ఇప్పటి వరకు మనం సహాయక క్రియలతో (Helping Verbs) మరియు ప్రశ్నా పదముతో (Question Word) ప్రశ్నలు ఎలా నిర్మించాలో నేర్చుకున్నాం.
అయితే సహాయక క్రియలతో, ప్రశ్నా పదముతో అడిగే ప్రశ్నలకు సమాధానాలుచెప్పే విధానం వేరుగా ఉంటుంది. అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ప్రశ్న: మీరు అన్నం తింటారా?
Do you eat food?
( తినడం ఇష్టం అయితే )
సమాధానం: అవును, నేను అన్నం తింటాను.
Yes, I eat food అని
( తినడం ఇష్టం లేకుంటే )
సమాధానం: లేదు, నేను అన్నం తినను.
No, I do not eat food అని సమాధానం చెప్పాలి.
మీరు అన్నం తింటారా? (Do you eat food?) అనేది సహాయక క్రియతో (Helping Verb) కూడిన ప్రశ్న కాబట్టి అవును (Yes), లేదు (No) అనే సమాధానాలు చెప్పాలి.
మీరు ఏం తింటారు?
What do you eat?
నేను అన్నం తింటాను.
I eat food.
మీరు ఏం తింటారు? (What do you eat?) అనేది ప్రశ్నా పదముతో (Question Word) కూడిన ప్రశ్న కాబట్టి సమాధానం చెబితే సరిపోతుంది. సహాయక క్రియ ప్రశ్న (Helping Verb Question) లాగా అవును (Yes), లేదు (No) సమాధానాలు చెప్పవద్దు.
ప్రశ్న: మీరు ఏం తింటారు?
మీరు ఏమిటి తినడం చేస్తారు?
You what eat do
Q: What do you eat?
సమాధానం: నేను అన్నం తింటాను.
I food eat
Ans: I eat food.
ప్రశ్న: మీరు అన్నం తినరా?
Q: Do not you eat food?
( తినడం ఇష్టం లేకుంటే )
సమాధానం: లేదు, నేను అన్నం తినను.
Ans: No, I do not eat food అని సమాధానం చెప్పాలి.
( తినడం ఇష్టం అయితే )
సమాధానం: అవును, నేను అన్నం తింటాను.
Ans: Yes, I eat food అని సమాధానం చెప్పాలి.
ప్రశ్న: మీరు ఏం తినరు?
మీరు ఏమిటి తినడం చేయరు?
You what eat do not
Q: What do not you eat?
సమాధానం: నేను అన్నం తినను.
నేను అన్నం తినడం చేయను
I food eat do not
Ans: I do not eat food.
1. మీరు బడికి వెళతారా? మీరు బడికి వెళ్ళడం చేస్తారా?
You to school go do
Do you go to School?
Ans: అవును, నేను బడికి వెళతాను.
Yes, I go to school
2. మీరు బడికి వెలుతున్నారా?
మీరు బడికి వెళుతూ ఉన్నారా?
You to school going are
Are you going to school?
Ans: అవును, నేను బడికి వెళుతున్నాను
Yes, I am going to school
3. మీరు బడికి వెళ్ళారా?
మీరు బడికి వెళ్ళి ఉన్నారా?
You to school gone have
Have you gone to school?
Ans: అవును, నేను బడికి వెళ్లాను
Yes, I have gone to school
4. మీరు బడికి వెళ్ళరా?
మీరు బడికి వెళ్ళడం చేయరా?
You to school go do not
Do not you go to school?
Ans: లేదు, నేను బడికి వెళ్ళను
No, I do not go to school
5. మీరు బడికి వెళతలేరా?
మీరు బడికి వెళుతూ లేరా?
You to school going are not
Are not you going to school?
Ans: లేదు, నేను బడికి వేళతలేను
No, I am not going to school
6. మీరు బడికి వెళ్ళలేదా?
మీరు బడికి వెళ్ళి లేరా?
You to school gone have not
Have not you gone to school?
Ans: లేదు, నేను బడికి వెళ్ళలేదు
No, I have not gone to school
7. మీరు ఎక్కడ వెళతారు?
మీరు ఎక్కడ వెళ్ళడం చేస్తారు?
You where go do
Where do you go?
Ans: నేను బడికి వెళతాను
I go to school
8. మీరు ఎక్కడ వెళుతున్నారు?
మీరు ఎక్కడ వెళుతూ ఉన్నారు? You where going are
Where are you going?
Ans: నేను బడికి వెళుతున్నాను
I am going to school
9. మీరు ఎక్కడ వెళ్ళారు?
మీరు ఎక్కడ వెళ్ళి ఉన్నారు? You where gone have
Where have you gone?
Ans: నేను బడికి వెళ్లాను
I have gone to school
10.మీరు ఎక్కడ వెళ్లరు?
మీరు ఎక్కడ వెళ్ళడం చేయరు?
You where go do not
Where do not you go?
Ans: నేను బడికి వెళ్ళను
I do not go to school
11. మీరు ఎక్కడ వెళతలేరు?
మీరు ఎక్కడ వెళుతూ లేరు?
You where going are not
Where are not you going?
Ans: నేను బడికి వేళతలేను
I am not going to school
12. మీరు ఎక్కడ వెళ్ళలేదు?
మీరు ఎక్కడ వెళ్ళి లేరు?
You where gone have not
Where have not you gone?
Ans: నేను బడికి వెళ్ళలేదు
I have not gone to school
పై వాక్యాలని ఆధారముగా చేసుకొని సందర్భాన్ని బట్టి ప్రశ్న తయారు చేసేటప్పుడు, ప్రశ్నా పదం (Question Word), కర్త (Subject), క్రియ (Verb) లను మార్చితే చాలు, చాలా రకాల ప్రశ్నలు తయారు చేయవచ్చు.
జవాబులను తయారు చేసేటప్పుడు, కర్త (Subject), సహాయక క్రియ (Helping Verb), కర్మ (Object) లని మార్చితే చాలు, అనేక రకాల జవాబులు తయారు చేయవచ్చు.
చాలా సులభముగా ఆంగ్లములో మాట్లాడవచ్చు.