మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

Spoken English in Telugu Sentence Structures in Tenses


ఇప్పటి వరకు మనం సహాయక క్రియలతో (Helping Verbs) మరియు ప్రశ్నా పదముతో (Question Word) ప్రశ్నలు ఎలా నిర్మించాలో నేర్చుకున్నాం.

అయితే సహాయక క్రియలతో, ప్రశ్నా పదముతో అడిగే ప్రశ్నలకు సమాధానాలుచెప్పే విధానం వేరుగా ఉంటుంది. అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం.


ప్రశ్న:  మీరు అన్నం తింటారా?

        Do you eat food?

     ( తినడం  ఇష్టం అయితే )


సమాధానం:   అవును, నేను అన్నం తింటాను.

    Yes, I eat food   అని


    ( తినడం ఇష్టం లేకుంటే )

సమాధానం:   లేదు, నేను అన్నం తినను.

                 No, I do not eat  food అని సమాధానం చెప్పాలి.


మీరు అన్నం తింటారా? (Do you eat food?) అనేది సహాయక క్రియతో (Helping Verb) కూడిన ప్రశ్న కాబట్టి అవును (Yes),  లేదు (No)  అనే  సమాధానాలు చెప్పాలి.


మీరు ఏం తింటారు?

What do you eat?

నేను అన్నం తింటాను.

I eat food.


మీరు ఏం తింటారు? (What do you eat?) అనేది ప్రశ్నా పదముతో (Question Word) కూడిన ప్రశ్న కాబట్టి సమాధానం చెబితే సరిపోతుంది. సహాయక క్రియ ప్రశ్న (Helping Verb Question) లాగా అవును (Yes), లేదు (No) సమాధానాలు  చెప్పవద్దు.


ప్రశ్న:  మీరు ఏం తింటారు?

         మీరు  ఏమిటి  తినడం  చేస్తారు?

 

You   what    eat     do


  Q:   What   do  you   eat?

సమాధానం:    నేను అన్నం తింటాను.

                    

I     food     eat


Ans:  I       eat     food.


ప్రశ్న:   మీరు అన్నం తినరా?

    Q:  Do not you eat food?


     ( తినడం ఇష్టం లేకుంటే )


సమాధానం:   లేదు, నేను అన్నం తినను.


     Ans:     No,  I  do not  eat  food అని సమాధానం చెప్పాలి.

     (  తినడం  ఇష్టం అయితే  )


సమాధానం:   అవును, నేను అన్నం తింటాను.


    Ans:     Yes, I eat food అని సమాధానం  చెప్పాలి.


ప్రశ్న:   మీరు ఏం తినరు?

          మీరు ఏమిటి తినడం చేయరు?

          You  what   eat     do not


  Q:    What   do not  you   eat?

సమాధానం:   నేను అన్నం తినను.

          నేను  అన్నం  తినడం  చేయను

       I     food     eat      do not


Ans:    I     do not   eat     food.


1.   మీరు బడికి వెళతారా? మీరు    బడికి     వెళ్ళడం చేస్తారా?

     You  to school  go     do


    Do you go to School?


Ans:  అవును, నేను బడికి వెళతాను.

            Yes, I  go   to school


2.  మీరు బడికి వెలుతున్నారా?

     మీరు    బడికి      వెళుతూ ఉన్నారా?

    You  to school going     are

    Are   you  going  to school?


Ans:   అవును, నేను బడికి వెళుతున్నాను

         Yes, I  am  going  to school


3.  మీరు బడికి వెళ్ళారా?

     మీరు     బడికి       వెళ్ళి    ఉన్నారా?

     You  to school   gone   have

    Have  you  gone  to school?


Ans:   అవును, నేను బడికి వెళ్లాను

       Yes, I  have  gone  to school


4.   మీరు బడికి వెళ్ళరా?

      మీరు      బడికి      వెళ్ళడం చేయరా?

      You  to school     go     do not


      Do not   you   go  to school?


Ans:   లేదు, నేను బడికి వెళ్ళను

       No, I  do not  go  to school


5.  మీరు బడికి వెళతలేరా?

      మీరు   బడికి      వెళుతూ   లేరా?

 You  to school  going    are not


Are not   you   going  to school?


Ans:  లేదు, నేను బడికి వేళతలేను

 No,  I  am not   going   to school


6.   మీరు బడికి వెళ్ళలేదా?

     మీరు       బడికి       వెళ్ళి    లేరా?

     You   to school   gone   have not


   Have not  you  gone  to school?


Ans:  లేదు, నేను బడికి వెళ్ళలేదు

    No, I  have not  gone  to school


7.  మీరు ఎక్కడ వెళతారు?

    మీరు   ఎక్కడ   వెళ్ళడం చేస్తారు?

     You   where   go       do

     Where   do  you  go?


Ans:  నేను బడికి వెళతాను

      I  go   to school


8.  మీరు ఎక్కడ వెళుతున్నారు?

    మీరు  ఎక్కడ   వెళుతూ ఉన్నారు? You  where   going    are

      Where  are  you   going?


Ans:  నేను బడికి వెళుతున్నాను

    I  am  going  to school


9.   మీరు ఎక్కడ వెళ్ళారు?

       మీరు  ఎక్కడ వెళ్ళి  ఉన్నారు? You    where   gone   have

 Where  have  you  gone?


Ans:   నేను బడికి వెళ్లాను

         I  have  gone  to school


10.మీరు ఎక్కడ వెళ్లరు?

      మీరు  ఎక్కడ  వెళ్ళడం  చేయరు?

      You   where   go      do not


      Where  do not  you go?


Ans:  నేను బడికి వెళ్ళను

         I  do not  go  to school


11.  మీరు ఎక్కడ వెళతలేరు?

      మీరు   ఎక్కడ   వెళుతూ  లేరు?

     You  where    going    are not


      Where  are not   you   going?


Ans:  నేను బడికి వేళతలేను

         I  am not   going   to school


12.  మీరు ఎక్కడ  వెళ్ళలేదు?

       మీరు   ఎక్కడ      వెళ్ళి    లేరు?

      You   where    gone  have not


      Where  have not  you  gone?


Ans:   నేను బడికి వెళ్ళలేదు

          I  have not  gone  to school


పై వాక్యాలని ఆధారముగా చేసుకొని సందర్భాన్ని బట్టి ప్రశ్న తయారు చేసేటప్పుడు, ప్రశ్నా పదం (Question Word), కర్త (Subject), క్రియ (Verb) లను మార్చితే చాలు, చాలా రకాల ప్రశ్నలు తయారు చేయవచ్చు.


జవాబులను తయారు చేసేటప్పుడు, కర్త (Subject), సహాయక క్రియ (Helping Verb), కర్మ (Object) లని మార్చితే చాలు, అనేక రకాల జవాబులు తయారు చేయవచ్చు.


చాలా సులభముగా ఆంగ్లములో మాట్లాడవచ్చు.

LATEST POSTS

Vidya pravesh day 34 activities for primary

విద్యాప్రవేశ్ -34 వ రోజు 27/07/2024 న 1వ తరగతి విద్యార్థులతో చేయించవలసిన కృత్యాలు  Language & Literacy Development  ఫ్లాష్ కార్డ్స్ లేదా...