పెంచడం లేదు. పదవీ విరమణ ప్రయోజనాలను రెండేళ్లకు వాయిదా వేసేందుకే వయోపరిమితి పెంచినట్లుఉంది. సీఎస్‌ పూర్తిగా విఫలమయ్యారు. ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్యవర్తిగా వ్యవహరించాల్సిన ఆయనే ప్రతిబంధకంగా తయారయ్యారనిపిస్తోంది. పీఆర్సీ ఉత్తర్వులను నిలిపివేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని సహకరిస్తాం. కానీ, ఇది అవమానకరంగా ఉందని అభిప్రాయపడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చే హెచ్‌ఆర్‌ఏతో ఎక్కడైనా అద్దెకు ఇల్లు దొరుకుతుందా? ఎక్కడ పొరపాటు జరిగిందో సీఎం గుర్తించాలి’’ అని అన్నారు.

మట్టి ఖర్చులు మిగుల్చుకోవాలని చూస్తోంది: బొప్పరాజు

ఉద్యోగి చనిపోతే ఇచ్చే మట్టి ఖర్చులనూ మిగుల్చుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ‘‘వేతనాల పెంపు కోసమే సమ్మె చేయాలని నిర్ణయించాం. ఇస్తున్న వేతనాలు తగ్గించి, గత ప్రభుత్వం ఇచ్చిన భత్యాల్లో కోత వేయడంతోనే సమ్మెకు వెళ్తున్నాం. సీపీఎస్‌ రద్దు సహా ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. వేతనాలపై సీఎస్‌ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. జీతాలు తగ్గవని ప్రభుత్వం అనుకుంటే పాత జీతాలే ఇవ్వొచ్చు కదా...! రివర్స్‌ పీఆర్సీ మాకొద్దు. పాత జీతాలే ఇవ్వండి. ఉత్తర్వులను రద్దు చేసుకునే వరకూ ఉద్యమం ఆపే ప్రసక్తే లేదు. ఉద్యమంలోకి అడుగుపెడితే వెనక్కి తగ్గేది ఉండదు. మా ఉద్యమానికి ప్రజల మద్దతు కోరుతున్నాం. సమ్మెలో ఆర్టీసీ కార్మికులు పాల్గొంటారు’’ అని వెల్లడించారు.

NISHTHA - 3.0 AP_FLN module - 8 Telugu, English, Urdu course joining links

నిష్ఠ 3 శిక్షణ కార్యక్రమంలో భాగంగా FLN-8 మూల్యాంకనం మరియు దాని స్వభావం కోర్సు లో జాయిన్ అవటానికి క్రింది లింక్ పై క్లిక్ చేసి దీక్షా యాప్ లో ఓపెన్ చేయగలరు.

ఇంగ్లీష్ మీడియం లింక్ 

https://diksha.gov.in/explore-course/course/do_313454540373254144169

తెలుగు మీడియం లింక్

https://diksha.gov.in/explore-course/course/do_3134560723221954561735

ఉర్దూ మీడియం లింక్

https://diksha.gov.in/explore-course/course/do_3134545449898229761135

కరోనా వస్తే.. ఆ స్కూలు వరకే మూసివేస్తాం.మంత్రి ఆదిమూలపు సురేశ్ గారు

AP: రాష్ట్రంలోని స్కూళ్ల పరిస్థితిని ప్రతిరోజూ

కలెక్టర్ స్థాయి అధికారులతో సమీక్షిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. 

సంక్రాంతి తర్వాత 80% మంది విద్యార్థులు స్కూళ్లకు వస్తున్నారు. 

కరోనా వచ్చిన టీచర్లకు తక్షణమే సెలవులు ఇస్తున్నాం. 

స్కూళ్లలో శానిటైజ్ చేస్తున్నాం. 

కరోనా వస్తే.. ఆ స్కూలు వరకే మూసివేస్తాం.

మిగతా స్కూళ్లు యథావిధిగా నడుస్తాయి.

తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు' అని మంత్రి

అన్నారు

రాష్ట్ర బడ్జెట్ ఉద్యోగాల వ్యయం చాలా ఎక్కువ : సీఎస్ సమీర్ శర్మ

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై ఉద్యోగులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు . ప్రభుత్వం ఇచ్చిన జీవోలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు . జీవోల వ్యవహారంపై సమ్మెకు సైతం సిద్ధమని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి . ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది . ఉద్యోగుల పీఆర్సీ , ఇతర అంశాలపై సీఎస్ సమీర్ శర్మ వివరణ ఇచ్చారు . సీఎస్ మాట్లాడుతూ .. " రాష్ట్రంపై కరోనా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించింది . రాష్ట్రానికి రూ . 62 వేల కోట్ల రెవెన్యూ ఉంది . కరోనా లేకపోయి ఉంటే రాష్ట్ర రెవెన్యూ రూ . 98 వేల కోట్లు ఉండేది . కొవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్ర రెవెన్యూ పడిపోయింది . గత పరిస్థితులకు ఇప్పటికీ చాలా తేడా ఉంది . ఒమిక్రాన్ కారణంగా రాష్ట్ర రెవెన్యూపై తీవ్ర ప్రభావం పడింది . రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగుల వ్యయం చాలా ఎక్కువ .

ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు , సంక్షేమ పథకాలకు ఎలా ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచించాలి . రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లడమే ప్రభుత్వ కర్తవ్యం . రాష్ట్ర బడ్జెట్లో పీఆర్సీతో పాటు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది . విద్య , సంక్షేమం , మౌలిక సదుపాయాలు , ఇతరత్రా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది . రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాం . ఆర్థికంగా రాష్ట్ర స్వరూపమే మారిపోయింది . రాష్ట్ర పరిస్థితులు దిగజారిపోయాయి . కరోనా వేళ ఇతర రాష్ట్రాలు సంక్షేమ పథకాలు తగ్గించాయి . సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించాం . ఉద్యోగులు , పింఛనర్లు అందరికీ ప్రభుత్వం న్యాయం చేసింది . రాష్ట్రానికైనా , కుటుంబానికైనా ఆర్థిక వనరుల వినియోగం ఒకేలా ఉంటాయి . పరిమితంగా ఉన్న వనరుల వినియోగంలో సవాళ్లు ఉంటాయి . ఉద్యోగులు , సంక్షేమం సహా అన్ని రంగాలకు ఆర్థిక వనరులు పంచాలి . కొవిడ్ వేళ చాలా రాష్ట్రాలు సంక్షేమ బడ్జెట్లో కోతపెట్టాయి . ఏపీలో సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నాం . విభజన నుంచి కరోనా వరకు ఆర్థిక వనరులు ఒడిదుడుకుల్లో ఉన్నాయి . పరిశ్రమలు , సర్వీసుల రంగం ఒడిదుడుకులకు లోనైంది . ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు . అందరికీ న్యాయం జరిగిందనే అనుకుంటున్నాం ” అని సీఎస్ వివరించారు

ఐ.ఆర్. అనేది జీతంలో భాగం కాదని గమనించండి.పిఆర్సి ఆలస్యం అవుతుందని ఐఆర్ ఇవ్వడం జరిగింది.

ప్రకటించిన  డీఏ లు అన్నీ కలిపి చూడండి... గ్రాస్ శాలరీ లో ఏ ఒక్క ఉద్యోగికీ జీతం తగ్గలేదు..

*కోవిడ్ వల్ల ఆదాయం చాలా తగ్గిపోయింది. కోవిడ్ లేకపోతే 98 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది.

Updated income tax software 2021-22 for employees and pensioners prepared by K S NAIDU

ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రిటైర్డ్ అయిన వాళ్లకు 2021 22 ఆర్థిక సంవత్సరం ఆదాయం లెక్కింపు సాఫ్ట్వేర్ను ఈ క్రింది లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకొగలరు ఈ సాఫ్ట్వేర్ను మీ మొబైల్ ఉపయోగించి మీ ఫామ్ 16 జనరేట్ చేసుకోవచ్చు.

Click Here To Download INCOME TAX SOFTWARE 2021-22 

APPSC GROUP 4 పోస్టులకు దరఖాస్తు గడువు 29 వరకు పొడిగించారు.

 రెవెన్యూ విభాగంలోని జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూప్-4 సర్వీసెస్) పోస్టులకు దరఖాస్తు గడువును ఈనెల 29వ తేదీ వరకు పొడిగిస్తు న్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీటితో పాటు ఎండోమెంట్ విభాగంలోని గ్రూప్-3 కేడర్కు సంబంధిం చిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు వివరించారు. వీటికి ఈనెల 19 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. దరఖా స్తులను కమిషన్ వెబ్సైట్

 https://psc.ap.gov.in

PRC Pay Fixation Table for DSC 1998 SGT teachers

98 డీఎస్సీ SGT వారికి PRC 2022 లో ఎంత పే ఫిక్షేషన్ జరుగుతుంది, పాత HRA 20% ,14.5% , 12% తో, కొత్త HRA 8%,16% తో ఎంత తేడా ఉంది,ARREARS ఎంత వస్తాయి పట్టికలో చూపించడం జరిగింది.

Click Here To Download HRA 20%,NEW HRA 16% TABLE

Click Here To Download HRA 20%,NEW HRA 8% TABLE

Click Here To Download HRA 12%,NEW HRA 8% TABLE

Click Here To Download HRA 14.5%,NEW HRA 8% TABLE

LINK FOR F A 2 marks ONLINE entry

FA 2 మార్క్ ను ఎంటర్ చేయడానికి స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో ఆప్షన్  ఎనేబుల్ చేయడమైనది. లింక్ పై క్లిక్ చేసి పాఠశాల dise code పాస్వర్డ్తో లాగిన్ అవ్వగలరు.

https://studentinfo.ap.gov.in/EMS/StudentCCAFA2MarksEntry.do

ముక్కోటి ఏకాదశి గురించి వివరాలు తెలుసుకుందాం.

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది.

ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. అటు తర్వాత జపం, ధ్యానం.

విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ, తమ కథ విని, వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు. అందుజేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. తిరువతిలో కూడా ఈ రోజును వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు.

పద్మ పురాణం ప్రకారం విష్ణువునుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగురూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం.ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.

AP SSC Class 10 Public Exams 2022 Blue Prints & Model Question Papers for 100 Marks All Subjects TM & EM by BSE AP

 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2022 కొరకు APSCERT వారు విడుదల చేసిన అన్ని సబ్జెక్స్, అన్ని పేపర్స్ బ్లూప్రింట్స్ మరియు మోడల్ పేపర్స్

PUBLIC EXAMINATIONS - 2022

SUBJECT WISE MODEL QUESTION PAPERS & BLUE PRINTS
S.NoSUBJECTSPAPER CODESDOWNLOAD
11ST LANGUAGE (TELUGU)01T & 02TCLICK HERE
21ST LANGUAGE (COMPOSITE TELUGU)03TCLICK HERE
32ND LANGUAGE ( HINDI)09HCLICK HERE
42ND LANGUAGE ( ENGLISH)11ECLICK HERE
53RD LANGUAGE ( ENGLISH)13E & 14ECLICK HERE
6MATHEMATICS (ENGLISH - MEDIUM)15E & 16ECLICK HERE
7MATHEMATICS (TELUGU - MEDIUM)15T & 16ECLICK HERE
8PHY SCIENCE (ENGLISH - MEDIUM)19ECLICK HERE
9PHY SCIENCE (TELUGU - MEDIUM)19TCLICK HERE
10BIO SCIENCE (ENGLISH - MEDIUM)20ECLICK HERE
11BIO SCIENCE (TELUGU - MEDIUM)20TCLICK HERE
12SOCIAL (ENGLISH - MEDIUM)21E & 22ECLICK HERE
13SOCIAL (TELUGU - MEDIUM)21T & 22TCLICK HERE

సంక్రాంతి , దసరా సెలవులకు ముందు , వెనుక సెలవు పెట్టుకోవచ్చునా?

సంక్రాంతి , దసరా సెలవులకు Suffix , Prefix ఉండవు. అంటే ఎన్ని రోజులు ఇచ్చినా TERMINAL HOLIDAYS కావు. కాబట్టి ఈ సారి సంక్రాంతి సెలవులు  (08.01.2022 to 16.01.2022). అంటే సెలవులు 10 రోజులకు మించలేదు ( 9 రోజులు). కావున ఎవరికైనా  అత్యవసరమైన యెడల సెలవులు ప్రారంభానికి ముందురోజు కాని , సెలవులు పూర్తి అయిన తరువాత రోజు కాని (ఏదో ఒకరోజు మాత్రమే) సెలవు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చును.

ఏదైనా సెలవులు 10రోజులు మించరాదు.

10రోజులు మించినట్లైతే అది ELIGIBLE LEAVE గా పరిగణిస్తారు.

SUMMAR HOLIDAYS మాత్రమే TERMINAL HOLIDAYS.

STUDENT SHOE SIZE ENTRY Wesite

సమగ్రశిక్షా జగనన్న విద్యాకానుక విద్యార్థుల కిట్ల పoపిణీలో భాగంగా బూట్ల పoపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలు సేకరించి నమోదు చేయుట గురించి. 2022-23 ఆన్లైన్ లో నమోదు చేయుటకు చివరితేది జనవరి 7 , 2022

https://studentinfo.ap.gov.in/EMS/

Nishtha 3 FLN training module 7 course link

NISHTHA - 3.0 శిక్షనా కార్యక్రమం లో భాగంగా కోర్సు 7 కి సంబంధించిన తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లింక్ ని క్లిక్ చేసి దీక్ష యాప్ లో ఓపెన్ చేసి కోర్సు లో జాయిన్ అవగలరు. 

Multilingual Education in Primary Grades

FLN. 7 ఇంగ్లీష్ మీడియం

https://diksha.gov.in/explore-course/course/do_31344192070551142412359?referrer=utm_source%3Dmobile%26utm_campaign%3Dshare_content


FLN. 7 తెలుగు మీడియం

https://diksha.gov.in/explore-course/course/do_31344264592606003212818?referrer=utm_source%3Dmobile%26utm_campaign%3Dshare_content


FLN  7 ఉర్దూ మీడియం

https://diksha.gov.in/explore-course/course/do_31344192655369011212405?referrer=utm_source%3Dmobile%26utm_campaign%3Dshare_content





FLN training module

 FLN training కి సంబంధించి మనకు ఉపయోగ పడే అన్ని  పైల్ లను అందుబాటులో ఉంచడం జరిగింది. 

https://drive.google.com/file/d/1iC-x8YszK0JioGg4L0qdooq1tFfS1PPa/view?usp=sharing

 https://docs.google.

com/document/d/1hsvY-ta2f0-82cAjyY7DbobFY_3109Pb/edit?usp=sharing&ouid=112811773243134446119&rtpof=true&sd=true

 https://drive.google.com/file/d/1hfhrvPC9Yzdiahw5us1eFCNezFKPV8aQ/view?usp=sharing

 https://docs.google.com/presentation/d/1i7e-sY9ldt3mxX0w--nK0w61BrZ-7KOZ/edit?usp=sharing&ouid=112811773243134446119&rtpof=true&sd=true

 https://drive.google.com/file/d/1hPu_uXFMo3EnHdLJbZYYlPbsOIrFtmeE/view?usp=sharing

 https://drive.google.com/file/d/1iHlR6wqTTgTGQNcfcfT3sv2lBLaMTGp4/view?usp=sharing

https://drive.google.com/file/d/1YbLVUUEBlSQuImoy6xTj1wQccqHjnQsi/view?usp=sharing


https://drive.google.com/file/d/1YcR3PMIkd5Ngfxlmt29rbwkv9PqK02GM/view?usp=sharing

కొత్తవలసలో 19 మంది విద్యార్థులకు కరోనా

విజయనగరం జిల్లా కొత్తవలసలోని ఓ పాఠశాలలో ఒకేరోజు 20 కరోనా కేసులు బయటపడ్డాయి. సోమవారం ఆ పాఠశాలలో 120 మందికి పరీక్షలు నిర్వహించగా.. మంగళవారం వచ్చిన ఫలితాల్లో 19 మంది విద్యార్థులతోపాటు, ఒక ఉపాధ్యాయునికి కరోనా సోకినట్టు తేలింది. దీంతో పాఠశాలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. మంగళవారం కూడా మరో 65 మందికి పరీక్షలు చేశారు. విశాఖపట్నం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి కొవిడ్‌ వైరస్‌ సోకింది. మంగళవారం ఆయన కలెక్టర్‌ నిర్వహించిన సమీక్షకు హాజరయ్యారు.

FLN Divisional Level Trainings participate Trachers attendance link

FLN-- Divisional level training కి హాజరైన ఉపాద్యాయులు అందరు క్రింది  google form ను submit చేయించాలి.

https://forms.gle/9etHFT13D5c4nu5u8

.కాబట్టి తక్షణమే ఈ google form    link ను  శిక్షణార్ఢులచే submit చేసే బాద్యత ను  divisional level శిక్షణా కేంద్రం కోర్స్ డైరెక్టర్ లను తీసుకోవలసిన దిగా కోరడమైనది. participants అందరూ ఈ google form ద్వారా  తమ హాజరు ను నమోదు చేసుకొనేటట్లు చర్యలు తీసుకోవలయును.

YSR Raithu Barosa Benificiary Staus with Aadhar No

వైయస్సార్ రైతు భరోసా కు సంబంధించి రైతులకు నగదు జమ చేయడం జరిగింది. మీ యొక్క ఆధార్ నెంబరు ని ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు. 

AP JAC & AP JAC Amaravathi ఐక్య వేదిక తేదీ 3.1.2022 నాడు సాయంత్రం కీలక press meet

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, గ్రామ సచివాలయ, కాంట్రాక్ట్ & ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల 11వ PRC అమలు, ఉద్యోగ/ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బులు చెల్లింపు, DA బకాయిల విడుదల, cps రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, తదితర సమస్యల పరిష్కారం కొరకు ఇప్పటికే ఉద్యమం మొదలుపెట్టి, ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ మేరకు 17.12.2021న తాత్కాలికంగా ఉద్యమాన్ని వాయిదా వేసిన విషయం మీ అందరికీ తెలిసిందే.
అయితే నేటికి ప్రభుత్వం నుండి ఎలాంటి పరిష్కారం లభించనందున, ఇరు JAC ల ఐక్య వేదిక తదుపరి చేపట్టబోయే భవిష్యత్ కార్యాచరణ గురించి ఇరు JAC ల సంయుక్త రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశము రేపు సాయింత్రం అనగా తేదీ 3.1.2022 సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును . అనంతరం అదే రోజు సాయంత్రం 6 గంటలకు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

కావున తప్పకుండా మీ మీ ప్రింట్ మరియు & ఎలక్ట్రానిక్ మీడియా తేదీ 3.1.2022 సోమవారం న సాయంత్రం 6 గంటలకు NGO హోమ్, 3వ అంతస్తు, విజయవాడ నందు ఏర్పాటు చేసిన AP JAC & AP JAC Amaravathi సంయుక్త
పత్రికా (ప్రెస్ మీట్) సమావేశానికి హజరయ్యేటట్లు చూడగలరని కోరుచున్నాము. 
బండి శ్రీనివాసరావు & హృదయ రాజు, AP JAC.
బొప్పరాజు & వైవీ రావు, AP JAC అమరావతి.

LATEST POSTS

check PTM data in given link for submitted schools list

క్రిందనున్న డాష్ బోర్డులో జిల్లా, మండలం సెలెక్ట్ చేసి GO మీద ప్రెస్ చేస్తే మండలంలో ఏఏ పాఠశాల PTM డేటా స్కూల్ అటెండెన్స్ app లో అప్లోడ్ అయింద...