మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

Vidya pravesh day 15 activities for primary

 విద్యాప్రవేశ్ 15వ రోజు 01/07/2024 నాడు 1వ తరగతి విద్యార్థులకు కృత్యాలు


 Language & Literacy Development


కాకి- కడవ కథను demonstrate చేస్తూ చెప్పాలి. ఒక ట్రాన్స్పరెంట్ గ్లాసులో కొద్దిగా నీళ్ళు తీసుకొని రాళ్ళు వేస్తూ చెప్పాలి. రాళ్ళు వేసే టప్పుడు లెక్క పెడుతూ వేస్తూ ఉండాలి. నీరు కొద్దిగా పైకి వచ్చాక పిల్లలు గుర్తించారో లేదో ప్రశ్నించాలి. ఇలా కథను చెప్పాలి.


Cognitive Development


దీర్ఘ చతురస్రం, చతురస్రం ఆకారాలు గల బొమ్మలను వేరు వేరు రంగులతో నింపించండి.



Physical Development


తొక్కుడు బిళ్ళ లేదా కుంటుళ్ళ ఆట ఆడించాలి.

Ap tet website

ఏపీ టెట్ నోటిఫికేషన్ ను జులై 1వ తేదీన విడుదల చెయ్యడానికి వెబ్సైటు సిద్దం చేసిన విద్యాశాఖ


https://aptet.apcfss.in/

AP EAPCET 2024 Admissions (MPC Stream) Notification Released for Certificate Verification, Web Counselling

ఏపీ ఇంజనీరింగ్‌ (బి.ఈ/బీటెక్) ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.

 ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: జులై 01 నుంచి జులై 7 వరకు.

ధ్రువపత్రాల పరిశీలన: జులై 04 నుంచి జులై 10 వరకు. 

Click Here to Download shedule

కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాల నమోదు: జులై 08 నుంచి జులై 12 వరకు.

ఐచ్ఛికాల మార్పు: జులై  13

 సీట్ల కేటాయింపు: జులై  16

 కళాశాలల్లో రిపోర్టింగ్: జులై 17 నుంచి జులై 22 వరకు.

 తరగతులు ప్రారంభం: జులై 19 నుంచి

 https://eapcet-sche.aptonline.in/EAPCET/


Vidya pravesh day 14 activities for primary

విద్యాప్రవేశ్  14 వ రోజు 29/06/2024 న  1వ తరగతికి నిర్వహించవలసిన కృత్యాలు


Language & Literacy Development


పిల్లలతో మనము జ్ఞానేంద్రియాలు గురించి మాట్లాడించాలి. వాటితో మనము ఏ ఏ పనులు చేస్తామో తెలియజేయాలి


Cognitive Development


 పెద్ద డబ్బా ఆకారంలో వస్తువులను గీయించాలి. దీర్ఘ చతురస్రం మొదలైన వాటి పేర్లను చెప్పించాలి.వాటి ఆకారాలను పుస్తకంపై లేదా బోర్డుపై రాయించాలి.


Physical Development


కుర్చీల కింద నుంచి పాకే ఆటను ఆడించాలి. కుర్చీలకు తగలకుండా ఆడేలా చప్పట్లతో ప్రోత్సహించాలి

Vidya pravesh day 13 activities for primary

 విద్యాప్రవేశ్ 13 వ రోజు  28/06/2024 నాడు 1వ తరగతి విద్యార్థులతో చేయించవలసిన  కృత్యాలు


Language & Literacy Development


టీచర్ "This is my...." అంటూ వివిధ శరీర భాగాలను ఇంగ్లీషులో పరిచయం చేసి పిల్లలతో చెప్పించాలి.


Cognitive Development

చిన్న డబ్బా ఆకారంలో ఉన్న వస్తువులను గుర్తించండి చతురస్రం వాటి పేర్లను చెప్పించాలి. ఆకారాన్ని పుస్తకంలో గీయించాలి.


Physical Development

తలపై పుస్తకాలు లేదా గ్లాసు లేదా డస్టర్ పెట్టి పడకుండా కొంత దూరం నడిపించుట.

NOTIFICATION NO.14/2023, DATED: 22/12/2023 DIRECT RECRUITMENT TO THE POST OF DEPUTY EDUCATIONAL OFFICER IN A.P. EDUCATIONAL SERVICE (GENERAL RECRUITMENT) LIST OF CANDIDATES PROVISIONALLY QUALIFIED FOR MAINS EXAMINATION . THE SCREENING TEST WAS HELD ON 25.05.2024 FN

ఇటీవల నిర్వహించిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ స్చ్రీనింగ్ టెస్టు ఫలితాలు విడుదల చేసిన APPSC

AP Edcet 2024 Results released

AP Edcet 2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల. ఈ క్రింది లింక్ లో మీ ఫలితాలను చెక్ చేసుకోండి. ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి

https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_GetResult.aspx

AP SSC Advanced supplimentary may 24 exams results released

పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేయడం జరిగింది. హాల్ టికెట్ నెంబర్ తో ఫలితాలను తెలుసుకోవచ్చు.


వ్యక్తిగత ఫలితాల లింక్: 

https://bse.ap.gov.in/aseresults/


పాఠశాల వారీగా ఫలితాలు లింక్:

https://bse.ap.gov.in/sscadmregthr/Account/Login.aspx


#APSSC

School Infrastructure Improvement ( SII) App latest version 3.1.1

SII  School Infrastructure Improvement యాప్ లేటెస్ట్ వెర్షన్  3.1.1 కు అప్డేట్ అయ్యింది. School Infrastructure Improvement  యాప్ లేటెస్ట్ వెర్షన్  3.1.1 ను క్రింది సైట్ నుండి ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

Click Here to Download APP

𝐀𝐏 𝐓𝐄𝐓 𝐑𝐄𝐒𝐔𝐋𝐓 2024 RANK CARD 𝐑𝐄𝐋𝐄𝐀𝐒𝐄𝐃

ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫిబ్రవరి 2024 ఫలితాలు వెబ్సైట్లో అందుబాటులో కలవు.

సబ్జెక్టుల వారీగా పేపర్ 1 మరియు పేపర్ 2 ఫలితాలు విడుదల

 𝐑𝐄𝐒𝐔𝐋𝐓𝐒 𝐃𝐈𝐑𝐄𝐂𝐓 𝐋𝐈𝐍𝐊 𝐀𝐕𝐀𝐈𝐋𝐀𝐁𝐋𝐄 


https://aptet.apcfss.in/CandidateLogin.do

LIST OF HOLIDAYS JULY 2024 for all govt sector


As per G.O RT No.2318 dated 30-11-2023 of Govt of AP.


1️⃣ 07-07-2024 -ఆదివారం

2️⃣ 13-07-2024 - రెండవ శనివారం

3️⃣ 14-07-2024- ఆదివారం

4️⃣ 17-07-2024-మొహరం 

5️⃣ 21-07-2024-ఆదివారం

6️⃣ 28-07-2024 - ఆదివారం


Optional Holidays

18-07-2024- 9th Moharram


TOTAL: 31

No. of Holidays: 06

Working Days: 25

Cabinet key decissions

మంత్రి మండలి సమావేశం నిర్ణయాలు, 24-6-2024.

అమరావతి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి  సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు..


 అన్ని వర్గాలకు భరోసా కల్పించే విధంగా మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కె.పార్థసారధి మీడియాకు వివరించారు.


1. మెగా డీఎస్సీ :


మెగా డీఎస్సీ 2024 ద్వారా భర్తీ చేయనున్న 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 

ఇందులో భాగంగా ఎస్జీటీలు - 6,371, పీఈటీలు- 132, స్కూల్ అసిస్టెంట్ లు- 7,725, టీజీటీలు - 1781, పీజీటీలు - 286, ప్రిన్సిపాల్ లు - 52  పోస్టులను భర్తీ చేయనున్నారు. 

గత ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ మాత్రమే ఇవ్వగా మన ప్రభుత్వం ఏకంగా 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది. ముఖ్యమంత్రి వర్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ పై చేయడం, తదనంతరం మంత్రి మండలిలో ఆమోదింప చేయడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి తార్కాణం. 

డీఎస్సీ నిర్వహణ ఇకపై నిరంతర ప్రక్రియగా ఉంటుందని మంత్రి మండలి నిర్ణయించింది. అంటే ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించబడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ ద్వారా తెలిపారు. గత ప్రభుత్వం టెట్ పరీక్షను ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఇకపై టెట్ (టీచర్ ఎలిజబులిటీ టెస్ట్) పరీక్షను కూడా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. 

నాణ్యత గల విద్యను అందించడమే లక్ష్యంగా టీచర్లకు నియామకం కంటే  ముందే శిక్షణ ఇవ్వాలి. ఈ శిక్షణ డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత శాఖాధికారులకు సూచించారు. ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యమైన విద్యాబోధనకు అవసరమైన విధివిధానాలను నిర్ణయించేందుకు ప్రస్తుత విద్యావిధానంతో పాటు జాతీయ విద్యా విధానాన్ని కూడా  అధ్యయనం చేయాల్సిన అవసరముందని ఆ దిశగా అధికారులు సమాయత్తం అవ్వాలని ఆదేశించారు.


2. ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్) 2022 రద్దు

 

ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం 2022 (యాక్టు సంఖ్య 27 ఆఫ్ 2023) రద్దు చేసే ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

గత ప్రభుత్వం అమలుచేయ తలపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలను భయాందోళనకు గురిచేసిన విషయం మీకందరికి తెలిసిందే. 

గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చే క్రమంలో ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకొచ్చినట్లు గుర్తించాం. సరైన అవగాహన లేని టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అనవసరమైన సమస్యలు సృష్టిస్తారని మేం గ్రహించాం.

నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి, గత ప్రభుత్వం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుద్యం ఉంది. కొన్ని వివాదాస్పద నిర్ణయాల వల్ల ఈ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించాం.

ఈ యాక్ట్ ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తర్వాత మధ్యంతర, జిల్లా, న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా నేరుగా పరిష్కారానికి కక్షిదారులు హైకోర్టుకు ఆశ్రయించే పరిస్థితిని కల్పించారు. అంటే టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏకీకృత నిర్ణయం తీసుకునే భయంకరమైన పరిస్థితి నెలకొన్నందున ఈ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించాం.

రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలను అస్తవ్యస్థం చేసే ఈ చట్టాన్ని రద్దు చేయాలని మేం భావించాం. అంతేగాక భూయజమాని ఒరిజినల్ డాక్యుమెంట్ ను పొందే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించాం. 

ఈ నేపథ్యంలో  ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సదరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసేందుకు మంత్రి మండలి తన ఆమోదం తెలియజేసింది.


3. సామాజిక పింఛన్లకు సంబంధించి గతంలో ఉన్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంగా పేరు మార్పు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది

 

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు తదితర పింఛన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేల రూపాయలకు పెంచుతూ మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెంచిన పెన్షన్ పెంపుదల నిర్ణయంతో 28 కేటగిరీలకు చెందిన దాదాపు 66 లక్షల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరనుంది. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏడాదికి రూ. 33వేల కోట్లకు పైగా ఖర్చు చేయనుంది.

ఈ మేరకు రూ. 4 వేలకు పెంచిన పింఛన్ మొత్తాన్ని ఏప్రిల్, మే, జూన్ లకు పెరిగిన రూ. వెయ్యి రూపాయల చొప్పున కలిపి ప్రతి పింఛన్ దారుకు మొత్తంగా రూ.7 వేల పింఛన్ ల మొత్తాన్ని జూలై 1వ తేదీన సచివాలయ ఉద్యోగులతో ఇంటివద్దనే అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది. 

దివ్యాంగులు, క్షయ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్ ను రూ. 3 వేల నుంచి రూ.6 వేల రూపాయలకు పెంచడం జరిగింది. 

అదేవిధంగా పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు ఇస్తున్న రూ.5 వేల పింఛన్ ను రూ.15 వేల రూపాయలకు పెంచడం జరిగింది.  

కిడ్నీ, లివర్, బైలేట్రల్ ఎలిఫెంటాసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న ఫించన్ ను రూ.5 వేల నుంచి రూ.10 వేల రూపాయలకు పెంచడం జరిగింది. 

కిడ్నీ డయాలసిస్, సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా, హెచ్ఐవీ తదితర వ్యాధిగ్రస్తులకు పెన్షన్ పంపిణీ డీబీటీ ద్వారా జరుగుతుందని మంత్రి మండలి నిర్ణయించింది.

ఈ విధంగా సామాజిక భద్రతా పింఛన్ల పెంపుదల వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది.  ఏరియర్స్ తో కలిపి నెలకు రూ. 4,408 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంది. 


4.రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సెన్సెస్-2024 నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 

ఏ దేశమైనా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే నైపుణ్యం కలిగిన యువత ఎంతో అవసరం. అది గుర్తించిన మన ప్రభుత్వం అందుకనుగుణంగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సెన్సెస్-2024 నిర్వహణకు తొలి మంత్రి మండలిలోనే ఆమోదం తెలియజేసింది. 

ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 310 ఇంజినీరింగ్ కాలేజీలు, 1400 డిగ్రీ కాలేజీలు, 267 పాలిటెక్నిక్ కాలేజీలు, 516 ఐటీఐ కాలేజీ ల నుండి దాదాపు 4.4 లక్షల యువత ఆయా కోర్సులను పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. 

అయితే డిమాండ్, సప్లై మరియు అందుబాటులో ఉన్న సదుపాయాల ఆధారంగా స్కిల్ గ్యాప్ ను అంచనా వేయడం, ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని  మన యువతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా చేసి ప్రపంచ యవనిక పై మన ముద్ర ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

యువతకు నైపుణ్య అవసరాలు అలాగే పారిశ్రామిక అనుబంధ సంస్థలు, వ్యవసాయ రంగం, మార్కెటింగ్ సంస్థలు, ప్రొడక్షన్ సంస్థలు వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా సంస్థల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య సర్వేని 3 నుంచి 4 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది.

ఈ సెన్సెస్ లో అందుబాటులో ఉన్న స్కిల్ ప్రొఫైల్స్, స్కిల్ నీడ్స్, స్కిల్ ఇన్ డిమాండ్, స్కిల్ లభ్యత మధ్య అంతరాన్ని గుర్తించడం, అంచనా వేయడం, తదనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణలు డిజైన్ చేసేలా ప్రభుత్వానికి సమాచారం అందించడం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువత సదరు నైపుణ్యాలను సాధించేలా శిక్షణ అందించడం ఈ సెన్సెస్ ముఖ్య లక్ష్యాలు.    అంతిమంగా మన రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ సంకల్పం. 


5. రాష్ట్రం లోని పేదవారి ఆకలి దప్పులను తీర్చే లక్ష్యంతో సబ్సిడీ ధరకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు గతంలో మంజూరు చేసిన అన్నా క్యాంటీన్‌లను పున: ప్రారంభించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.


గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను కక్షపూరితంగా మూసివేసి నిరుపేదల నోటి దగ్గర ముద్ద తీసేసింది. పేదవాడి ఆకలి దప్పులను తీర్చేందుకు సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన రోజునే అన్నా క్యాంటీన్ లను పునరుద్ధరిస్తూ సంతకం పెట్టారు.  

ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్ లను పున:  ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నారు. తొలి దశలో 183 అన్నా క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మిగిలిన 20 క్యాంటీన్లను కూడా తదుపరి దశలో ప్రారంభించాలని నిర్ణయించింది.

ఈ అన్నా క్యాంటీన్ ల ద్వారా పేద అన్నార్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సబ్సిడీ ధరకే  అందించడం జరుగుతుంది.  


6. విజయవాడలోని డా.వైయస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా పునర్ నామకరణం చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

  

1986లో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ను ఏర్పాటు చేసింది. 

1998లో ఈ చట్టానికి సవరణ చేసి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గాడ నామకరణం చేసింది. 

అనంతరం 2006లో డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్పు చేసింది.   2022లో ఈ యూనివర్సిటీ పేరును గత ప్రభుత్వం డా.వైయస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్చింది.

ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరిస్తూ స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా యూనివర్సిటీకి ఆయన పేరుతో పునర్ నామకరణం చేయాలన్న ప్రతిపాదనకు మండలి ఆమోదం తెలిపింది. 

విదేశాలకు వెళ్ళే వైద్య విద్యార్థులకు  కళాశాల పేరు మారడం వలన సాంకేతిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న కారణంగా తిరిగి అదే పేరును పునరుద్ధరించేందుకు నిర్ణయించడం జరిగింది. 


7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ ను నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వపు అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిల రాజీనామాలను ఆమోదిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. 


ఇతర అంశాలు :


ప్రజల్లో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై అవగాహన కల్పించేందుకు 7 శ్వేత పత్రాలను విడుదల చేయాల్సిందిగా మంత్రి వర్గానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. 

పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం( ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవి), లిక్కర్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ మరియు ఆర్థిక శాఖల పై శ్వేత పత్రాలను విడుదల చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ నెల 28 నుండి జులై 18 వరకు రెండు మూడు రోజులకొకసారి శ్వేత పత్రాలు విడుదల చేయడం జరుగుతుంది. 

గత 5 సంవత్సరాల్లో  సంస్థలు ఏ విధంగా కుంటు పడ్డాయన్న విషయాన్ని ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులకు ఉందన్నారు.

ఇవే గాక అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల పారిశుద్ధ్య పనులను వెంటనే ప్రారంభించాలి.

చివరి ఆయకట్టుకు నీరు అందించే దిశలో కాల్వలు, చెరువుల్లో పూడిక, డెక్క తొలగించే కార్యక్రమాన్ని సత్వరమే చేపట్టాలి.

వర్షాకాలం ప్రారంభం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లతో సమాయత్తం కావాలని మంత్రి వర్గానికి సూచనలు జారీ

అధ్వాన్నంగా మారిన రోడ్లు, రహదారులు గతుకులమయం అయినందున వెంటనే పాట్ హోల్స్ ను పూడ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీకి ఆదేశాలు జారీ..

మత్తు, మాదక ద్రవ్యాల వినిమయం రాష్ట్రంలో అధికమైన నేపథ్యంలో వాటి నుండి యువతను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసేందుకు ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో విద్యాశాఖ, ఆరోగ్యశాఖ, హోం, ఎక్సైజ్, ట్రైబల్ వెల్ఫేర్ వంటి శాఖల మంత్రులు ఉంటారు. భావితరాల భవిష్యత్ కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.


Vidya pravesh Day - 10 (25/06/2024) activities for primary class

విద్యాప్రవేశ్ -10 వ రోజు తేదీ 25/06/2024 నాడు నిర్వహించవలసిన కృత్యాలు

Language & Literacy Development:


పిల్లలు T.V. లో చూసే కార్టూన్ షోలు, వారికి నచ్చే కార్టూన్ క్యారెక్టర్లు గురించి మాట్లాడించాలి.


Cognitive Development:


స్పర్శ గ్రహించి చెప్పండి:


 రెండు సమూహాలు చేసి పువ్వులు పండుగా విభజించి పువ్వులు, పండ్లు పేర్లు పిలుస్తూ ముక్కు మెల్లగా గిల్లే తాకే ఆట ఆడించాలి కళ్ళు మూసుకున్న వ్యక్తి తనను తాగిన వ్యక్తిని గుర్తించాలి.


Physical Development:


చుక్కల్లో ఉన్న బొమ్మలను లేదా పువ్వులను కలుపుట మరియు రంగులు వేయుట.

Vidya Pravesh Day - 09 24/06/2024 activities for primary

విద్యాప్రవేశ్ -9 వ రోజు తేదీ 24/06/2024 నాడు నిర్వహించవలసిన కృత్యాలు

Language & Literacy Development:-

పిల్లలతో వారి శరీర భాగాల పేర్లు చెప్పించడం. ఉదా: పిల్లలు కన్ను చూపిస్తూ కన్ను అని చెప్పాలి.


Cognitive Development:


విని గ్రహించి చెప్పండి:


పిల్లలకు కళ్లకు గంతలు కట్టి వివిధ ధ్వనులను వినిపించాలి గజ్జలు, మువ్వల సవ్వడి, గాజుల గలగల, వినిపించాలి. పుస్తకాల కాగితాలు తిరగవేయటం, చెప్పులతో నడవడం ఫ్యాన్ తిరుగుతున్న సౌండ్ మొదలైనవి గ్రుడ్డివారు చీకటిలో ఉన్నప్పుడు శబ్దాలను ఎలా గ్రహిస్తారో చర్చించాలి.


Physical Development:


గురి చూసి విసరడం టీచర్ క్లాస్ రూమ్ లో పిల్లలను వలయాకారంలో కూర్చోబెట్టి ఒక బాస్కెట్ కి ఎదురుగా కొంత దూరంలో నిలబెట్టి బంతిని ఇచ్చి విసరమనాలి. (ఆ బాస్కెట్ లో పడేలాగా)

Vidya Pravesham" (విద్యా ప్రవేశం) Launching and Orientation Programme scheduled for 4:00 PM on June 24, 2024.

Vidya Pravesham (విద్యా ప్రవేశము) 

 Drive Launch and Orientation Live

విద్యాప్రవేశం కార్యక్రమానికి సంబంధించి ఏపి సమగ్ర శిక్ష వారిచే YouTube లైవ్ 4 గం లకు ఓరియెంటేషన్ కార్యక్రమం.

 Vidya Pravesham (విద్యా ప్రవేశము) Enrollment Drive Launch and Orientation

YouTube link to watch the programme:

 https://youtube.com/live/xrF_CVLSM74?feature=share

https://youtube.com/live/xrF_CVLSM74?feature=share

Samagra Shiksha, AP – Quality Initiatives –conduct of Vidya Pravesham విద్యా ప్రవేశం- student enrolment program in Andhra Pradesh - certain

 విద్యా ప్రవేశం కార్యక్రమం లో భాగంగా జూన్ 24 నుండి చేయవలసిన కార్యక్రమాలు మరియు పూర్తి ఉత్తర్వులు క్రింది లింక్ లో 

Click Here to Download proceeding

Click Here to Download annexure 

Click Here to Download activities

Vidya Pravesh day 8 activities for primary students

విద్యాప్రవేశ్ -8 వ రోజు తేదీ 22/06/2024 నాడు నిర్వహించవలసిన కృత్యాలు


Language & Literacy Development:

ఆనందం ఆనందం గేయాన్ని అభినయంతో పాడుతూ పిల్లలతో చేయించాలి.


Cognitive Development:


చూసి చెప్పండి:

పండ్లు/కూరగాయలు/ వంట సామాగ్రి /కొన్ని వస్తువులు పిల్లల ముందు బల్లమీద ఉంచి (8-10) రెండు నిమిషాలు చూడమనాలి. తర్వాత వాటిని తీసేసి పిల్లల్ని గుర్తు చేసుకొని, తిరిగి చెప్పించాలి.


Physical Development


Stand, Sit ఆట ఆడించుట (jump,hope) మొదలైనవి.

కావాలని ఎవర్నీ అవమానించలేదు. ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ గారి వీడియో సందేశం

సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ పశ్చా త్తాపం వ్యక్తంచేశారు.


 పాఠశాల విద్యాశాఖలో తాను కావాలని ఎవర్నీ అవమానించలేదని, ఎవ రికైనా అలా అనిపిస్తే వారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని తెలిపారు.


 పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి స్థానం నుంచి ప్రభుత్వం ఆయనను బదిలీ చేసింది.


 సచివాలయంలో గురువారం కొత్త కార్యదర్శి కోన శశిధర్ కు  బాధ్యతలు అప్పగిం చిన అనంతరం ప్రవీణ్ ప్రకాష్ ఓ వీడియోను. విడుదల చేశారు.


 'గత ఏడాదిన్నరలో ఎన్నో నేర్చు కున్నాను. విద్యాశాఖ పురోగతి కోసమే కృషి చేశాను. 


నేను తనిఖీలతో ఉపాధ్యాయులు, సిబ్బందిని  అవమానించానంటూ సామాజిక మాధ్య మాల్లో ఎన్నో వచ్చాయి. 


అభ్యసన సామర్ధ్యాలు పెంచేందుకే మాట్లాడాను. ఎవర్ని అవమానించేందుకు అలా చేయలేదు. 


ఎవరైనా అలా భావిస్తే చేతులు జోడించి, ప్రార్థిస్తున్నాను. దయచేసి వాటిని మనసులో ఉంచుకోకండి.


 మరో మనిషిని అవమానించే గుణం నాకు లేదు' అని తెలిపారు

Vidya pravesh Day - 07 activities 21/06/2024

విద్యాప్రవేశ్ 7 వ రోజు నిర్వహించవలసిన కృత్యాలు.

Language & Literacy Development:-

CHUBBY CHEEKS, DIMPLE CHIN Action rhyme అభినయంతో పాడించాలి.

Chubby cheeks, dimple chin

Rosy lips, teeth within

Curly hair, flows in air

Eyes are blue, lovely too

Teacher's pet, is that you?

yes, yes, yes

Chubby cheeks, dimple chin

Rosy lips, teeth within

Curly hair, flows in air

Eyes are blue, lovely too

Teacher's pet, is that you?

yes, yes, yes

Chubby cheeks, dimple chin

Rosy lips, teeth within

Curly hair, flows in air

Eyes are blue, lovely too

Teacher's pet, is that you?

yes, yes, yes


Cognitive Development:-

తాకి -స్థితిని చెప్పండి

పిల్లల కళ్ళకుగంతలు కట్టి సున్నితమైన, గరుకువైనవి, పిండి, రవ్వ, నునుపైన, నేల, మట్టి, పిండి, మృదువైన, గట్టిదైన, పువ్వులు, ఆకులు, గోడ, బల్ల ఇటుకా మొదలైనవి చూపుతూ గుర్తించి చెప్పమనాలి.


Physical Development:-


outdoor play

పిల్లలను వారికి నచ్చిన ఆటను ఆడించాలి. ఇసుక అందుబాటులో ఉంటే ఇసుకలో ఆటలు ఆడించాలి.

Samagra Shiksha, A.P – SIEMAT – Observation of 10th International Day of Yoga i.e IDY–2024, on 21.06.2024 – Nomination of State Nodal Officer and District Coooordinators

అంతర్జాతీయ యోగా దినోత్సవం 21-06-2024 నాడు నిర్వహించ వలసిన యోగా కార్యక్రమాలతో  కూడిన పుస్తకం.

Click Here to Download book

అన్ని పాఠశాలల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం 21-06-2024 నాడు నిర్వహించాలంటూ తాజా ఉత్తర్వులు విడుదల

యోగా ప్రోటోకాల్ వీడియోలు,  కార్యక్రమాలు ఫోటోలు అప్లోడ్ చేయాల్సిన లింక్, ఉత్తర్వుల కాపీ క్రింది వెబ్ పేజీలో కలవు.

Click Here to Download proceedings

School Education- SCERT, A.P- To conduct Teach Classroom Observers training at District level- Revised Training Dates

టీచ్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ పై ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం. రెండు విడతల్లో నిర్వహణకు మార్గదర్శకాలు విడుదల

జులై 1 నుండి 10వ తేదీ వరకు మొదటి విడత  లో హాజరు కావలసిన జిల్లాల జాబితా

జులై 18 నుంచి 27 వరకు 2వ విడత  లో హాజరు కావలసిన జిల్లాల జాబితా విడుదల

జిల్లాస్థాయి నాన్ రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమం

పూర్తి మార్గదర్శకాలు షెడ్యూలు ఉపాధ్యాయుల జాబితా విడుదల

Click Here to Download proceedings

Ias postings in ap

AP లో  భారీగా ఐఏఎస్ ల బదిలీలు. ఎవరికి ఏ శాఖ కి బదిలీ అంటే

- పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జీఏడీకి అటాచ్ 

- ⁠ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ జీఏడీకి అటాచ్ 

- ⁠పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్  జీఏడీకి అటాచ్

- ⁠జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్

- ⁠పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా శశిభూషణ్ కుమార్ 

- ⁠వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్ 

- ⁠కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది 

- ⁠పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్

- ⁠పౌరసరఫరాలశాఖ కమిషనర్ గా సిద్ధార్థ్ జైన్ 

- ⁠ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్ 

- ⁠నైపుణ్యాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శిగా సౌరభ్ గౌర్ కు అదనపు బాధ్యతలు 

- ⁠పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్ 

- ⁠ఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా కోన శశిధర్ కు పూర్తి అదనపు బాధ్యతలు 

- ⁠ఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు.ఎ 

- ⁠ఏపీ సీఆర్డీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్ 

- ⁠ముఖ్యమంత్రి కార్యదర్శిగా ప్రద్యుమ్న

- ⁠ఆర్థికశాఖ వ్యయ విభాగం కార్యదర్శిగా ఎం.జానకి 

- ⁠పశుసంవర్థకశాఖ కార్యదర్శిగా ఎం.ఎం.నాయక్ 

- ⁠గనులశాఖ కమిషనర్, డైరెక్టర్ గా తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్

- ⁠ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్ కుమార్ కు అదనపు బాధ్యతలు 

- ⁠తిరుపతి జేసీకి జిల్లా కలెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు 

- ⁠జీఏడీకి రిపోర్ట్ చేయాలని మురళీధర్ రెడ్డికి ఆదేశాలు 

- ⁠ఆర్థికశాఖ కార్యదర్శిగా వి.వినయ్ చంద్

Annual Grade Increment AGI sanction request online application form

వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు కొరకు DDO గారికి ఇవ్వవలసిన అప్లికేషన్ ను కొంత డేటా ఇచ్చి సబ్మిట్ చేస్తే ఆటోమాటిక్ గా వార్షిక ఇంక్రిమెంట్ అప్లికేషన్ జనరేట్ అవుతుంది. మీ ఫోన్ లో PDF గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.