మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

APRJC & APRDC CETS 2022 Hall Tickets Available for Download

APRJC & APRDC CETS 2022 హాల్ టికెట్స్ విడుదల చేయడం జరిగింది అభ్యర్థులు వారి యొక్క హాల్ టికెట్  ను క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

పరీక్ష తేదీ: 05.06.2022

https://aprs.apcfss.in/

PM kisan Samman nidhi Beneficiary status using aadhar no

పీఎం కిసాన్ పెట్టుబడి సాయం కింద రైతులకు వారి అకౌంట్ లో నగదు జమ చేయడం జరిగింది ఆధార్ నంబర్ ఇచ్చి వారి అకౌంట్ లో చెక్ చేసుకోవచ్చు

https://pmkisan.gov.in/beneficiarystatus.aspx

Without using ear phones listen radio channels

ఇప్పుడు మీరు ఇయర్ ఫోన్ లేకుండా కూడా వరల్డ్ వైడ్ రేడియో వినవచ్చు. ఇది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) నుండి మీరు లింక్‌పై క్లిక్ చేసినప్పుడు, భూగోళం తిరగడాన్ని మీరు చూడవచ్చు.  మీరు తాకిన ఆకుపచ్చ చుక్కలు ఉన్నాయి, మీరు ఆ ప్రదేశం నుండి ప్రత్యక్ష రేడియో వినడం ప్రారంభించవచ్చు.  మీ స్థానిక రేడియోను ప్రయత్నించండి !

 http://radio.garden/live

జగనన్న అమ్మఒడి NEW UPDATES

👉గత రెండు సంవత్సరములు అమ్మఒడి పథకం డబ్బులు మీరు మీ యొక్క  బ్యాంకు అకౌంట్ వివరాలు స్కూల్ ఇచ్చేవారు , వాటినే  స్కూల్ లాగిన్ లో ENROLL చేసేవారు, ఆ బ్యాంకు అకౌంట్ లో డబ్బులు పడేవి

👉కానీ ఈ సంవత్సరం ఆలా కాదు. NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ లో మాత్రమే అమ్మఒడి డబ్బులు పడతాయి. NPCI లింక్ అయిన బ్యాంకు వివరాలు మాత్రమే స్కూల్ లాగిన్ లో ENROLL చేయాలి. NPCI అనగా NATIONAL PAYMENT CORPORATION OF INDIA. ఇది కేవలం అమ్మఒడి అనే కాదు ప్రభుత్వం నుండి రావాల్సిన ఏ నగదు అయినా NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ లో మాత్రమే పడతాయి . అది అమ్మఒడి కావచ్చు మరొకటి కావచ్చు.

👉బ్యాంకు అకౌంట్ NPCI కి LINK చేయటమంటే ఇదేదో కొత్తగా శ్రమ తీసుకొని చేయవలసిన పని ఏమి కాదు. బ్యాంకు అకౌంట్ ఆధార్ తో లింక్ చేయబడి ఉండటమే. ఆధార్ తో లింక్ చేయబడిన ప్రతి ఒక్కరి ఒక అకౌంట్ ఇప్పటికే మన ప్రమేయం లేకుండానే NPCI కి LINK చేయబడే ఉంటుంది. ఇక్కడ ఒక అకౌంట్ అనేది గమనించాల్సిన విషయం. ఒక వ్యక్తికీ మూడు లేదా నాలుగు బ్యాంకు అకౌంట్ లు ఉంటే వాటిలో ఒక బ్యాంకు అకౌంట్ మాత్రమే NPCI కి లింక్ అయి ఉంటుంది. మనకు ఉన్న బ్యాంకు అకౌంట్ లలో ఏది NPCI కి లింక్ అయి ఉంది అనే విషయం మనకు తెలిసి ఉండాలి. ఎలా తెలుసుకోవాలి అనేది క్రింద వివరించటం జరిగింది.

👉మనకు ఉన్న బ్యాంకు అకౌంట్ లలో ఏ అకౌంట్ NPCI కి లింక్ అయి ఉంది, దానినే స్కూల్ లో ఇచ్చామా లేక వేరేది ఇచ్చామా అనేది సరి చూసుకోవాలి. రెండు ఒకటే అయితే సరే అమ్మఒడి డబ్బులు వస్తాయి. రెండు వేరు వేరుగా ఉన్నాయి అంటే అమ్మఒడి డబ్బులు రావు, రెండు ఒకటే ఉండేలా అటు బ్యాంకు లో అయినా లేదా ఇటు స్కూల్ లో అయినా మార్చుకోవాలి.

👉ఒక PARENT ఒక బ్యాంకు లో మాత్రమే అకౌంట్ ఉంది అనుకుందాం, ఒక అకౌంట్ మాత్రమే ఉంది అది ఆధార్ లో లింక్ అయి ఉంది కాబట్టి NPCI కి కూడా లింక్ చేయబడి ఉంటుంది , దానినే స్కూల్ లో ఇచ్చి ఉంటారు , దానిలోనే అమ్మఒడి డబ్బులు పడతాయి . ఇక్కడ ఏ సమస్యా రాదు.

👉మరొక PARENT కి మూడు బ్యాంకులలో అకౌంట్ లు ఉన్నాయి అనుకుందాం. ఉదాహరణకు 1.UNION BANK, 2.SBI, 3.BANK OF INDIA అనుకుందాం. వీటిలో ఏది NPCI కి  లింక్ అయి ఉందో అని CHECK చేస్తే SBI చూపిస్తుంది అనుకుందాం, కానీ స్కూల్ లో BANK OF INDIA ఇచ్చారు అనుకుందాం. ఇక్కడ సమస్య వస్తుంది. BANK OF INDIA లో డబ్బులు పడవు, SBI లో మాత్రమే పడతాయి. గత రెండు సంవత్సరాలు BANK OF INDIA లోనే డబ్బులు పడి నప్పటికీ ఈ సంవత్సరం పడవు.

👉ఇప్పుడు PARENT కి రెండు OPTIONS ఉంటాయి.

👉మొదటి OPTION , SBI అకౌంట్ వాడుకలో ఉండేలా చూసుకోవాలి ఒకవేళ చాలా రోజులు వాడక INACTIVE లో ఉంటే ACTIVE చేయించాలి  మరియు స్కూల్ లో BANK OF INDIA కి బదులుగా SBI అకౌంట్ వివరాలు ఇచ్చి BANK OF INDIA వివరాలు తీసేసి SBI అకౌంట్ వివరాలు ENROLL చేయమని స్కూల్ వారిని అడగాలి.

రెండవ OPTION , SBI లో పడడానికి వీలులేదు మాకు ఎప్పటి లాగానే  BANK OF INDIA లోనే పడాలి అంటే , BANK OF INDIA బ్యాంకు కు వెళ్లి అకౌంట్ ని  NPCI కి లింక్ చేయమని బ్యాంకు వారిని అడగాలి.

👉ఇలా NPCI లింక్ అయిన బ్యాంకు అకౌంట్ మాత్రమే స్కూల్ లో ENROLL అయి ఉండేలా చూసుకొనగలరు

Google Read along - Read Along App Download - May -2022 Schedule Story Links

Google Read Along షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ. విద్యార్థుల చదవాల్సిన స్టోరీ లింకులు 20.05.22 నుండి 31.05.22 వరకు షెడ్యూల్. ఈ రోజు చదవవలసిన స్టోరీ .AP Ed.CET-2022 Conducted by SRI PADMAVATI MAHILA VISVAVIDYALAYAM, TIRUPATI on behalf of APSCHE,Mangalagiri, Guntur, AP.

ఎడ్ సెట్ కు  దరఖాస్తుల ఆహ్వానం

బీఈడీ కళాశాలల్లో 2022-23 ప్రవేశాలకు సంబంధించి ఏపీఎడ్సెట్ -2022 కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు .

రెగ్యులర్ బీఈడీ , బీఈడీ స్పెషల్ ( హెచ్.ఐ.వి.ఐ. , ఐ.డి. ) కోర్సుల్లో ప్రవేశానికి ఎడ్సెట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు . జూన్ 1 లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి , జులై 13 న ప్రవేశ పరీక్ష ఉంటుంది.

వివరాలకు https://cets.apsche.ap.gov.in ను సందర్శించాలి.

Click Here to Download notification 

Click Here to Download manual

Ammavodi eligible and ineligible students list using dise code

క్రింద ఇచ్చిన లింక్ open చేసి పాఠశాల dise code సహాయంతో అమ్మఒడి eligible మరియు reverification జాబితా చూడవచ్చు.. లిస్టులు డౌన్లోడ్ అవుతున్నవి.

https://ebadi.in/ammavodi1/

http://net.veganro.co/ammavodi/download.php

అమ్మ ఒడి అర్హుల మరియు అనర్హులు జాబితా ఏ కారణం తో అనర్హులో కూడా తెలుసుకోవచ్చు.మీ పాఠశాల యొక్క UDISE Code తో అమ్మ ఒడి అర్హులు జాబితా మరియు రీ వెరిఫికేషన్ జాబితా డౌన్లోడ్ చేసుకోండి

జూన్ 21న అమ్మఒడి? గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే ప్రాసెస్. పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలున్నా ఓకే

రాష్ట్రంలో గడిచిన విద్యా సంవత్సరానికి సంబంధించి 'జగనన్న అమ్మఒడి' నిధు లు జూన్ 21న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యం లో అమ్మఒడి లబ్ధిదారుల జాబితాల రూపకల్పనలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు క్షేత్రస్థాయిలో వివరాలు నమోదు చేస్తున్నారు. అందు కోసం ప్రత్యేకంగా రూపొందించిన బెనిఫిషియరీ అవుట్ రీచ్ మొబైల్ అప్లికేషన్లో పథకానికి సంబంధించిన నిబంధనల మేరకు లబ్ధిదారుల అర్హతలు ఉన్నాయా లేదా అనేవి సేకరిస్తున్నారు. అమ్మఒడికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ నుంచి కేవలం హాజరు వివరాలు) మాత్రమే అందించనుంది. మరోవైపు లబ్ధిదారులు నివాసాల్లో కరెంట్ బిల్లులు 300 యూనిట్లు దాటాయా లేదా అనే వివరాలతోపాటు, వారికి ఉన్న రేషన్ కార్డు, వాహనాలు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించి అర్హుల జాబితాను రూపొందిస్తున్నారు. దాదాపు 42 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన వివరాలను యాప్ లో నమోదు చేస్తున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమ ఊళ్లకు వెళ్లిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమ్మఒడిలబ్దిదారుల జాబితాలకు సం బంధించిన మూడు జాబితాలను గ్రామ, వార్డు సచివాల యాల ఉద్యోగులే సిద్ధం చేస్తున్నారు. అలాగే ఈ పథకం కింద తప్పుగా నమోదైన విద్యార్థి వివరాల సవర ణలకూ ఒక దరఖాస్తు రూపొందిం చినమోదు చేస్తున్నారు.

దరఖాస్తుల ద్వారా వివరాల సేకరణ.

అమ్మఒడి పథకానికి సంబంధించి విద్యార్థులు అర్బన్, రూరల్ ప్రాంతాల్లో దేనికి సంబంధించిన వారు, జిల్లా, మండలం, విద్యార్థి చదువుతున్న స్కూల్ వివరాలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నమోదు చేస్తున్నారు. వివరాలు తప్పుగా ఉన్న విద్యార్ధులకు సంబంధించి రేషన్ కార్డు నంబర్, తల్లి, సంరక్షకుల పేరు, ఆధార్లతోపాటు విద్యార్థుల ఆధార్, స్కూల్ యూడైన్ కోడ్, బ్యాంక్ ఖాతాల వివరాలను దరఖాస్తుల ద్వారా సేకరిస్తున్నారు.

పోస్టల్ బ్యాంకు ఖాతాలకూ.

అమ్మఒడి పథకం నిధులు జమ చేసేందుకు ప్రస్తుతం విద్యార్థుల తల్లులకు బ్యాంకు ఖాతాలను ఉపయోగిస్తు న్నారు. దీనికి అదనంగా ఈ ఏడాది నుంచి పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతాలున్నా వాటిలో జమ చేయాలని ప్రభు త్వం నిర్ణయిం చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాలను ఆమోదిస్తా మని సర్క్యులర్ విడుదల చేశారు.

పోస్టల్ బ్యాంక్ ఖాతాలు జీరో అకౌంట్లు కావడంతో లబ్ధిదారులు ఎలాంటి కనీస మొత్తం లేకుండా ఖాతాలు తెరిచి, ఉపయోగిం చుకోవచ్చు. ఈ మేరకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి విద్యాశాఖ మంత్రికి ఒక లేఖ కూడా రాశారు. అలాగే రెగ్యులర్ బ్యాం కుల్లో ఏ విధంగా వివిధ రకాల నగదు జమ చేస్తారో.. ఆసౌకర్యాలన్నీ పోస్ట్బ్యంకులో కల్పిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత లబ్ధిదారులకు ఈ సదుపాయం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

పెట్రోల్ , డీజిల్ ధరలు భారీగా తగ్గించిన కేంద్రం

దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది . లీటర్ పెట్రోల్పై రూ .8 , డీజిల్పై రూ .6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది . తాజా తగ్గింపుతో వినియోగదారులకు లీటర్ పెట్రోలుపై రూ .9.50 , డీజిల్పై రూ .7 మేర తగ్గుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు . తగ్గించిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి .

DEPARTMENTAL TESTS కు అప్లై చేయడానికి అవసరమైన సమాచారం

Passport సైజ్ ఫోటో, వైట్ పేపర్ పై సంతకం , ఆధార్ నెంబర్ , ఫోన్ నెంబర్ , SSC XEROX , Father Name , Present working school Adress , House Address , Apply చేయాలనుకుంటున్న tests వివరాలు


దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 22.05.2022


Exam Processing fee : ₹ 500


Each Test Fee : ₹ 500


Govt Service charge : ₹ 11.24

GOT (88 & 97)మాత్రమే రాస్తుంటే ఫీజు : ₹ 1511.24

EOT 141 మాత్రమే రాస్తుంటే ఫీజు : ₹ 1011.24

GOT , EOT రెండు రాస్తుంటే ఫీజు : ₹ 2011.24

SGT లు 24 సంవత్సరాల స్కేలు , SA లు 12 సంవత్సరాల స్కేలు పొందాలంటే EOT  , GOT టెస్టులు పాసవ్వడం తప్పనిసరి.

గమనిక :- పరీక్ష తేదీలు ఇంకా ప్రకటించలేదు. గమనించగలరు.

Google Read along App installation and usage in detail.

Google Read Along యాప్ ఇన్‌స్టాలేషన్ మరియు వినియోగాన్ని వివరంగా   చూడండి.

Reading Campaign లో భాగంగా "Google Read Along App" అన్ని మండలాలకు పార్టనర్ కోడ్స్ రిలీజ్ చేసారు.

Click Here to Download partner codes

యాప్ ఉపయోగించేవారు అందరూ మీమీ మండల పార్టనర్ కోడ్ ను యాప్ లో రిజిష్టర్ చేయాలి.

ఈ క్రింది Google Read Along (Bolo) App లేటెస్ట్ వెర్షన్ క్రింది లింక్ లో కలదు

Read along app link

https://play.google.com/store/apps/details?id=com.google.android.apps.seekh

Jvk app login process and website for download app

2022_2023 విద్యా సంవత్సరానికి గాను జగనన్న విద్యా కానుక JVK3  APP ను  nadunedu.se.ap.gov.in/JVK అనే  website నుండి Download  చేసుకోవాలి.

 APP Download చేసుకున్న తరువాత login ID(IMMS app user ID) లను మీ మీ జిల్లాల DEO/APC  లకు mail చేయడం జరిగింది.మీ జిల్లా CMO ద్వారా మీకు అందచేయబడ్డాయి. password ను 1234 తో login అవ్వాలి.

JVK3 App Login అయ్యాక ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పుడు 1 వ తరగతి enrollment ని 2 వ తరగతి గా promote చేయడం జరిగింది. అలాగే ప్రస్తుత 1 వ తరగతి విద్యార్ధుల సంఖ్యను 1 వ తరగతి గా చూపించడం జరిగింది 

2 వ తరగతి ని 3 వ  తరగతి గా 

3 వ తరగతి ని 4 వ తరగతి గా

4 వ తరగతి ని  5 వ తరగతి గా 

5 వ తరగతి ని  6 వ తరగతి గా 

JVK3 app Promote చేయడం జరిగింది కాబట్టి  ప్రధానోపాధ్యాయులు కూడా అదే మాదిరిగా  JVK app లో  వచ్చే విద్యా సంవత్సరానికి indent raise చెయ్యాలి.

ప్రాథమికోన్నత పాఠశాలల్లో  కూడా ఇదే మాదిరిగా  indent raise చెయ్యాలి. ఆ పాఠశాలలో highest class 7 వ తరగతి గా ఉంటే  8 వ తరగతి వరకూ indent  raise  చెయ్యాలి.(7 వ తరగతి ని 8 వ తరగతి గా promote చేశాము కాబట్టి)

ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం 6 వ తరగతి విద్యార్ధుల సంఖ్యను 7 వ తరగతి గా jvk app లో  చూపించడం జరిగింది. అదేవిధంగా 7 తరగతి విద్యార్థులను 8 వ తరగతి గా, 

8 వ తరగతి విద్యార్థులను 9 వ తరగతి గా

9 వ తరగతి విద్యార్థులను 10 వ తరగతి విద్యార్ధులు గా jVK3 app లో promote  చేయడం జరిగింది. 

అందరూ  ప్రదానోపాధ్యాయులు తన పాఠశాలల్లో తరగతి వారీగా  jvk component వారీగా విద్యార్థుల సంఖ్యను enter చేసి  submit చెయ్యాలి.

We Love Reading Summer campaign 2022 guidelines

అన్ని యాజమాన్య పాఠ శాల ల హెడ్ మాస్టర్ లు 14-05-2022 తేదీ లోగా పేరెంట్స్,టీచర్స్ మరియు విద్యార్థులతో మీటింగ్ పెట్టుకొని we love reading కార్యక్రమం గైడ్ లైన్స్ వివరించి కార్యక్రమ నిర్వహణకు పేరెంట్స్ మరియు కమ్యూనిటీ సహాయం కోరాలి.

తదుపరి విద్యార్థులకు టీచర్ల సహాయం తో లైబ్రరీ పుస్తకాలు వారి సామర్థ్యాల మేరకు ఎంపిక చేసి ఇవ్వాలి.

సెలవులలో ఆ పుస్తకాలను చదవమని ప్రోత్సహించాలి.

ఒక పుస్తకం చదివిన తరువాత అదే గ్రామంలోని ఇతర విద్యార్థులతో ఆపుస్తకాన్ని  ఎక్స్ చేంజ్ చేసుకోవాలి అని విద్యార్థులకు తెలియజేయండి.

విద్యార్థులకు పుస్తక పఠనం పై అవగాహన కల్పించి ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులు వారికి సరైన మార్గదర్శనం చేయాలి.

30 రోజుల తరువాత విద్యార్థులను పాఠ శాల కు పిలిపించి పాత పుస్తకాలను వెనక్కి తీసుకొని కొత్త పుస్తకాలను ఇవ్వాలి.

స్కూల్ రీ ఓపెనింగ్ డే రోజున విద్యార్థులకు వారు చదివిన పుస్తకాల పై స్టోరీ టెల్లింగ్,స్టోరీ రైటింగ్, ఎలక్యూషన్,డిబేట్,డిస్కషన్,డ్రామా, ప్లేలెట్,మోనో యాక్షన్ మొదలైన పోటీలు నిర్వహిస్తామని వారికి తెలియజేయండి.

ఈ వేసవి సెలవులలో 20 అంతకంటే ఎక్కువ పుస్తకాలు చదివిన వారికి సర్టిఫికెట్లు మరియు బహుమతులు ఇస్తామని తెలియజేయండి.

మండల విద్యాధికారులు మీ మండలాల అన్ని యాజమాన్య పాఠ శాలల ప్రధానోపాధ్యాయులు కు మీటింగ్ నిర్వహించి, వేసవి సెలవులలో నిర్వహించాల్సిన we love reading కార్యక్రమం గురించి వివరించి అన్ని పాఠ శాల ల్లో కార్యక్రమం నిర్వించులాగున చర్యలు తీసుకోవాలి మరియు పర్యవేక్షించాలి.

Ap gurukula schools 5th class entrance notification

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో 2022-23 విద్యా సం. 5వ తరగతి ప్రవేశాలకు లాటరీ ద్వారా భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల.

➪ దరఖాస్తు ప్రక్రియ: 09-05-2022 నుండి 31-05-2022 పూర్తి నోటిఫికేషన్

Click Here To Download Notification

AP EdCET 2022 NOTIFICATION

AP EdCET 2022 NOTIFICATION

రెండు సంవత్సరాల b.ed కోర్సులో జాయిన్ అవ్వడం కోసం ఎడ్ సెట్ 2022 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ పూర్తి సమాచారం

ENTRANCE TEST : 13-07-2022

Online submission of applications : 09-05-2022

Last date for submission of online application : 07-06-2022Download IMMS App Latest version 1.4.1 Dated 4-5-22

IMMS APP వెర్షన్ ఈరోజు 1.4.1 కి (updated version 04.05.2022) అప్డేట్ చేయబడినది.

New Version 1.4.1 Features:

Egg and Chikki indent are available for last month.

పాత వెర్షన్ పని చేయదు. కింది లింక్ ద్వారా IMMS APP లేటెస్ట్ వెర్షన్ 1.4.1 డౌన్లోడ్ చేసుకోవచ్చు.

https://play.google.com/store/apps/details?id=com.ap.imms

Application form for EMRS admissions into Class 6th and 7th and 8th and 9th

గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు- ఆన్లైన్ అప్లికేషన్ (6,7,8,9 తరగతులకు)

https://apgpcet.apcfss.in/TWSixthForm.aprjdc

IMMS APP HM USER NUMBER, PARRENT COMMITTE USER NUMBER, SANITARY WORKER USER I. D. ARE CHANGED. NEW DISTRICTS CODES ARE GIVEN

IMMS app లో జిల్లా code మారింది. కొత్త జిల్లాల యొక్క కోడ్ లను క్రింది ఫైల్లో ఇవ్వటం జరిగింది. మీ పాత యూజర్ ఐడి లో లో మొదట ఉన్న రెండు నెంబర్స్ కు బదులుగా కొత్త జిల్లాల యొక్క కోడ్ ను పెట్టి ఉపయోగించవచ్చు.ex 17 (17070XXX) బదులు 32 (32070XXX) తో open అవుతుంది.

HM గారి user ID మొదటి రెండు అంకెలు 17 బదులు 32 తో login అవ్వండి. 

IMMS APP లో HM USER NUMBER, PARRENT కమిటీ USER NUMBER, SANITARY WORKER USER I. D. లు మారినవి..పాత యూసర్ I.D. నంబర్లు పనిచేయవు...కొత్త user number లు పైన ఉన్న లింక్ నొక్కితే స్టేట్ లో ఉన్న 26 జిల్లాల స్కూల్స్ యొక్క క్రొత్త user I. D. లు గల ఫైల్ వస్తాది. ఆ ఫైల్ లో మీ స్కూల్ యొక్క కొత్త USER I. D. రాసుకొని దానిని IMMS APP నందు లోడ్ చేసినచో మనకు APP ఓపెన్ అవ్వుతాది. పాస్వర్డ్ మాత్రం పాతదే అంటే imms@321..తర్వాత మనం డేటాను అప్లోడ్ చేయవచ్చు.


రేపు అక్షయ తృతీయ , బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి ?

మన సంస్కృతిలో ప్రతి పండుగ వెనుకా ఓ కారణం కనిపిస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఆ కారణాన్ని మర్చిపోయి , ఆచరణకే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాము. అందుకు ఉదాహరణే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాల్సిందే అన్న స్థాయిలో ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిందేనా ! అసలు బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి ?

అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని , ఏ పుణ్య కర్మని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.

అక్షయ తృతీయనాడు విష్ణుమూర్తిని పూజించాలని మత్స్య పురాణం పేర్కొంటోంది. విష్ణుమూర్తి పాదాలను అక్షతలతో అర్చించి , ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతోంది. జపం , హోమం , వ్రతం , పుణ్యం , దానం... ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పనీ అనంతమైన ఫలితాన్నిస్తుందని మాత్రమే మతగ్రంథాలు పేర్కొంటున్నాయి. అక్షయ తృతీయనాడు వివాహం చేసుకుంటే ఆ బంధం చిరకాలం  నిలుస్తుందనీ , జాతకరీత్యా వివాహబంధంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని నమ్ముతారు.

అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితం దక్కుతుంది కాబట్టి , ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే... మన సంపదలు కూడా అక్షయం అవుతాయన్న నమ్మకం మొదలైంది. అయితే కష్టపడో , అప్పుచేసో , తప్పు చేసో సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు , అప్పులు , పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పెద్దలు.

Current Affairs questions and answers Telugu medium and English medium

కరెంట్ అఫైర్స్కు సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు జవాబులు

1. ఇటీవల 'ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్' లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ఎవరు అందుకున్నారు?

 జ: సర్ డేవిడ్ అటెన్‌బరో 


2. ఇటీవల 2022కి 'UNESCO వరల్డ్ బుక్ క్యాపిటల్' గా ఎవరు పేరు పెట్టారు?

 జ: గ్వాడలజారా 


3. ఇటీవల భారతదేశం ఏ దేశంతో ట్రాన్స్‌మిషన్ ఇంటర్‌కనెక్ట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది?

 జ: మాల్దీవులు 


4. BRO@ 63 బహుళ డైమెన్షనల్ ప్రచారం ఇటీవల ఎక్కడ ఫ్లాగ్ చేయబడింది?

 జ: ఉత్తరాఖండ్ 


5. ఇటీవల ఏ దేశ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ అవార్డును అందుకున్నారు?

 జ: ఉక్రెయిన్ 


6. భారతదేశపు మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ 'దూద్ వాణి' ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది?

 జ: గుజరాత్ 


7. ఇటీవల 'బినాపానీ మొహంతి' మరణించారు, ఆమె ఎవరు?

 జ: రచయిత 


8. ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఫెయిర్ 'ఆహార్ 2022' ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది?

 జ: న్యూఢిల్లీ 


9. ఇటీవల 'ప్రాణహిత పుష్కరాల పండుగ 2022' ఎక్కడ జరుపుకున్నారు?

 జ: తెలంగాణ 


10. ఇటీవల ప్రసార భారతి ఏ దేశ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్‌తో జతకట్టింది?

 జ: అర్జెంటీనా 


11. ఇటీవల ఏ అంతరిక్ష సంస్థ యొక్క పట్టుదల అంగారకుడిపై సూర్యగ్రహణం యొక్క వీడియోను చిత్రీకరించింది?

 జ: నాసా 


12. ఇటీవల, ఎల్వెరా బ్రిటో మరణించారు, ఆమె ఏ క్రీడకు సంబంధించినది?

 జ: హాకీ 


13. ఏ దేశ మాజీ అధ్యక్షుడు మావాయి కివాకీ ఇటీవల మరణించారు?

 జ: కెన్యా 


14. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక అవగాహన ప్రచారాన్ని 'SAANS' ప్రారంభించింది?

 జ: కర్ణాటక 


15. ఇటీవల గ్లోబల్ మార్కెట్ల సహాయ వాణిజ్య మంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?

 జ: అరుణ్ వెంకటరామన్ 


1. Who has recently received the 'Champions of the Earth' Life Time Achievement Award?

Ans: Sir David Attenborough


2. Recently who has been named 'UNESCO World Book Capital' for 2022?

Ans: guadalajara


3. Recently India has proposed to establish transmission interconnection with which country?

Ans: Maldives


4. Where has the BRO@ 63 multi-dimensional campaign been flagged off recently?

Ans: Uttarakhand


5. Recently the President of which country has received the John F. Kennedy Award?

Ans: Ukraine


6. Where has India's first community radio station 'Doodh Vani' been inaugurated recently?

 Ans: Gujarat


7. Recently 'Binapani Mohanty' has passed away, who was she?

Ans: writer


8. Where was Asia's largest international food and hospitality fair 'Aahar 2022' organized recently?

 Ans: New Delhi


9. Where was the 'Pranahita Pushkarlu festival 2022' celebrated recently?

 Ans: Telangana


10. Recently Prasar Bharati has tied up with which country's public broadcaster?

Ans: Argentina


11. Recently which space agency's Perseverance has captured the video of solar eclipse on Mars?

 Ans: NASA


12. Recently, Elvera Brito has passed away, she is related to which sport?

 Ans: hockey


13. Which country's former President Mawai Kiwaki has passed away recently?

 Ans: Kenya


14. Recently which state government has started the social awareness campaign 'SAANS'?

 Ans: Karnataka


15. Recently who has been sworn in as the Assistant Commerce Minister for Global Markets?

 Ans: Arun Venkataraman‌‌

Beneficiary Account Statement by using Beneficiary Id or CFMS Id Service Re enabled in CFMS Portal

మన CFMS ID ని ఉపయోగించి 2018 నుండి ఇప్పటి వరకు ప్రతి నెలా మన శాలరీ వివరాలు BASIC PAY, DA, HRA Earnings, Deductions వివరాలను క్రింది లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

https://prdcfms.apcfss.in:44300/sap/bc/ui5_ui5/sap/zexp_bnf_paymt/index.html

LATEST POSTS

School Education -Mega DSC-2024 -Filling up(16,347)teacher posts in School Education and other line departments dealing with education, through Mega DSC(District Selection Committee)-2024

డీఎస్సీపై జీవో నెం 27 జారీ.16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆదేశాలు.డిసెంబర్‌ 31 నాటికల్లా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశాలు.ఈ ప్రక్రియన...