విద్యాప్రవేశ్ -58 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
తెలుగు తోట -1 పాఠ్యపుస్తకం 17వ పేజీలో.ప, మ అక్షర పరిచయ చిత్రాలను చూపించి మాట్లాడించాలి .
cognitive Development
పిల్లలను పెద్ద సమూహంలో గుండ్రంగా కూర్చోబెట్టాలి . టీచర్ బోర్డు మీద వివిధ ఆకారాలను గీసి ఎన్ని మూలలు ఉన్నాయో లెక్కించి చూపెట్టాలి. పిల్లలందరితో ఒక్కొక్క ఆకారాన్ని నేల మీద లేదా పలక మీద లేదా బోర్డు మీద గీయిస్తూ మూలలను లెక్కిస్తూ చూపించాలి. లేదా తరగతి గదిని గాని ఏదైనా వస్తువును గాని చూపిస్తూ వాటి మూలలను గుర్తించి లెక్కించాలి. ఉదాహరణకు పలక, పుస్తకం,తరగతి గది.
Physical Development
టీచర్ రెడ్,గ్రీన్ చార్ట్ ముక్కలు ఉపయోగించి రోడ్డుమీద ట్రాఫిక్ రూల్స్ వివరించాలి. పిల్లలను గ్రౌండ్లో నడిపిస్తూ రెడ్ కార్డు చూపిస్తే ఆగమని, గ్రీన్ కార్డు చూపిస్తే నడవమని చెప్పాలి .