మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

ఎపిఆర్‌జెసి, ఎపిఆర్‌డిసి నోటిఫికేషన్‌ విడుదల.దరఖాస్తుకు మే 20 ఆఖరు తేదీ

ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆయా సంస్థలు నోటిఫికేషన్‌ విడుదల చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 జూనియర్‌ కాలేజీలు ఉనాుయి. వీటిలో బాలురుకు 4, బాలికలకు 2, కో ఎడ్యుకేషన్‌ 1, మైనారిటీ బాలురుకు 2, మైనారిటీ బాలికలకు1 చొప్పున కళాశాలలున్నాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఎపిఆర్‌జెసి పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ పరీక్ష రాసేందుకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు 2022 ఏప్రిల్‌ 28 నుంచి స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు 2022 మే 20 ఆఖరు తేదీ. దరఖాస్తు చేసుకున్నవారు జూన్‌ 5న ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు రాయాల్సి ఉంటుంది. పదోతరగతి ఆంధ్రప్రదేశ్‌లోనే చదువుకున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జనరల్‌ కళాశాలల్లో సీట్ల రిజర్వేషన్‌ ఒసి-28, ఎస్‌సి-15, ఎస్‌టి-6, బిసి ఎ-7, బిసి బి-10, బిసి సి-1, బిసి డి-7, బిసి ఇ-4, ఇడబ్ల్యుఎస్‌-10, సిఎపి-3, స్పోర్ట్స్‌-3, వికలాంగులు-3, అనాథలు-3 శాతంగా ఉంటుంది.

సీట్ల వివరాలు

విజయనగరం, తాటిపూడిలోని ఎపిఆర్‌జెసి బాలురు కళాశాలలో ఎంపిసి-60, బైపిసి-40, ఎంఇసి-30 సీట్లు ఉన్నాయి. కృష్ణాజిల్లా, నిమ్మకూరులోని కో ఎడ్యుకేషన్‌ కాలేజీలో ఎంపిసి-50, బైపిసి-30, సిఇసి-30, ఎంఇసి-25, ఇఇటి-21, సిజిటి-21 సీట్లు ఉన్నాయి. పలాుడు జిల్లా నాగార్జునసాగర్‌లోని బాలురు కళాశాలలో ఎంపిసి-68, బైపిసి-51, సిఇసి-39, ఎంఇసి-42 సీట్లు ఉన్నాయి. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని బాలికల కళాశాలలో ఎంపిసి-60, బైపిసి-40, ఎంఇసి-30 సీట్లు ఉనాుయి. గుంటూరులోని ఉర్దూ బాలుర కళాశాలలో ఎంపిసి-40, బైపిసి-40, సిఇసి-35 సీట్లు ఉన్నాయి. వీటిలో కోస్తాంధ్ర విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కరూులులోని బాలుర ఉర్దూ కళాశాలలో ఎంపిసి-40, బైపిసి-40, సిఇసి-35 సీట్లు ఉన్నాయి. వీటికి రాయలసీమ విద్యార్థులు అర్హులు. చిత్తూరు జిల్లాలోని, వాయలపాడు బాలికల ఉర్దూ కళాశాలలో ఎంపిసి-40, బైపిసి-40, సిఇసి-35 సీట్లు ఉన్నాయి. వీటికి కోస్తా, రాయలసీమకు చెందిన విద్యార్థులు అర్హులు.

దరఖాస్తు ఇలా..

ఎపిఆర్‌జెసి ప్రవేశపరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు https://aprs.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.250 ఆన్‌లైన్‌ పద్ధతిలో చెల్లించాలి. దరఖాస్తు చేసుకును వారికి ఐడి నెంబరు రాకుంటే ఆ దరఖాస్తుదారులకుఅర్హత లేనట్టే. వివరాలనీు ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఏమైనా తప్పుగా నమోదు చేస్తే సదరు దరఖాస్తులు తిరస్కరించబడతాయి. దరఖాస్తు చేసుకును వారికి మే 31 నుంచి హాల్‌ టిక్కెట్లు ఆన్‌లైన్‌ ద్వారా ఇవ్వబడతాయి. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి. ఏ జిల్లావారు ఏ కాలేజీకి దరఖాస్తు చేసుకోవచ్చో తెలుసుకునేందుకుపూర్తి వివరాలు కోసం https://aprs.apcfss.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. సలహాలు, సందేహాల కోసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య 9100332106, 9676404618, 7093323253 నెంబర్లను సంప్రదించొచ్చు.

ఎపిఆర్‌డిసి సీట్లు ఇలా..

నాగార్జునసాగర్‌లోని ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలో బిఎ, బికాం, బిఎస్‌సి కోర్సులకు నోటిఫికేషన్‌ వెలువడింది. వీటిలో బిఎా40, బికాం (జనరల్‌)-40, బిఎస్‌సి ఎంపిసి (మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రి)-36, బిఎస్‌సి-ఎంపిసి (మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌), బిఎస్‌సి-ఎంఇసి (మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌)కు కలిపి-36 మొత్తం 152 సీట్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. https://aprs.apcfss.in 

లో చూడవచ్చు.

AP 10th Class Hall Tickets Download without login

మీ జిల్లా, స్కూల్ పేరు, డేట్ అఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుని మీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ మే 2022 విద్యార్థుల Individual హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.

https://bse.ap.gov.in/APSSCHT22/RegDefault.aspx

Ammavodi new update for payment

అమ్మఒడి కి సంబంధించి బ్యాంక్ అకౌంట్  కొత్త అప్డేట్ 

గత రెండు సంవత్సరములు అమ్మఒడి పథకం డబ్బులు మీరు మీ యొక్క  బ్యాంకు అకౌంట్ వివరాలు స్కూల్ ఇచ్చేవారు , వాటినే  స్కూల్ లాగిన్ లో ENROLL చేసేవారు, ఆ బ్యాంకు అకౌంట్ లో డబ్బులు పడేవి

కానీ ఈ సంవత్సరం ఆలా కాదు. NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ లో మాత్రమే అమ్మఒడి డబ్బులు పడతాయి. NPCI లింక్ అయిన బ్యాంకు వివరాలు మాత్రమే స్కూల్ లాగిన్ లో ENROLL చేయాలి. NPCI అనగా NATIONAL PAYMENT CORPORATION OF INDIA. ఇది కేవలం అమ్మఒడి అనే కాదు ప్రభుత్వం నుండి రావాల్సిన ఏ నగదు అయినా NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ లో మాత్రమే పడతాయి . అది అమ్మఒడి కావచ్చు మరొకటి కావచ్చు.

బ్యాంకు అకౌంట్ NPCI కి LINK చేయటమంటే ఇదేదో కొత్తగా శ్రమ తీసుకొని చేయవలసిన పని ఏమి కాదు. బ్యాంకు అకౌంట్ ఆధార్ తో లింక్ చేయబడి ఉండటమే .  ఆధార్ తో లింక్ చేయబడిన ప్రతి ఒక్కరి ఒక అకౌంట్ ఇప్పటికే మన ప్రమేయం లేకుండానే NPCI కి LINK చేయబడే ఉంటుంది. ఇక్కడ ఒక అకౌంట్ అనేది గమనించాల్సిన విషయం. ఒక వ్యక్తికీ మూడు లేదా నాలుగు బ్యాంకు అకౌంట్ లు ఉంటే వాటిలో ఒక బ్యాంకు అకౌంట్ మాత్రమే NPCI కి లింక్ అయి ఉంటుంది. మనకు ఉన్న బ్యాంకు అకౌంట్ లలో ఏది NPCI కి లింక్ అయి ఉంది అనే విషయం మనకు తెలిసి ఉండాలి. ఎలా తెలుసుకోవాలి అనేది క్రింద వివరించటం జరిగింది.

మనకు ఉన్న బ్యాంకు అకౌంట్ లలో ఏ అకౌంట్ NPCI కి లింక్ అయి ఉంది, దానినే స్కూల్ లో ఇచ్చామా లేక వేరేది ఇచ్చామా అనేది సరి చూసుకోవాలి. రెండు ఒకటే అయితే సరే అమ్మఒడి డబ్బులు వస్తాయి. రెండు వేరు వేరుగా ఉన్నాయి అంటే అమ్మఒడి డబ్బులు రావు, రెండు ఒకటే ఉండేలా అటు బ్యాంకు లో అయినా లేదా ఇటు స్కూల్ లో అయినా మార్చుకోవాలి.

ఒక PARENT ఒక బ్యాంకు లో మాత్రమే అకౌంట్ ఉంది అనుకుందాం, ఒక అకౌంట్ మాత్రమే ఉంది అది ఆధార్ లో లింక్ అయి ఉంది కాబట్టి NPCI కి కూడా లింక్ చేయబడి ఉంటుంది , దానినే స్కూల్ లో ఇచ్చి ఉంటారు , దానిలోనే అమ్మఒడి డబ్బులు పడతాయి . ఇక్కడ ఏ సమస్యా రాదు.

మరొక PARENT కి మూడు బ్యాంకులలో అకౌంట్ లు ఉన్నాయి అనుకుందాం. ఉదాహరణకు 1.UNION BANK, 2.SBI, 3.BANK OF INDIA అనుకుందాం. వీటిలో ఏది NPCI కి  లింక్ అయి ఉందో అని CHECK చేస్తే SBI చూపిస్తుంది అనుకుందాం, కానీ స్కూల్ లో BANK OF INDIA ఇచ్చారు అనుకుందాం. ఇక్కడ సమస్య వస్తుంది. BANK OF INDIA లో డబ్బులు పడవు, SBI లో మాత్రమే పడతాయి. గత రెండు సంవత్సరాలు BANK OF INDIA లోనే డబ్బులు పడి నప్పటికీ ఈ సంవత్సరం పడవు.

ఇప్పుడు PARENT కి రెండు OPTIONS ఉంటాయి.

మొదటి OPTION , SBI అకౌంట్ వాడుకలో ఉండేలా చూసుకోవాలి ఒకవేళ చాలా రోజులు వాడక INACTIVE లో ఉంటే ACTIVE చేయించాలి  మరియు స్కూల్ లో BANK OF INDIA కి బదులుగా SBI అకౌంట్ వివరాలు ఇచ్చి BANK OF INDIA వివరాలు తీసేసి SBI అకౌంట్ వివరాలు ENROLL చేయమని స్కూల్ వారిని అడగాలి.

రెండవ OPTION , SBI లో పడడానికి వీలులేదు మాకు ఎప్పటి లాగానే  BANK OF INDIA లోనే పడాలి అంటే , BANK OF INDIA బ్యాంకు కు వెళ్లి అకౌంట్ ని  NPCI కి లింక్ చేయమని బ్యాంకు వారిని అడగాలి.

ఇలా NPCI లింక్ అయిన బ్యాంకు అకౌంట్ మాత్రమే స్కూల్ లో ENROLL అయి ఉండేలా చూసుకొనగలరు

Updated PRIMARY, UP and HIGH SCHOOL promotion list software prepared by K.S.NAIDU,vizag

UPDATED FOR Primary 600 STUDENTS High School  1000 STUDENTS PROMOTION LIST ,PROGRESS REPORT 2022 EXCEL SOFTWARE

 ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. మనము  ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ప్రమోషన్ లిస్టు తయారు చేసి ఆఫీస్ కి అందచేయవలసి  ఉంటుంది. దీనికిగాను మనం ఫార్మేటివ్ ,సమ్మేటివ్ పరీక్ష లకు సంబంధించిన మార్కులు మార్కులు ,విద్యార్థుల యొక్క హాజరు, వారి యొక్క హాజరు శాతాన్ని చేయవలసి ఉంటుంది. దీనికి గాను పాఠశాల విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే  మీ పాఠశాల యొక్క మొత్తం  ప్రమోషన్ లిస్టు ఆటోమేటిక్గా అన్ని వివరాలతో గ్రేడ్ తో సహా నింపే విధంగా ఒక సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది. దీంతోపాటుగా విద్యార్థులకు సంవత్సరం చివర ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా అందించడానికి అవసరమైన PROGRESS REPORTS (A4 SHEET లో ఇద్దరికి)  కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలా తయారు చేయడం జరిగింది.

Click here To Download Primary software 

Click Here To Download Up, HS software

సాప్ట్ వేర్ లో ఏ విధంగా నింపాలి అనే దానికి  సంబంధించి ఒక చిన్న వీడియో రూపొందించడం జరిగింది. 

https://youtu.be/IbJ0kUJR7vg

https://youtu.be/SjOC-E0lHc0



Extension of the AP Contractual Employees services up to 31.03.2023 - Orders issued

ఏపి ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల సేవలను పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల.

Click here to download go

Learn a word a day today word for levels

 LEARN A WORD A DAY  (రోజుకో పదం) 16.04.2022 నుండి 30.04.2022 వరకు తేదీ : 21.04.2022

లెవెల్ - 1 (1,2 తరగతులు)

LAP : ఒడి


లెవెల్ - 2 (3,4,5 తరగతులు)

CLOSE : మూసివేయు , దగ్గర

1). CLOSE YOUR BOOKS.

2). THE SHOP IS CLOSED.

3). HE IS MY CLOSE FRIEND.


లెవెల్ - 3 (6,7,8 తరగతులు)

COVER : కప్పించుట

1). I COVER MY HEAD WITH MY CAP.

2). COVER THE BOX WITH A LID.

3). PLEASE COVER THE SWEETS WITH A PAPER.


లెవెల్ - 4 (9,10 తరగతులు)

DEFEAT : ఓడించు

1). INDIA DEFEATED PAKISTAN IN WORLD CUP FINAL.

2). THE ARMY DEFEATED THE REBELS.

3). HAVING DEFEATED IN THE ELECTION HE LEFT THE POLITICS.

F.A - 3 Marks Entry Window enabled

FA3 మార్కులను నమోదు చేయడానికి వెబ్ సైట్ లో ఆప్స్ ను ఎనేబుల్ చేయడం జరిగింది.

in studentinfo.ap.gov.in

Login with DISE Code,

https://studentinfo.ap.gov.in/StudentCCAFA3MarksEntry.do

Select CCE Marks

Select FA-3 

Services Select 

Class and Enter the Marks


Ap polycet entrance exam 2022 notification released

 ఏపీ పాలిసెట్‌

విజయవాడలోని స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్‌(ఎస్‌బీటీఈటీ) - పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(పాలిసెట్‌) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్‌లో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా పలు డిప్లొమా కోర్సుల్లో  ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ/ ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో అడ్మిషన్స్‌ ఇస్తారు. 

అర్హత: పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు, ప్రస్తుతం పరీక్షలు రాసేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: రూ.400

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్‌ 11 నుంచి 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 18

పాలిసెట్‌ 2022 తేదీ: మే 29

వెబ్‌సైట్‌: http://sbtetap.gov.in

NAVODAYA ENTRANCE CLASS 6 HALL TICKETS

నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్ ను విడుదల చేయడం జరిగింది

https://cbseitms.nic.in/AdminCard/AdminCard?AspxAutoDetectCookieSupport=1

Surrender Leave claim process and conditions

Surrender Leave

సంపాదిత సెలవు ను నగదుగా మార్చుకునే క్రమం లో కొన్ని విషయాలు గుర్తు ఉంచుకోవాలి.. ఆ నిబంధనలు పాటించకుండా బిల్ చేస్తే, సంబంధిత డి.డి.ఓ మరియు ఉద్యోగి ఆడిట్ డిపార్ట్మెంట్ వారికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.. డబ్బులు కూడా వెనక్కి కట్టాల్సి ఉంటుంది..సూచనలు, ఆడిట్ డిపార్ట్మెంట్ అభ్యంతరం పై పేజీ లో కలదు



Ded exams 2019-20 batch results released

డీఈడీ ఫలితాలు విడుదల. రాష్ట్రంలో డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) 2019-20 బ్యాచ్ పరీక్ష ఫలితాలను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి గురు వారం విడుదల చేశారు. ఈ పరీక్షలు 2021 జూలై 22 నుంచి 28 వరకు జరిగాయి. పరీక్ష లకు 4,779 మంది హాజరవ్వగా వారిలో 4,693 మంది (98.20%) ఉత్తీర్ణులయ్యారు. వీరి డమ్మీ మార్కుల జాబితాను www.bse.ap.gov.in  పొందుపరిచారు. రీకౌంటింగు ఈ నెల 20వ తేదీలోపు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.

విద్యార్థులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..Jagananna Vasathi Deevena. రేపే వసతి దీవెన డబ్బులు ఖాతాల్లోకి

Jagananna Vasathi Deevena : ఏపీలోన విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

శుక్రవారం (ఏప్రిల్ 8) జగనన్న వసతి దీవెన కింద తదుపరి విడత నిధులను అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.

సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది.

సీఎం జగన్ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.

జగనన్న వసతి దీవెన పథకం కింద ఐటీఐ విద్యార్థులకు ఏడాదికి రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ పీజీ విద్యార్థులకు వసతి, భోజన, రవాణా ఖర్చుల కింద 20వేల రూపాయలు ఇస్తోంది ఏపీ సర్కార్.

శుక్రవారం నంద్యాలలో పర్యటించనున్న సీఎం జగన్.. వసతి దీవెన పథకం కింద నిధులు విడుదల చేయనున్నారు.

Imms app update version released

IMMS App April 6 న 1.3.8 వెర్షన్ కి అప్డేట్ అయ్యింది. అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ ని Instal చేయాల్సి ఉంటుంది. పాత యాప్ పని చేయదు.  కొత్త వెర్షన్ 1.3.8ని క్రింది లింక్ నుండి పొంద వచ్చును.

NEW VERSION FEATURES

1.Egg Receipt and chikki receipt will be accessible 5 days prior to the phase date.

2. New phase has been added in the Dry ration module.

3. MRO and MPDO can perform inspections.

https://play.google.com/store/apps/details?id=com.ap.imms

Current Affairs Telugu and English Medium questions and answers

కరెంట్ అఫైర్స్కు సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ప్రశ్నలు జవాబులు

1. అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవాన్ని ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు?

 జ: ఏప్రిల్ - 2 


2. ఆర్థిక సంక్షోభం కారణంగా ఇటీవల ఏ దేశంలో పబ్లిక్ ఎమర్జెన్సీని ప్రకటించారు?

 జ: శ్రీలంక 


3. భారతదేశంలో ఇటీవల ఏ రాష్ట్రం కూరగాయలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది?

 జ: ఉత్తర ప్రదేశ్ 


4. మతువ ధర్మ మహామేళా ఇటీవల ఎక్కడ నిర్వహించబడుతోంది?

 జ: పశ్చిమ బెంగాల్ 


5. ఇటీవల ఓం అధ్యక్షుడిగా ఎవరు మారారు?

 జ: మహేష్ వర్మ 


6. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నందిని క్షీర సమాధి సహకరి బ్యాంకును స్థాపించింది?

 జ: కర్ణాటక 


7. ఇండియన్ ఆర్మీకి చెందిన ఎయిర్‌బోర్న్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఇటీవల ఎక్కడ వైమానిక విన్యాసాన్ని నిర్వహించాయి?

 జ: రాజస్థాన్ 


8. ఇటీవల FIFA ప్రపంచ కప్ కోసం కొత్త బాల్ విడుదల చేయబడింది, దాని పేరు ఏమిటి?

 జ: అల్ రిహ్లా 


9. FarmEasy ఇటీవల ఎవరిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది?

 జ: అమీర్ ఖాన్ 


10. ఇటీవల ఓం యొక్క కొత్త కమాండెంట్‌గా ఎవరు మారారు?

 జ: అజర్ కొచ్చర్ 


11. ఇటీవల రచించిన 'క్రంచ్ టైమ్ నరేంద్ర మోడీస్ నేషనల్ సెక్యూరిటీస్ క్రైసిస్' పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు?

 జ: డాక్టర్ శ్రీరామ్ చౌలియా 


12. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ యొక్క లోగో, మస్కట్ జెర్సీ మరియు గీతాన్ని ఇటీవల ఎవరు ప్రారంభించారు?

 జ: అనురాగ్ ఠాకూర్ 


13. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్‌గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు?

 జ: డాక్టర్ ఎస్ రాజ్ 


14. ప్రధానమంత్రి మోదీ ఇటీవల ఏ దేశంలో సరిహద్దు రైలు సేవలను మరియు రూపే చెల్లింపు వ్యవస్థను ప్రారంభించారు?

 జ: నేపాల్ 


15. ఇటీవల ఏ దేశ క్రికెటర్ పీటర్ నెవిల్ రిటైర్మెంట్ ప్రకటించాడు?

 జ: ఆస్ట్రేలియా


1. When has International Children's Book Day been celebrated recently?

Ans: April - 2


2. Recently in which country a public emergency has been declared due to economic crisis?

Ans: Sri Lanka


3. Which state has become the largest producer of vegetables in India recently?

Ans: Uttar Pradesh


4. Where is Matua Dharma Mahamela being organized recently?

Ans: West Bengal


5. Who has become the President of Om recently?

Ans: Mahesh Verma


6. Which state government has recently established Nandini Ksheera Samadhi Sahakari Bank?

Ans: Karnataka


7. Where was the air exercise conducted by the Airborne Rapid Response Teams of the Indian Army recently?

Ans: Rajasthan


8. Recently a new ball has been released for the FIFA World Cup, what is it named?

Ans: Al Rihla


9. Who has recently been appointed as its brand ambassador by FarmEasy?

Ans: Aamir Khan


10. Who has become the new commandant of Om recently?

Ans: Ajar Kochhar


11. Who has recently released the book 'Crunch Time Narendra Modi's National Securities Crisis' written by?

Ans: Dr. Shriram Chowlia


12. Who has recently launched the logo, mascot jersey and anthem of Khelo India University Games?

Ans: Anurag Thakur


13. Who has recently taken over as the Director General of the Geological Survey of India?

Ans: Dr S Raj


14. In which country has Prime Minister Modi recently inaugurated cross-border train services and RuPay payment system?

Ans: Nepal


15. Which country's cricketer Peter Neville has announced his retirement recently?

Ans: Australia‌‌

గత్యంతరం లేకే ఉద్యోగులతో బేరాలు : మంత్రి పేర్ని నాని

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి బాగా లేదని మంత్రి పేర్ని నాని మరోసారి స్పష్టం చేశారు.

 కొవిడ్‌ కారణంగా రాష్ట్ర తలసరి ఆదాయం దారుణంగా పడిపోయిందని పేర్కొన్నారు.

అయినప్పటికీ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని అన్నారు.

ఉద్యోగులకు పీఆర్సీ పెంపుదల విషయంలో గత్యంతరం లేకే ఉద్యోగులతో బేరాలు ఆడాల్సి వచ్చిందని వివరించారు.

పన్నుల వసూళ్లలో వాణిజ్య పన్నుల శాఖను చూసి ఐక్యంగా ఉండడం నేర్చుకోవాలని ఇతర శాఖలకు సూచించారు.

వైసీపీ అధికారంలోకి రావడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, వారి మేలుకోసం అనేక రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తుందని వెల్లడించారు.

ఉద్యోగులపై ప్రేమ లేకపోతే ఐఆర్‌ 27 శాతం ఎందుకు పెంచుతామని అన్నారు.

పీఆర్సీ బాలేదని కొందరు అంటున్నారు.

 అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితే బాగాలేదని పేర్కొన్నారు. 

Enter Data and Download PAY SLIP or SALARY CERTIFICATE

 క్రింది ఫైల్ లో మీ బేసిక్ పే  మీ యొక్క వివరాలను నమోదు చేసి మీ శాలరీ సర్టిఫికెట్ లేదా పేస్లిప్ ను A4 లో డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు .మీశాలరీ సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్ ని క్లిక్ చేయండి.

Click Here To Download PAY SLIP or SALARY CERTIFICATE

employees Service matters Doughts and answers

ఉద్యోగుల సర్వీస్ అంశాలలో సందేహాలు - సమాధానాలు

1. సందేహం:

ఒక ఉపాధ్యాయుడు ప్రమోషన్ ఎన్నిసార్లు తిరస్కరించడానికి అవకాశం ఉంది?

సమాధానం:

వాస్తవంగా ప్రమోషన్ ఒక్కసారి కూడా రాత పూర్వకంగా తిరస్కరించడానికి వీలులేదు. అయితే ప్రభుత్వ  cir.Memo.No.10445/ ser-D/2011,GAD తేది:1-6-2011 ప్రకారం ఒక్కసారి మాత్రం ప్రమోషన్ ఆర్డర్ తీసుకుని (లేదా)తీసుకోకుండా ప్రమోషన్ పొస్ట్ లో చేరకుండా చేయవచ్చును. అటువంటి వారి పేర్లు మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తరువాత ఇక చేర్చరు.

(G.O.Ms.No.145 GAD,Dt:15-6-2004)

2. సందేహం:

దాదాపు 6సం!! కాలం SGT గా పనిచేసి ప్రభుత్వంలోని వేరే శాఖకు ఎంపికై అక్కడ కూడా 2సం!! పనిచేసి తిరిగి పాత పోస్టులో చేరిన ఉపాధ్యాయుని 2సం!! సర్వీసును ఏ విధంగా లెక్కిస్తారు? ఇంక్రిమెంట్ ను AAS కి లెక్కిస్తారా?

సమాధానం:

FR-26(i) ప్రకారం ప్రస్తుత పోస్టుపై 'Lien' కలిగియున్న ఉపాధ్యాయుడు, ప్రస్తుత పోస్టుకంటే తక్కువగాగాని పోస్టులో పనిచేసిన సర్వీసును ఇంక్రిమెంట్ కు లెక్కిన్చవచును. G.O.Ms.No.117,F&P, Dt:20-5-1981 ప్రకారం ఇంక్రిమెంట్ కు పరిగణింపబడే సర్వీసు అంతా AAS కు కూడా లెక్కించబడుతుంది. కాబట్టి సదరు 2సం!! ఇతర పోస్టు సర్వీసు AAS నకు కూడా లెక్కించబడుతుంది.

3.సందేహం:

ఒక ఉపాధ్యాయుడు డిసెంబర్ 15 నుండి 19 వరకు వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు వినియోగించుకుంటున్నాడు. అయితే 13,14వ తేదీలు రెండవ శనివారం, ఆదివారం ఉన్నాయి. అవి కూడా కమ్యూటెడ్  సెలవుగా పరిగణించాలా?

సమాధానం:

ఆర్ధిక శాఖ Memo.No.86595/1210/FR-1/7 తేది:29-5-1981 మరియు FR-68 ప్రకారం ఏ రకమైన ఆకస్మికేతర సేలవుకైనా ముందు లేదా వెనుక వున్న ప్రభుత్వ సెలవు దినాలు ప్రీఫిక్స్/సఫిక్స్ చేసి వినియోగించుకోవడానికి అనుమతించబడతాయి. అయితే G.O.Ms.No.319 F&P తేది:18-12-1981 ప్రకారం వైద్య కారణాలపై వినియోగించుకున్న సెలవుకు ముందు, వెనుక ఉన్న ప్రభుత్వ  సెలవులను మినహాయించి పనిదినాల కాలానికి మాత్రమే వైద్య ధ్రువపత్రాలు A,B లు వుండాలి.           

4.సందేహం:

మెడికల్ సెలవుకోసం డాక్టరు సర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సర్టిఫికెట్ వేరేవేరే డాక్టర్ల నుండి సమర్పించవచ్చునా?వైద్య కారణాలపై తీసుకున్న EOL ఇంక్రిమెంట్ కోసం లెక్కించబడుతుందా?

సమాధానం:

రెండు సర్టిఫికెట్లు ఒకే డాక్టర్ ఇవ్వాలని ఏ ఉత్తర్వులోనూ లేదు.ఇద్దరూ క్వాలిఫైడ్ వైద్యులైనంత వరకు ఎట్టి అభ్యంతరము ఉండదు.  సాధారణంగా EOL వాడుకుంటే ఇంక్రిమెంట్ అన్ని రోజులు వాయిదా పడుతుంది. అయితే ప్రభుత్వం G.O.Ms.No.43 తేది:5-2-1976 ద్వారా వైద్య కారణాలపై 6 నెలల కాలం వరకు EOL ను ఇంక్రిమెంటుకు పరిగణించే అధికారం శాఖాధిపతులకు (ఉపాధ్యాయుల విషయంలో పాఠశాల విద్యా సంచాలకులకు) ఇవ్వడం జరిగింది.             

5.సందేహం:

ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా?

సమాధానం:

అవును G.O.Ms.No.802 M&H Dated:21-4-1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి

అన్నామలై వర్సిటీలో చేరొద్దు. దానికి ఎలాంటి అనుమతుల్లేవు: యూజీసీ

 తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీలో డిస్టెన్స్‌(దూర) విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఆ వర్సిటీలో చేరవద్దని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) హెచ్చరించింది. దూర విద్యకు సంబంధించి యూజీసీ నుంచి ఈ వర్సిటీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ యూనివర్సిటీ ప్రకటించే వివిధ కోర్సుల్లో విద్యార్థులు చేరవద్దని కోరింది. ‘‘అన్నామలై వర్సిటీ ఓపెన్‌, డిస్టెన్స్‌ విధానంలో విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రకటన జారీ చేసినట్టు తెలిసింది. కానీ, యూజీసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కాబట్టి ఈ వర్సిటీలో ఎవరూ చేరవద్దు’’ అని యూజీసీ సెక్రటరీ రజనీశ్‌ జైన్‌ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

NISHTHA - 3.0 course joining links for Module 1 to 10 New course links

నిష్ట 3.0 లో ఇంకా కోర్సులు కంప్లీట్ చేయని లేదా మధ్యలో కోర్సులు ఆగిపోయిన Primary School Teachers కోసం 1నుండి 10 మాడ్యూల్స్ మరల ఓపెన్ అయ్యాయి. ఇదే చివరి అవకాశం. లింక్ పై క్లిక్ చేసి కోర్స్ లో జాయిన్ అవగలరు.

గతంలో ఈ మాడ్యూల్స్ చేసినవారు మళ్ళీ చేయవలసిన అవసరం లేదు.

పాత లింక్స్ పనిచేయవు, కొత్త 1 to 10 కోర్సెస్  Joining లింక్స్

మాడ్యూల్ - 1

https://diksha.gov.in/explore-course/course/do_31350552951947264011157

మాడ్యూల్ - 2

https://diksha.gov.in/explore-course/course/do_3135055334310625281428

మాడ్యూల్ - 3

https://diksha.gov.in/explore-course/course/do_3135055364775608321446

మాడ్యూల్ - 4

https://diksha.gov.in/explore-course/course/do_31350553861103616011258

మాడ్యూల్ - 5

https://diksha.gov.in/explore-course/course/do_3135055407035023361476

మాడ్యూల్ - 6

https://diksha.gov.in/explore-course/course/do_3135055438732083201503

మాడ్యూల్ - 7

https://diksha.gov.in/explore-course/course/do_31350617491610009611792

మాడ్యూల్ - 8

https://diksha.gov.in/explore-course/course/do_31350617860186931212901

మాడ్యూల్ -9

https://diksha.gov.in/explore-course/course/do_31350618049160806412925

మాడ్యూల్ - 10

https://diksha.gov.in/explore-course/course/do_31350618522125107211885

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజనకు సంబంధించిన ఐదు ఆసక్తికర అంశాలను ఇక్కడ చూద్దాం.

1) అత్యంత చిన్న జిల్లా

2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలు ఉండేవి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలున్నాయి. ఇందులో ప్రకాశం, విజయనగరం తప్ప అన్ని జిల్లాలూ బ్రిటిష్ హయాంలో ఏర్పడ్డవే. పరిపాలనా సౌలభ్యం కోసం గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలతో 1970లో ప్రకాశం జిల్లా ఆవిర్భవించగా, 1979లో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో విజయనగరం జిల్లా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు విజయనగరం అత్యంత చిన్న జిల్లాగా ఉండగా, ఇప్పుడు జిల్లాల విభజనతో ఆ స్థానంలోకి విశాఖపట్నం వచ్చింది.

2) గ్రామీణ ప్రాంతమే లేని జిల్లా

జిల్లాల విభజన తర్వాత- విస్తీర్ణం ప్రకారం చూస్తే 14,322 చ.కి.మీ. విస్తీర్ణంతో ఏపీలో పెద్ద జిల్లాగా ప్రకాశం, 928 చ.కి.మీ. విస్తీర్ణంతో విశాఖపట్నం చిన్న జిల్లాగా అవతరించాయి. జనాభా పరంగా చూస్తే 23.66 లక్షల జనాభాతో కర్నూలు మొదటి స్థానంలో ఉంది.

జిల్లాల విభజన తర్వాత- విశాఖపట్నం జిల్లా జనాభా 18.13 ల‌క్ష‌లు. ఈ జిల్లాలో అసలు గ్రామీణ ప్రాంతమే లేదు. విశాఖపట్నం జిల్లాలోని నగర ప్రాంతాన్ని విశాఖపట్నం జిల్లాగా, గ్రామీణ ప్రాంతాన్ని అనకాపల్లి జిల్లా, ఏజెన్సీ ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా విభజించారు. రాష్ట్రంలో అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లా జనాభా 9.54 లక్షలు.

3) గిరిజన జిల్లాలు ఏవేవి?

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో గిరిజన ప్రాంతాలున్నాయి. గిరిజన సంక్షేమం కోసం ఈ జిల్లాల్లో ఎనిమిది ఐటీడీఏలు (సమీకృత గిరిజన అభివృద్ధి ఏజెన్సీలు) ఉన్నాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనుల కోసం ప్రత్యేకంగా జిల్లాలు లేవు. ఇప్పుడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల పేర్లతో రెండు గిరిజన జిల్లాలు ఏర్పడ్డాయి. వీటిని గిరిజనుల కోసం ఏర్పాటు చేస్తున్న జిల్లాలుగా ప్రభుత్వం చెబుతోంది. ఈ రెండు జిల్లాల్లో అత్యధికులు గిరిజనులే. పార్వతీపురం మన్యం జిల్లా పేరును తొలి నోటిఫికేషన్‌లో మన్యం జిల్లాగా ప్రభుత్వం ప్రకటించగా, దానిపై ఆందోళన జరగడంతో పార్వతీపురం మన్యం జిల్లాగా మార్చింది.

4) సముద్ర తీరం ఉన్న రాయలసీమ జిల్లా ఏది?

జిల్లాల విభజనతో రాయలసీమ ప్రాంత భౌగోళిక స్వరూపంలో ఒక ఆసక్తికర మార్పు వచ్చింది. ఇప్పటివరకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తొమ్మిది జిల్లాలే తీర ప్రాంత జిల్లాలు. వీటినే కోస్తా జిల్లాలంటారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో దేనికీ సముద్రతీరం లేదు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఇప్పుడు ఎనిమిది జిల్లాలవుతున్నాయి. అందులో ఒకటైన తిరుపతి జిల్లాకు ప్రస్తుత నెల్లూరు జిల్లాలోని తీరప్రాంతం కలిగిన సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపారు. దీంతో తిరుపతి జిల్లా పరిధిలోకి సముద్ర తీరం వచ్చింది. సూళ్లూరుపేట తో పాటుగా సముద్రతీరంలో ఉన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా తిరుపతి జిల్లాలో కలుస్తోంది.

5) వ్యక్తుల పేర్లతో ఉన్న జిల్లాలెన్ని?

ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ప్రకాశం, పొట్టి శ్రీరాములు, వైఎస్సార్ జిల్లాలు వ్యక్తుల పేర్లతో ఉన్నాయి. ఇప్పుడు జిల్లాల విభజనలో- స్థానికంగా వచ్చిన డిమాండ్లతో వ్యక్తుల పేర్లతో మరికొన్ని జిల్లాలు వచ్చాయి.

రాష్ట్రంలో వ్యక్తుల పేరుతో ఏర్పడిన మొదటి జిల్లా ప్రకాశం. స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశంపంతులు సేవలను గుర్తిస్తూ 1972లో ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు పేరును 2008లో నెల్లూరు జిల్లాకు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును 2010లో కడప జిల్లాకు పెట్టారు.

తూర్పు కనుమల్లోని గిరిజనులకు అండగా నిలిచి...బ్రిటిషు వారిని ఎదిరించి మన్యం వీరుడిగా పేరు పొందిన అల్లూరి సీతారామరాజు పేరును ఎప్పటీ నుంచో విశాఖ జిల్లాకు పెట్టాలనే డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు విశాఖ మూడు జిల్లాలుగా విడిపోయింది. అందులో గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన జిల్లాను పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పేరిట ఏర్పాటు చేశారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) పేరు విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన జిల్లాకు పెట్టారు.

ప్రఖ్యాత వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య పేరుతో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటయ్యాయి.

మొత్తమ్మీద 26 జిల్లాలకుగాను ఏడు జిల్లాలకు వ్యక్తుల పేర్లు ఉన్నాయి.

కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం 2022 జనవరి 26న నోటిఫికేషన్ ఇచ్చింది. జిల్లాల పేర్లు, సరిహద్దులపై సలహాలు, అభ్యంతరాలు ఉంటే నెల రోజుల వ్యవధిలో తెలిపాలని సూచించింది. నెల రోజుల్లో 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు తెలిపారు.

వాటికి అనుగుణంగా మార్పులు, చేర్పుల విషయంలో ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి కలెక్టర్లు సమాచారం సేకరించారు. ప్రజల నుంచి వచ్చిన సలహాలు, అభ్యంతరాల మేరకు మన్యం జిల్లా పేరును పార్వతీపురం మన్యం అని, శ్రీ బాలాజీ జిల్లాను తిరుపతి జిల్లాగా మార్చారు. మిగతాదంతా దాదాపు తొలి నోటిఫికేషన్‌లో ఉన్నదే.

Ap reorganization 26 districts Final gazette notifications in one file

 ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ.26 జిల్లాల గెజెట్ నోటిఫికేషన్ లు ఓకే పైల్ లో అందుబాటులో కలవు. 

Click here for 23 disticts gezzette


DIKSHA APP UPDATED VERSION IS AVAILABLE NOW.UPDATED VERSION : 4.7.980 UPDATED ON : 01-04-2022

దీక్ష యాప్ ను వెర్షన్ 4.7.980 తేది 1-4-2022నాడు అప్డేట్ చేయడం జరిగింది. క్రింది లింక్ ద్వారా యాప్ ను అప్డేట్ చేసుకోగలరు. 

https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app

WHAT'S NEW

1. Now you can play video content in content details page itself

2. Now Schools heads & officials can

See explicit Start & Submit improvement button on the project page

See task wise progress on the project progress bar

Not edit the project once project is submitted  View their task remarks in files option of theproject page

 Edit the status & end date of a Mandatory task

a. Now access projects via scanning QR code of the project

Andhrapradesh New Districts and Revenue Divisions and New IAS AND IPS

 ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తయిన రోజే కొత్త జిల్లాల కు కలెక్టర్లనూ నియమించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు శనివారం నాడు ప్రక్రియ పూర్తైంది, 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో ఫైనల్‌ గెజిట్‌ విడుదల 

జిల్లాల వారీగా కలెక్టర్లు వీరే..

శ్రీకాకుళం: శ్రీకేశ్‌ బాలాజీరావు

విజయనగరం: సూర్యకుమారి

మన్యం: నిశాంత్ కుమార్‌

విశాఖపట్నం: మల్లికార్జున

అల్లూరి సీతారామరాజు: సుమిత్‌ కుమార్‌

అనకాపల్లి: రవి సుభాష్‌

కాకినాడ: కృతికా శుక్లా

తూర్పు గోదావరి: మాధవీలత

కోనసీమ: హిమాన్షు శుక్లా

పశ్చిమ గోదావరి: పి.ప్రశాంతి

ఏలూరు: ప్రసన్న వెంకటేష్

కృష్ణా: రంజిత్‌ బాషా

ఎన్టీఆర్‌: ఎస్‌.దిల్లీరావు

గుంటూరు: వేణుగోపాల్‌రెడ్డి

పల్నాడు: శివ శంకర్‌

బాపట్ల: విజయ

ప్రకాశం: దినేష్ కుమార్


రాష్ట్రంలో 26 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు

విశాఖ కమిషనర్‌గా సీహెచ్‌. శ్రీకాంత్ నియామకం

శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా జి.ఆర్‌.రాధిక నియామకం

విజయనగరం జిల్లా ఎస్పీగా ఎం.దీపిక కొనసాగింపు

పార్వతీపురం ఎస్పీగా వాసన విద్య సాగర్‌ నాయుడు నియామకం

అనకాపల్లి ఎస్పీగా గౌతమి సాలి నియామకం

అల్లూరి సీతారామరాజు ఎస్పీగా సతీశ్‌కుమార్ నియామకం

కాకినాడ ఎస్పీగా రవీంద్రనాథ్‌బాబు నియామకం

కోనసీమ జిల్లా ఎస్పీగా కె.ఎస్‌.ఎస్‌.వి. సుబ్బారెడ్డి నియామకం

తూ.గో. జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి నియామకం

ప.గో. జిల్లాగా ఎస్పీగా రవిప్రకాశ్‌ నియామకం

ఏలూరు జిల్లా ఎస్పీగా ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి నియామకం

కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ కొనసాగింపు

విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా టాటా కొనసాగింపు

గుంటూరు ఆర్బన్‌ ఎస్పీగా కె.ఆరీఫ్‌ హాఫీజ్‌ కొనసాగింపు


కొత్త జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు..

1. శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం

2. విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం

3. ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ

4. అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం

5. విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం

6. అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం,

7. కాకినాడ : పెద్దాపురం, కాకినాడ

8. కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)

9. తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు

10. పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త)

11. ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు

12. కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)

13. ఎన్టీఆర్‌ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)

14. గుంటూరు : గుంటూరు, తెనాలి

15. బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)

16. పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)

(కొత్త

18. నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు

19. కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)

20. నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్‌ (కొత్త), నంద్యాల

21. అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్‌ (కొత్త)

22. శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)

23. వైఎస్సార్‌ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు

24. అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)

25. చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)

26. తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి.

కొత్త జిల్లాలు, మండలాల సంఖ్య..

– శ్రీకాకుళం జిల్లా.. 30 మండలాలు

– విజయనగరం జిల్లా.. 27 మండలాలు

– పార్వతీపురం మన్యం జిల్లా.. 15 మండలాలు

– అల్లూరి సీతారామరాజు జిల్లా.. 22 మండలాలు

– విశాఖపట్నం జిల్లా.. 11 మండలాలు

– అనకాపల్లి జిల్లా.. 24 మండలాలు

– కాకినాడ జిల్లా.. 21 మండలాలు

– కోనసీమ జిల్లా.. 22 మండలాలు

– తూర్పుగోదావరి జిల్లా.. 19 మండలాలు

– పశ్చిమగోదావరి జిల్లా.. 19 మండలాలు

– ఏలూరు జిల్లా.. 28 మండలాలు

– కృష్ణా జిల్లా.. 25 మండలాలు

– ఎన్టీఆర్ జిల్లా.. 20 మండలాలు

– గుంటూరు జిల్లా.. 18 మండలాలు

– బాపట్ల జిల్లా.. 25 మండలాలు

– పల్నాడు జిల్లా.. 28 మండలాలు

– ప్రకాశం జిల్లా.. 38 మండలాలు

– నెల్లూరు జిల్లా.. 38 మండలాలు

– కర్నూలు జిల్లా.. 26 మండలాలు

– నంద్యాల జిల్లా.. 29 మండలాలు

– అనంతపురం జిల్లా.. 31 మండలాలు

– శ్రీ సత్యసాయి జిల్లా.. 32 మండలాలు

– వైఎస్సార్ కడప జిల్లా.. 36 మండలాలు

– అన్నమ్మయ్య జిల్లా.. 30 మండలాలు

– చిత్తూరు జిల్లా.. 31 మండలాలు

– తిరుపతి జిల్లా.. 34 మండలాలు

AP Newly sanctioned government degree colleges list


ఏపీ లో కొత్తగా ఏర్పాటు చేయబోయే డిగ్రీ కాలేజీల యొక్క లిస్టు ఇవ్వడం జరిగింది.

Single session Time Table

AP లో ఒంటిపూట బడులు యొక్క టైం టేబుల్

Period Time


1st bell: 7.30 AM


Prayer: 7.30 AM – 7.45 AM


1st Period: 7.45 AM – 8.30 AM

2nd Period: 8.30 AM – 9.10 AM

3rd Period: 9.10 AM – 09.40 AM


Meals (Interval) 9.40 AM – 09.55 AM


4th period : 09.50 AM – 10.30 AM

5th Period: 10.30 AM – 11.00 AM

6th Period: 11.00 AM – 11.30 AM

LATEST POSTS

Vidya pravesh day 68 activities for 1st class

 విద్యాప్రవేశ్ -68 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు Language & Literacy కథా కార్డులను పిల్లలకు ఇచ్చి వారికి అందులో తెలిసిన వస్తువుల ...