📘 AP TET Related Posts

    మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

    🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9490371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

    IIT JEE main exams application

    8 నుంచి జేఈఈ మెయిన్‌ రెండో విడత దరఖాస్తులు

    మే 3 వరకు గడువు 

    ముగిసిన మొదటి విడత దరఖాస్తు గడువు 

    మొదటి సెషన్‌కు తక్కువ మంది హాజరయ్యే అవకాశం 

    21 నుంచి మే 4 వరకు జేఈఈ మెయిన్‌ మొదటి సెషన్‌ పరీక్షలు 

    రాష్ట్రంలో మే 6 నుంచి 24 వరకు ఇంటర్‌ పరీక్షలు 

    మే 24 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్‌ సెకండ్‌ సెషన్‌ పరీక్షలు

     ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ)లు, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌–2022–23 తొలిదశ పరీక్షల దరఖాస్తు ప్రక్రియ గురువారంతో ముగిసింది. రెండో దశ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 8 నుంచి ప్రారంభం కానుంది. మే 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  

    ఇంటర్‌ పరీక్షలకు ముందే తొలిదశ మెయిన్‌ పరీక్ష 

    జేఈఈ మెయిన్‌ తొలిదశ పరీక్షలు ఏప్రిల్‌ 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో ఇవి జరగనున్నాయి. ఏప్రిల్‌లోనే వివిధ బోర్డుల ఇంటర్మీడియెట్‌/+2 పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్‌ తొలివిడత పరీక్షలకు విద్యార్థుల హాజరు తక్కువగానే ఉండొచ్చని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలను మే 6 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా తరగతులు సరిగ్గా జరగకపోవడంతో ఇంటర్‌ బోర్డు.. సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించింది. అయితే జేఈఈ మెయిన్‌ సిలబస్‌ను మాత్రం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) యథాతథంగానే ఉంచింది. దీంతో విద్యార్థులు జేఈఈ మెయిన్‌ సిలబస్‌ను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి వస్తోంది.

    . జేఈఈ ప్రిపరేషన్‌కు అదనపు సమయం అవసరమవుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షల కంటే ముందు జరిగే జేఈఈ మెయిన్‌ తొలివిడత పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధం కాలేకపోతున్నారని పేర్కొంటున్నారు. దీంతో తొలివిడత పరీక్షకు నమోదు చేసుకున్నా హాజరు కావడం కష్టమేనని చెబుతున్నారు. ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించే జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్షలకు విద్యార్థులు సిద్ధంగా ఉంటారని వివరిస్తున్నారు. మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్షలు మే 24 నుంచి 29 వరకు జరగనున్నాయి. కాగా, జేఈఈ మెయిన్‌కి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య ఈసారి కూడా భారీగానే ఉండొచ్చని కోచింగ్‌ సెంటర్ల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా జేఈఈకి దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య 10 లక్షలు దాటుతోంది.

    Commissioner & Director of Municipal Administration Government of Andhra Pradesh Municipal properly tax or House tax online link

    ఆన్ లైన్ ద్వారా ఆస్తి పన్ను  /  ఇంటి పన్ను కట్టుటకు  ప్రభుత్వ లింక్. ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి మీ పేరు కానీ అసెస్మెంట్ నెంబర్ తో గాని సెర్చ్ చేసి మీకు ఎంత టాక్స్ పడిందో అంత టాక్ ను ఆన్లైన్లో పే చేయవచ్చు

    Ap Open school society APOSS 10th and intermediate exams new dates

    ఓపెన్ పరీక్షల కొత్త షెడ్యూల్ ఇలా

    రాష్ట్రంలో ఓపెన్ విధానంలో (ప్రైవేట్ లేదా డిస్టెన్స్) పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల పరీక్షలను రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ ఈ నెల ఏడో తేదీన ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పది, ఇంటర్ విద్యార్థులకు మే రెండో తేదీ నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్లో మార్పు చేయడం, ప్రైవేట్ విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సార్వత్రిక విద్యాపీఠం పరీక్షల షెడ్యూల్ను సవరించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం పదో తరగతి ఓపెన్ విద్యార్ధులకు ఏప్రిల్ 27 నుంచి మే ఏడో తేదీ నుంచి ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరుగుతాయి.

    పది విద్యార్థులకు

     ఏప్రిల్ 27న 205 - తెలుగు, 206 ఉర్దూ, 208 - కన్నడ, 233 - ఒరియా, 237 తమిళం పరీక్షలు, 28న 202- ఇంగ్లీష్ 29న 211 - గణితము, 223 -భారతీయ సంస్కృతి, వారసత్వం పరీక్షలు, మే రెండో తేదీన 212 - శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం, 216- గృహ విజ్ఞాన శాస్త్రము, 4న 213 - సాంఘిక శాస్త్రము, 214 - ఆర్థిక శాస్త్రము, ఐదో తేదీన 201 - హిందీ, ఆరున 215 బిజినెస్ స్టడీస్, 222 - మనో విజ్ఞాన శాస్త్రం, అన్ని వృత్తి విద్యా సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి.

    ఇంటర్మీడియట్ విద్యార్థులకు

    మే ఏదో తేదీన 301 - హిందీ, 305 - తెలుగు, 306 - ఉర్దూ. మే 10న 302 ఇంగ్లీష్, 12న 311- గణితము, 315- చరిత్ర, 320 వ్యాపార గణక శాస్త్రము, 14 తేదీన 312 - భౌతిక శాస్త్రము, 317 - రాజనీతి శాస్త్రము, పౌర శాస్త్రము, 328 - మనో విజ్ఞాన శాస్త్రము, 17న 313 - రసాయన శాస్త్రం, 318 - ఆర్థికశాస్త్రము, 331-సామాజికశాస్త్రము, 19న 314-జీవ శాస్త్రము. 319- వాణిజ్య, వ్యాపార శాస్త్రము, 321 గృహవిజ్ఞాన శాస్త్రం, 21న అన్ని వృత్తి విద్యా సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి. ఇంటర్మీడియట్ జనరల్, వృత్తి విద్యా కోర్సులకు ప్రాక్టికల్ పబ్లిక్ పరీక్షలు, మే 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయని సార్వత్రిక విద్యాపీఠం డైరక్టర్ డా. కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

    All the teachers are instructed to fill the PINDICs for Second quarter by end of March 31st 2022 without fail

    PINDICs 2nd Quarter link March 31 లోపు పిండిక్స్ 2వ క్వార్టర్ ని క్రింద ఇచ్చిన గూగుల్ పారం లో వివరాలు నింపి సబ్మిట్ చేయాలి. 

    https://forms.gle/32vgMyU78zxngxF69


    Teacher eligibility test TET conducted On june22

    జూన్ లో టెట్. విద్యాశాఖ కసరత్తు. 2018 తర్వాత మళ్లీ ఇప్పుడే

    రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) నిర్వహణకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఏటా టెటు నిర్వహించాల్సి ఉండగా.. రాష్ట్రంలో 2018 తర్వాత ఇప్పటి వరకు నిర్వహించలేదు. దీంతో బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఐదేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. గతేడాది జూన్లో విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ టెట్ రివైజ్డ్ సిలబసు ప్రకటించడంతో వారిలో ఆశలు చిగురించాయి. అయితే వివిధ కారణాల వల్ల గతేడాది కూడా పరీక్షలు జరగలేదు. దీంతో ప్రభుత్వం ఈ ఏడాదిటెట్ నిర్వహించాలని యోచిస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఏటా డీఎస్సీ వేస్తామని ప్రభుత్వం ఏర్పా టుకు ముందే ప్రకటించింది. కానీ 2019 నుంచి ఒక్క డీఎస్సీ నీ ప్రకటించకపోవడంతో.. కనీసం టెట్ అయినా నిర్వహిస్తే ఆ తర్వాత డీఎస్సీకి అవకాశాలు ఉంటాయని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే 2019, 20లో జన వరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం గతేడాది జూ న్లో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా జూన్ లోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని, అందులో ఉపా ధ్యాయ పోస్టుల భర్తీ కూడా ఉంటుందని భావిస్తు న్నారు. ఈ దిశగానే విద్యాశాఖ జూన్లో టెట్ నిర్వహిం చేందుకు కసరత్తు చేస్తోంది.

    ఒక్కసారి అర్హత సాధిస్తే చాలు

    పాఠశాల విద్యాబోధనలో ప్రమాణాలు మెరుగుపరిచేం దుకు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎస్సీటీఈ) టీ చర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)ను ప్రతిపాదించింది. ఈ నేప థ్యంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు'టెట్'ను నిర్వహించాల్సి ఉంటుంది. గతంలో టె ట్లో అర్హత సాధించిన వారికి ఏడేళ్ల గుర్తింపు ఉండేది. అయి తే సవరించిన నిబంధనల మేరకు ఒక్కసారి అర్హత సాధిస్తే జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది. ఏపీ టెట్కు సంబంధిం చి.. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించేందు కు(ఎస్ఓటీ) పేపర్-1ఏ. ఆరో తరగతి నుంచి 8వ తరగతి వ రకు బోధించేవారు (స్కూల్ అసిస్టెంట్ పేపర్-2ఏ రాయా ల్సి ఉంటుంది.

    నియామకాల్లో వెయిటేజీ

    ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరాలంటే అభ్యర్థులుడీఎస్సీ రాయాల్సి ఉంటుంది. అంతకు ముందు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) నిబంధనల మేర కు టెట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అలాగే టెట్లో ఉత్తీర్ణత సాధించినవారికి ఉపాధ్యాయ నియామక పోస్టుల్లో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్ రాసేందుకు పేపరు బట్టి ఇంటర్మీడియెట్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీతోపాటు డీఈడీ, బీపీఈడీ తత్సమాన కోర్సులు చదివి ఉండాలి. పూర్తి ఆన్లైన్ విధానంలో 150 మార్కులకు రెండున్నర గంటల పాటు నిర్వహించే ఏపీ టెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటా యి. 1-5 తరగతుల టీచర్ పోస్టులకు పోటీ పడేవారు పేపర్ 1ఏకు; 6-8 తరగతుల టీచర్ పోస్టులకు పోటీ పడేవారు పేపర్ 2ఏకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఆయా పోస్టులకు పే ర్కొన్న అర్హతలు కలిగిన వారు రెండు పేపర్లకూ హాజర వ్వొ చ్చు. టెట్ ప్రశ్నపత్రం మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటు ంది. టెట్ జనరల్ అభ్యర్థులు (ఓసీలు) కనీసం 60 శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్ సర్వీసెమెన్ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు పొందితేనే.. అర్హత సాధించినట్లు అవుతుంది.

    April 22 General holidays for govt institutions

    ఏప్రిల్.2022 లో వచ్చే సెలవులు

    సెలవులు

    02.04.2022 ఉగాది పండుగ.

    03.04.2022 ఆదివారం.

    05.04.2022 బాబుజగ్జీవన్ రామ్ జయంతి.

    10.04.2022 ఆదివారం. (శ్రీరామ నవమి)

    14.04.2022 డా.B.R. అంబేడ్కర్ జయంతి.

    15.04.2022 గుడ్ ఫ్రైడే.

    17.04.2022 ఆదివారం.

    24.04.2022 ఆదివారం.

    ♦️గమనిక♦️

    రెండవ శనివారం 09.04.2022 ఒంటి పూట బడులలో వర్తించదు

    ప్రైవేటు స్కూళ్లలో పేద విద్యార్థులకు 25% సీట్లు.విద్యా హక్కు చట్టం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం

    రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యా ర్థులకు 25 శాతం సీట్లు కేటాయించే దుకు సంబంధించిన విద్యా హక్కు చట్టం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం 12 ( 1 ) ( సి ) నిబంధనను సోమవారం తీసుకుందని పాఠశాల విద్యా శాఖ కమిష నర్ కె . సురేష్ కుమార్ చెప్పారు . ఆయన విద్యా హక్కు చట్టం రాష్ట్ర కమిటీ చైర్మన్ బుడితి రాజశేఖర్ , సభ్యులు , ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ప్రతినిధులు , ఎన్జీవోలతో సమావేశ మయ్యారు . 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున .. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు . ప్రైవేటు స్కూళ్లలో విద్యా హక్కు చట్టం 12 ( 1 ) ( సి ) ని తప్పకుండా చేసేందుకు ప్రైవేటు పాఠశాలల అసోసి యేషన్ ప్రతినిధులు , ఎన్జీవోలు అంగీకరిం చినట్లు కమిషనర్ తెలిపారు . ఒక్కో విద్యార్థికయ్యే ఖర్చుకు సంబంధించిన నిర్ణయాలపై కమిటీ కూలంకషంగా చర్చలు జరిపిందని మీడియాకు చెప్పారు . సమావేశంలో సమగ్ర శిక్షా రాష్ట్ర సంచాల కులు కె.వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు .

    Child info students data update

    అమ్మఒడి జూన్ లో అని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.కావున మన పాఠశాల లో చదివే పిల్లల వివరాలు CHILD INFO డేటా అప్డేట్(ఒకసారి సరిచూసుకోండి) చేసుకోండి. 

    CHILD ADHAAR,MOTHER NAME,MOTHER ADHAAR,MOTHER BANK ACCOUNT, IFSC CODE, FATHER NAME AND FATHER ADHAAR

    తరువాత అప్డేట్ చేయమని ఉత్తర్వులు వస్తే  అందరూ ఒకేసారి చేస్తే server సరిగా పనిచేయడానికి ఇబ్బంది అవుతుంది. కావున ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి login అయ్యి పిల్లల వివరాలు ఎడిట్ చేయవచ్చు.

    https://studentinfo.ap.gov.in/logout.do

    BC Educational InstitutionsApplication Form For 5th Class admissions 2022-23

    ప్రస్తుతం 4వ తరగతి చదివే విద్యార్థులకు మాత్రమే.NO EXAM ,Only Lottery. APR Schools for BC Welfare

    (మహాత్మా జ్యోతి బా ఫూలే గురుకుల పాఠశాలలు)లోకి 5వ తరగతి లో ప్రవేశానికి లాటరీ ద్వారా ఎంపిక జరుగుతుంది. అప్లికేషన్ తేదీలు 28/3/22 to 27/4/22

    ఆన్లైన్ అప్లికేషన్ లింక్ Online application link

    BC Educational InstitutionsApplication Form For 5th Class admissions 2022-23

    Cremelayer complete information

    క్రీమిలేయర్ కీలక సమాచారం.ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు 

    వెనుకబడిన తరగతుల  సంక్షేమ శాఖ సంచాలకుల సర్క్యులర్ నెంబర్ ఈ/424/2014 తేదీ 28.0 7.2014 ద్వారా జీవో నెంబర్ 20 వెనుకబడిన తరగతిలో సంక్షేమ శాఖ తేదీ 31.10.17 పై సూచనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న బీసీ సాధారణ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు క్రిమిలేయర్ వర్తించదు. అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 స్థాయిలో మొదట ఉద్యోగమా నియామకము పొంది, ప్రమోషన్ ద్వారా జిల్లా అధికారి వారి వార్షికాదాయం ఎనిమిది లక్షలు దాటిన వీరు కూడా క్రిమిలేయర్ కింద రారు, వారి పిల్లలు కూడా ఓ బి సి లుగా పరిగణించ బడుతారు.

    1. ఐఏఎస్, ఐపీఎస్, ఐ ఎఫ్ఎస్ గ్రూప్ వన్ ఉద్యోగాలలో నియామకం పొందినవారు.

    2. తల్లిదండ్రులు డైరెక్టుగా గ్రూప్ 2 ఉద్యోగంలో నియామకము పొందినవారు.

    3.తల్లిదండ్రులలో ఒక్కరైనా గ్రూప్ 2 ద్వారా ఉద్యోగంలో మొదట నియామకము కాబడి  గ్రూప్-1 స్థాయి ఉద్యోగమునకు ప్రమోషన్ పొందిన వారి పిల్లలు మాత్రమే క్రిమిలేయర్ గా పరిగణించబడతారు.

    సాధారణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి వార్షిక ఆదాయము 8 లక్షల రూపాయలు దాటినా వారి పిల్లలకు క్రిమిలేయర్ వర్తించదు.

    కానీ కొంత మంది సిబ్బందికి క్రిమిలేయర్ పై సరైన అవగాహన లేక సాధారణ బిసి ఉద్యోగులు, ఉపాధ్యాయుల వార్షికాదాయము ఎనిమిది లక్షలు దాటిందని వారి పిల్లలకు ఓ బి సి సర్టిఫికెట్లు ఇవ్వటం లేదు. అందువలన వారి పిల్లలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఐఐటి ఇంజనీరింగ్ మెడికల్ ఇతర కోర్సుల లో రిజర్వేషన్లు కోల్పోతున్నారు. కావున అధికారులకు ఈ విషయము తెలిపి,తగిన సర్టిఫికేట్ పొందవచ్చు.

    Teacher information system TIS Report option in Individual Login

     ఉపాధ్యాయుల వ్యక్తిగత లాగిన్ లో TIS  Report Download option ను ఇవ్వడం జరిగింది. 

    ఉపాధ్యాయుల వ్యక్తిగత లాగిన్ నందు Teacher Card Download చేసుకోండి. Treasury ID తో లాగిన్ కావాలి.

    http://studentinfo.ap.gov.in

    పీఆర్సీపై మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల భేటీ

    వేతన సవరణ సంఘం సిఫార్సుల్లో పెండింగ్‌ అంశాలపై చర్చించేందుకు సచివాలయంలో గురువారం మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. డీఏ రికవరీ నిలుపుదలకు ఉత్తర్వులు ఇవ్వాలని, డీఏ, పీఆర్సీ బకాయిలు ఇవ్వాలని నాయకులు కోరారు. పీఆర్సీ ప్రతి ఐదేళ్లకు అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని, పెండింగ్‌ పీఎఫ్‌, జీఎల్‌ఐ బిల్లులు మంజూరు చేయాలని విన్నవించారు. ప్రభుత్వరంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, గురుకులాలకు పీఆర్సీ అమలయ్యేలా ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలని ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. వీటిపై శుక్రవారం ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు మంత్రుల కమిటీ బదులిచ్చింది. సీపీఎస్‌ రద్దుపై ఏప్రిల్‌ 4న ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు చర్చించనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు ఉత్తర్వులు ఇచ్చేందుకు వారం సమయం పడుతుందని మంత్రులు పేర్కొన్నారు. పీఎఫ్‌, జీఎల్‌ఐ బిల్లుల డేటాను ఏప్రిల్‌ 4న ఇవ్వనున్నట్లు తెలిపారు. పీఆర్సీ పెండింగ్‌ అంశాలపై చర్చించేందుకు ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించకపోవడం అప్రజాస్వామికమని ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు హృదయరాజు విమర్శించారు.

    Bit Bank General knowledge bits for competative exams

    పోటీ పరీక్షలకు ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ పరీక్ష బిట్స్ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లో అందుబాటులో ఉంచడం జరిగింది.

    1. ప్రపంచంలో అతిపెద్ద ఖండం ?

    జ: ఆసియా (ప్రపంచ వైశాల్యంలో 30%)

    2. ప్రపంచంలో అతి చిన్న ఖండం ?

     జ: ఆస్ట్రేలియా

    3. ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ?

    జ: పసిఫిక్ మహాసముద్రం

    4. ప్రపంచంలో అతి చిన్న సముద్రం ?

     జ: ఆర్కిటిక్ మహాసముద్రం

    5. ప్రపంచంలో అత్యంత లోతైన సముద్రం ?

    జ: పసిఫిక్ మహాసముద్రం

    6. ప్రపంచంలోనే అతి పెద్ద సముద్రం ?

    జ: దక్షిణ చైనా సముద్రం

    7. ప్రపంచంలో అతిపెద్ద గల్ఫ్ ?

     జ: గల్ఫ్ ఆఫ్ మెక్సికో

    8. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం ?

     జ: గ్రీన్‌ల్యాండ్

    9. ప్రపంచంలోని అతిపెద్ద ద్వీప సమూహం ?

     జ: ఇండోనేషియా

    10. ప్రపంచంలో అతి పొడవైన నది ?

     జ: నైలు నది L. 6650 కి.మీ

    1. The largest continent in the world?

    Ans: Asia (30% of global area)

    2. The smallest continent in the world?

     Ans: Australia

    3. The largest ocean in the world?

    Ans: The Pacific Ocean

    4. The smallest ocean in the world?

     Ans: The Arctic Ocean

    5. The deepest sea in the world?

    Ans: The Pacific Ocean

    6. The largest ocean in the world?

    Ans: South China Sea

    7. The largest gulf in the world?

     Ans: Gulf of Mexico

    8. The largest island in the world?

     Ans: Greenland

    9. Which is the largest island group in the world?

     Ans: Indonesia

    10. The longest river in the world?

     Ans: The Nile River L. 6650 km


    1. టీ తయారు చేసేందుకు కెటిల్‌లో నీటిని విద్యుత్‌తో వేడి చేసి ఏ పద్ధతిలో చేస్తారు?

      జ: ప్రసరణ ద్వారా

    2. వృద్ధుల వైద్య అధ్యయనాన్ని ఏమంటారు?

      జ: జెరియాట్రిక్స్

    3. హైపోగ్లైసీమియా అనే వ్యాధి ఏ రక్తంలో లోపం వల్ల వస్తుంది?

      జ: గ్లూకోజ్

    4. HTLV-II అనే వైరస్ ద్వారా ఏ వ్యాధి వ్యాపిస్తుంది?

       జ: ఎయిడ్స్

    5.  మానవ శరీరంలో అతి చిన్న గ్రంథి ఏది? 

       జ: పిట్యూటరీ

    6. ప్రాథమికంగా ఎంజైమ్ అంటే ఏమిటి?

       జ: ప్రోటీన్

    7.  సైనోకోవలమైన్ అంటే ఏమిటి?

       జ: విటమిన్ B12

    8. టెట్రా డ్యూథైల్ లీడ్ (TEL) ను పెట్రోల్‌లో ఎందుకు కలుపుతారు?

      జ: యాంటీ నాకింగ్ రేటింగ్‌ని పెంచడానికి (పేలుడు రేటు)

    9. వజ్రం మెరుస్తుందా?

      జ: మొత్తం అంతర్గత ప్రతిబింబం కారణంగా

    10. సాపేక్ష ఆర్ద్రత కొలుస్తారు?

      జ:  హైగ్రోమీటర్‌తో


    1. In what method is water in a kettle heated electrically to make tea?

      Ans: By circulation

    2. What is the medical study of the elderly called?

    Ans: Geriatrics

    3. Hypoglycemia is caused by a deficiency in which blood?

      Ans: Glucose

    4. Which disease is transmitted by HTLV-II virus?

       Ans: AIDS

    5. Which is the smallest gland in the human body?

       Ans: Pituitary

    6. What is basically an enzyme?

       Ans: Protein

    7. What is cyanocobalamin?

      Ans: Vitamin B12

    8. Why is tetra dutyl lead (TEL) added to petrol?

      Ans: To increase the anti-knocking rating (explosion rate)

    9. Does the diamond shine?

    Ans: Due to the total internal reflection

    10. Is relative humidity measured?

      Ans: With a hygrometer


    1. మధ్యదర సముద్రపు తాళపు చెవి అని ఎ జల సంధిని అంటారు ?

    జ: జిబ్రల్టార్ జలసంధి.

    2. విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ కలదు ?

    జ: తిరువనంతపురం.

    3. కామన్వేల్త్ క్రీడలు తొలిసారిగా ఎక్కడ జరిగాయి ?

    జ: హమిల్టన్.

    4. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CDRI) ఎక్కడ కలదు ?

    జ: లక్నో.

    5. ఐక్యరాజ్యసమితి తొలి సెక్రెటరీ జనరల్ ఎవరు ? ఎ దేశస్తుడు ?

    జ: ట్రిగ్వేలి (నార్వే)

    1. Which strait is called the ear of the Mediterranean Sea?

    Ans: The Strait of Gibraltar.

    2. Where is the Vikram Saraboy Space Center located?

    Ans: Thiruvananthapuram.

    3. Where was the Commonwealth Games first held?

    Ans: Hamilton.

    4. Where is the Central Drug Research Institute (CDRI) located?

    Ans: Lucknow.

    5. Who was the first Secretary General of the United Nations? A countryman?

    Ans: Trigveli (Norway)‌‌

    NISHTHA-3.0 AP_FLN_Module -11 Last Date to join 15.04.2022

    నిష్ట 3 శిక్షణా కార్యక్రమంలో భాగంగా మాడ్యూల్ 11 కి సంబంధించిన తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లింకులు అందుబాటులో కలవు

    Course End Date : 15-04-2022

    ENGLISH MEDIUM LINK

    Integration of ICT in Teaching, Learning and Assessment https://diksha.gov.in/explore-course/course/do_31349147866177536011368

    తెలుగు మీడియం లింక్

    AP_FLN_11. బోధన అభ్యసనం మదింపులలో ICT ని మిళితం చేయడం

    https://diksha.gov.in/explore-course/course/do_31349202001675878411600

    LEARN A WORD A DAY (రోజుకో పదం) 15.02.2022 నుండి 15.03.2022 వరకు తేదీ : 09.03.2022

    లెవెల్ - 1 (1,2 తరగతులు)

    Leaf : ఆకు


    లెవెల్ - 2 (3,4,5 తరగతులు)

    Quiet : నిశబ్దము

    1). Keet quiet in the class.

    2). The baby sleeps quietly.

    3). It is quiet at night.


    లెవెల్ - 3 (6,7,8 తరగతులు)

    Relevant : సంబందమైన

    1). My teacher gives us relevant information.

    2). Your answer is not relevant.

    3). Tick the relevant box below.


    లెవెల్ - 4 (9,10 తరగతులు)

    Trust : నమ్మకం

    1). Trust your strengths.

    2). Don't trust everyone.

    3). I trust my doctor.

    Ap cinema theater New Prices

    ఏపీలో సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ

     కార్పొరేషన్లలో ఏసీ థియేటర్లలో రూ.70, రూ.100

    కార్పొరేషన్లలో నాన్ ఏసీలో టికెట్ ధరలు రూ.40, రూ.60

    కార్పొరేషన్ స్పెషల్ థియేటర్లలో రూ.100, రూ.125

    కార్పొరేషన్ మల్టీప్లెక్స్ లో టికెట్ ధర రూ.150, రూ.250


    మున్సిపాలిటీల్లో ఏసీ థియేటర్లలో రూ.60, రూ.80

    మున్సిపాలిటీల్లో నాన్ ఏసీలో టికెట్ ధరలు రూ.30, రూ.50

    మున్సిపాలిటీల్లో స్పెషల్ థియేటర్లలో రూ.80, రూ.100

    మున్సిపాలిటీల్లో మల్టీప్లెక్స్ లో టికెట్ ధర రూ.125, రూ.250


    నగర పంచాయతీల్లో ఏసీ థియేటర్లలో రూ.50, రూ.70

    నగర పంచాయతీల్లో నాన్ ఏసీలో టికెట్ ధరలు రూ.20, రూ.40

    నగర పంచాయతీల్లో స్పెషల్ థియేటర్లలో రూ.70, రూ.90

    నగర పంచాయతీల్లో మల్టీప్లెక్స్ ల్లో టికెట్ ధర రూ.100, రూ.250

    LEARN A WORD A DAY (రోజుకో పదం) 15.02.2022 నుండి 15.03.2022 వరకు తేదీ : 08.03.2022

    లెవెల్ - 1 (1,2 తరగతులు)

    Ball : బంతి


    లెవెల్ - 2 (3,4,5 తరగతులు)

    Pleasant : ఆహ్లాదకరమైన

    1). The climate is very pleasant.

    2). What pleasant surprise ?.

    3). This is a pleasant garden.


    లెవెల్ - 3 (6,7,8 తరగతులు)

    Neighbour : ఇరుగుపొరుగు

    1). Shravani is my neighbour.

    2). Our old neighbour asked for my help.

    3). We should help our neighbours.


    లెవెల్ - 4 (9,10 తరగతులు)

     In front of : ముందు

    1). I stood in front of the audience to give the speech.

    2). We have a beautiful garden in front of our school.

    3). A car was parked in front of the school.

    Legend cricket bowler Shane warn passed away

    ఆసీస్ లెజెండ్ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం

    సిడ్నీ: ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం చెందాడు. 52 ఏళ్ల వార్న్ గుండెపోటుతో మరణించినట్టు  తెలుస్తోంది. ప్రపంచంలోని దిగ్గజ బౌలర్లలో ఒకడిగా పేరు గాంచిన వార్న్.. ప్రపంచంలో దిగ్గజ క్రికెటర్లనే తన బౌలింగుతో ముప్పుతిప్పలు పెట్టాడు. వార్న్ థాయిలాండ్‌లోని ఓ విల్లాలో ఉండగా ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా కుప్పకూలిన వార్న్‌ను బతికించేందుకు మెడికల్ సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.  

    1992-2007 మధ్య కాలంలో వార్న్ 145 టెస్టులు, 194 వన్డేల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 1001 వికెట్లు తీసుకున్నాడు. రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అయిన వార్న్ వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టగా, టెస్టుల్లో 708 వికెట్లు తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్‌లోనూ ఆడిన వార్నర్ 57 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి తొలి సీజన్‌లో జట్టుకు ట్రోఫీని అందించిపెట్టాడు. టెస్టుల్లో పదిసార్లు పదికి పది వికెట్లు పడగొట్టి అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

    షేన్ వార్న్ మరణవార్తతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపపోయింది. ఈ వార్తను తాను నమ్మలేకపోతున్నానని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. జీవితమంటే ఇంతేనని, దానిని అర్థం చేసుకోవడం కష్టమన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతడి అభిమానులకు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నాడు

    LEARN A WORD A DAY (రోజుకో పదం) 15.02.2022 నుండి 15.03.2022 వరకు తేదీ : 04.03.2022

    లెవెల్ - 1 (1,2 తరగతులు)

    Tap : పంపు


    లెవెల్ - 2 (3,4,5 తరగతులు)

    Measure : కొలత

    1). You can measure with a scale.

    2). The tailor measures with tape.

    3). Measure the length of the board.


    లెవెల్ - 3 (6,7,8 తరగతులు)

    Obstacle : అవరోధం

    1). Despite his obstacles , he succeeded.

    2). Obstacles are the tests for our success.

    3). Farmers face many obstacles in growing crops.


    లెవెల్ - 4 (9,10 తరగతులు)

    Compliment : అభినందన

    1). He received compliments for his painting.

    2). My boss gave compliments on my speech.

    3). I was impressed by their compliments.

    NISHTHA - 3.0 FLN_Module - 10 Course join link for English, Telugu, Urdu medium

    నిష్ట 3 Fln కోర్స్ 10 తెలుగు ఇంగ్లీష్ మీడియం లింక్ ను అందుబాటులో ఉంచడం జరిగింది .ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి దీక్షా యాప్ లో ఓపెన్ చేసి కోర్సులో జాయిన్ అవ్వగలరు

    English Medium

    Last Date to join : 31.03.2022

    https://diksha.gov.in/explore-course/course/do_31348008658641715213831

    FLN _module - 10

    తెలుగు మీడియం

    https://diksha.gov.in/explore-course/course/do_31348010265243648013905


    FLN_Module -10

    ఉర్దూ మీడియం

    https://diksha.gov.in/explore-course/course/do_31348009224262451213859

    Teacher information system pending teachers data details by treasury id

    టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం లో మీ యొక్క ట్రెజరీ ఐడి నెంబర్ ని  ఇచ్చి TIS లో మీ వివరాలు సబ్మిట్ అయినవా లేక  పెండింగ్లో ఉన్నవో  స్టేటస్ తెలుసుకోవచ్చు.

    Click here to download file

    Jagananna gorunudda HOT PONGAL Preparation Process

    హాట్ పొంగల్

    కావాల్సిన పదార్దములు

    1)పెసరపప్పు 2)బియ్యం 3)పచ్చిమిర్చి 4)మిరియాలు

    5)కరివేపాకు 6)అల్లం 7)జీడిపప్పు 8)నెయ్యి 9)జీలకర్ర

    10) ఉప్పు 11) ఇంగువ.

    తయారు చేసే విధానం

     • మొదటి బియ్యం మరియు పెసరపప్పు  (3:1 నిష్పత్తి) లో తీసుకుని శుభ్రంగా నీటితో కడిగి 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి.

     • తరువాత వీటికి రెండు రెట్లు నీరు గిన్నెలో ఉండేలా చూసుకుని తగినంత ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టి అన్నం ఉడికించినట్లు ఉడికించాలి.

     • మనకు పొంగల్ చిక్కగా దగ్గరగా ఉండాలంటే నీరు తక్కువగాను, లేదా పలుచగా, జారుతుఉండేలా కావాలంటే కొంచెం నీరు ఎక్కువగాను తీసుకోవాలి.

     • ఇలా బియ్యం పప్పు బాగా ఉడికిన తరువాత పొయ్యిమీద నుండి గిన్నె దింపి మూత వేసి పక్కన పెట్టుకోవాలి.

     • తరువాత ఒక కడాయి తీసుకుని దానిలో తగినంత నెయ్యి వేసి జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకోవాలి.

     • తరువాత అదే నెయ్యిలో ముక్కలుగా తరిగిన పచ్చి మిర్చి, తురిమిన అల్లం, కరివేపాకు మరియు మిరియాల పొడి వేసి దోరగా వేయించాలి.

     • ఇలా వేయించిన మిశ్రమాన్ని ముందుగా వండిపెట్టిన పొంగల్ నందు వేసి బాగా కలియబెట్టి వేయించిన జీడిపప్పును కూడా కలిపి మూత వేసి 15 నిమిషాలు అలా పక్కన ఉంచాలి.

     • వీలైతే ఇంగువను కూడా చేరిస్తే పొంగల్ మరింత రుచిగా ఉంటుంది.

    " LEARN A WORD A DAY " (రోజుకో పదం) 15.02.2022 నుండి 15.03.2022 వరకు తేదీ : 03.03.2022

    లెవెల్ - 1 (1,2 తరగతులు)

    Sky : ఆకాశం


    లెవెల్ - 2 (3,4,5 తరగతులు)

    Leader : నాయకుడు

    1). Our leader guides as well.

    2). Ravi is our class leader.

    3). Who is your team leader ?


    లెవెల్ - 3 (6,7,8 తరగతులు)

    Murmur : గొణుగుడు

    1). Do not murmur in the classroom.

    2). Grandmother murmured when i switch on the light at midnight.

    3). I heared murmuring sounds while passing by.


    లెవెల్ - 4 (9,10 తరగతులు)

    Determination : దృఢసంకల్పం

    1). His determination helped him to secure a good job.

    2). Fight the covid with courage and determination.

    3). He is a man of determination.

    Teacher information system login website

    పనిచేస్తున్న టీచర్ ఇన్ఫర్మేషన్ లాగిన్ సర్వీస్.OTP Login సాంకేతిక సమస్యలు సరి చేయడం జరిగింది.ఉపాధ్యాయులు Teasury ID తో లాగిన్ అయ్యి వివరాలు Update చేసుకోవచ్చు.

    TIS LINK.

    https://studentinfo.ap.gov.in/EMS/

    NATO (North Atlantick trity organization ) History and Group of countries in nato

     What Is NATO: ఎక్కడ చూసినా 'నాటో' చర్చ! సభ్య దేశాల జాబితా తెలుసా?

    ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించి ఆరో రోజులైంది. అసలు ఒక దేశానికి మరో దేశానికి మధ్య ఎంత శత్రుత్వం ఉన్న మాటల పరంగానో, ఆంక్షలు పరంగానో ఉండేవి గానీ యుద్ధం వరకు వెళ్లేది కాదు.కానీ తాజాగా ఉక్రెయిన్‌ రష్యా ఉదాంతాం మాత్రం అలా కాకుండా నేరుగా రణరంగంలో ఢీకోడుతున్నాయి. అసలు ఈ యుద్ధానికి ప్రధాన కారణం నాటోలో ఉక్రెయిన్‌ చేరాలనుకోవడమే. అసలు నాటో అంటే ఏమిటి. అందులో ఉ‍క్రెయిన్‌ చేరితో రష్యాకు ఎందుకు నచ్చట్లేదు.. తెలుసుకుందాం!నాటో అంటే..

    నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) అనేది ఉత్తర అట్లాంటిక్ కూటమి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్‌ సహా 12 దేశాల సైనిక కూటమి. ఈ సంస్థ 4 ఏప్రిల్ 1949న సంతకం చేసిన ఉత్తర అట్లాంటిక్ ఒప్పందాన్ని అమలు చేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం భవిష్యత్తులో ఇతర దేశాల నుంచి తమని తాము రక్షించుకనేందుకు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, నెదర్లాండ్స్, కెనడా నాటోని స్థాపించాయి. దీని ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ఉంది. ఇందులోని ఒప్పందం ప్రకారం.. నాటోలో సభ్య దేశాలుగా ఉ‍న్న ఏ ఒక్క దేశంపైన ఏ కారణం చేతనైనా బయట దేశాలు సాయుధ దాడి జరిపినట్లయితే.. ఆ దేశానికి నాటోలోని మిగిలిన సభ్య దేశాలన్నీ సహాయం చేయాలి. మరో లక్ష్యం ఏమంటే.. రెండో ప్రపంచ యుద్ధానంతరం యూరప్‌లో సోవియట్ రష్యా విస్తరణ ముప్పును అడ్డుకునేందకని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం రష్యా కూడా నాటోలో ఉక్రెయిన్‌ చేరాలంటే వ్యతిరేకిస్తోంది కూడా అందుకే!ప్రపంచంలోనే పవర్‌పుల్‌ కూటమి..

    ప్రస్తుతం నాటోలో 30 దేశాలు ఉన్నాయి. వారు అధికారికంగా నాటో సభ్యులు. నాటోలో 27 యూరోపియన్ దేశాలు, యురేషియాలో ఒక దేశం, ఉత్తర అమెరికాలో 2 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నాటో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కూటమిగా పిలుస్తారు. ఎందుకుంటే శక్తివంతమైన యూరోపియన్‌ దేశాలు, సంపన్న దేశాలు నాటో సభ్య దేశాలుగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశంగా పిలువబడే అమెరికా కూడా దానిలో భాగం. నాటో కూటమి సైనిక బలగం, వారి వద్ద ఉండే అత్యాధునికి ఆయుధాలు ఇలా ఒక్కటేంటి.. నాటో కూటమిలోని దేశాలలో ఏ ఒక్క దేశంతో యుద్ధం చేస్తే వార్‌ వన్‌సైడ్‌ అని క్లారిటీగా చెప్పవచ్చు.నాటో అంటే గిట్టని రష్యా..

    రష్యా మినహా పూర్తి యూరోపియన్ దేశాలు దానిలో సభ్యులుగా ఉన్నాయి. ఈ కూటమిలో భాగం కాని ఏకైక దేశం ఇది. దీనికి రష్యా , నాటో అంతర్గత కారణాలే అని చెప్పచ్చు. తాజాగా ఉక్రెయిన్‌ రష్యా సరిహద్దు దేశం కావడం , అది నాటో చేరాలని ప్రయత్నించడంతో రష్యాకు దిగులు పట్టుకుంది. ఎందుకంటే ఉక్రెయిన్‌ నాటోలో చేరితో పశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌ను అడ్డుపెట్టుకుని రష్యాను ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయని పుతిన్ భావించాడు. అందుకు ఉక్రెయిన్‌ విషయంలో పరిస్ధితులు యద్ధానికి దారితీశాయి.

    సభ్య దేశాలు చేరిన సంవత్సరం

    1.👉 యునైటెడ్ స్టేట్స్ 1949

    2.👉 యునైటెడ్ కింగ్‌డమ్ 1949

    3.👉 పోర్చుగల్ 1949

    4.👍నార్వే 1949

    5.👉ఐస్లాండ్ 1949

    6.👉నెదర్లాండ్స్ 1949

    7.👉లక్సెంబర్గ్ 1949

    8 .👉ఇటలీ 1949

    9.👉ఫ్రాన్స్ 1949

    10.👉డెన్మార్క్ 1949

    11.👉కెనడా 1949

    12.👉బెల్జియం 1949

    13.👉టర్కీ 1952

    14.👉గ్రీస్ 1952

    15.👉జర్మనీ 1982

    16.👉స్పెయిన్ 1955

    17.👉పోలాండ్ 1999

    18.👉హంగేరి 1999

    19.👉చెక్ రిపబ్లిక్ 1999

    20.👉స్లోవేకియా 2004

    21.👉స్లోవేనియా 2004

    22.👉రొమేనియా 2004

    23.👉లిథువేనియా 2004

    24.👉లాట్వియా 2004

    25.👉ఎస్టోనియా 2004

    26.👉బల్గేరియా 2004

    27.👉క్రొయేషియా 2009

    28.👉అల్బేనియా 2009

    29.👉ఉత్తర మాసిడోనియా 2020

    30👉.మోంటెనెగ్రో 2017

    Learn a word a day today word

    " LEARN A WORD A DAY " (రోజుకో పదం) 15.02.2022 నుండి 15.03.2022 వరకు

    తేదీ : 02.03.2022

    లెవెల్ - 1 (1,2 తరగతులు)

    Conduct Spell Bee

    లెవెల్ - 2 (3,4,5 తరగతులు)

    Knock : తట్టుట

    1). Please knock on the door.

    2). Do not knock it.

    3). Who knocks on the door ?

    లెవెల్ - 3 (6,7,8 తరగతులు)

    Plenty : చాలా

    1). He earned plenty of money.

    2). We see plenty of stars at night.

    3). There are plenty of trees in the garden.

    లెవెల్ - 4 (9,10 తరగతులు)

    Behavior : నడవడిక

    1). Good behavior is always praised.

    2). Behavior reflects your attitude.

    3). His behavior is sometimes rough.

    LATEST POSTS

    Telugu Interactive words wheel

    Word Wheel Word Wheel అ ? SPIN